పరిశ్రమల భాగస్వామ్యం కోరిన ఐసీఎంఆర్
దిల్లీ: నిఫా వైరస్ ఇన్‌ఫెర్ చికిత్సకు ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీలను భారత్‌లోనే ఉత్పత్తికి సంబంధించిన అడుగులు పడుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇప్పటికే వీటిని విజయవంతంగా పరీక్షించింది. ఇప్పుడు వాటిని భారత్‌లో ఉత్పత్తి వాణిజ్య సంస్థల కోసం అన్వేషిస్తోంది. నిఫా వైరస్ ప్రబలే సీజన్లలో అత్యవసర ప్రాతిపదికన మోనోక్లోనల్ ఆంట్‌బాడీలను తయారుచేసి అందించిన కంపెనీలతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతోంది. ఈమెరకు ‘ఆసక్తి వ్యక్తీకరణ’ పత్రాన్ని విడుదల చేసింది.
ఎం102.4 చాలా ప్రభావవంతం: మోనోక్లోనల్ యాంటీ బాడీలు.. ల్యాబ్‌లో తయారు చేసే ఒక రకం ప్రొటీన్లు. హానికారక సూక్ష్మజీవుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే యాంటీబాడీలను ఇవి పోలి ఉంటాయి. నిఫా వైరస్ నివారణ, చికిత్సకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకూ పూర్తిస్థాయి టీకా లేదా యాంటీవైరల్ అందుబాటులోకి రాలేదు. ‘ఎం102.4’ అనే పూర్తిస్థాయి మానవ మోనోక్లోనల్‌లోని యాంటీబాడీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోందని పరీక్షల్లో తేలింది. ఇప్పటికే భారత్‌లోని కేరళతో పాటు ఆస్ట్రేలియాలోని అనేక మంది రోగులకు వీటితో చికిత్స అందించారని ఐసీఎంఆర్ అందించారు.