భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం| భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఫిక్స్ India Us Interim Trade Deal Fixed Tariff Reduction Export Boost


భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ మేరకు అమెరికా – భారత్ సంయుక్తంగా ఒప్పందాన్ని విడుదల చేశాయి. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టు పెట్టారు. ఈ మధ్యంతర ఒప్పందాన్ని చరిత్రాత్మకంగా అభివర్ణించారు. ఇది ఇరు దేశాలకు గ్రేట్ న్యూస్ అని మోదీ చెప్పారు.

భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం| భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఫిక్స్

న్యూఢిల్లీ : భారత్-అమెరికా మధ్య మధ్యతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది.ఈ మేరకు అమెరికా – భారత్ సంయుక్తంగా ఒప్పందాన్ని విడుదల చేసింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టు పెట్టారు. ఈ మధ్యంతర ఒప్పందాన్ని చరిత్రాత్మకంగా అభివర్ణించారు. ఇది ఎగుమతిదారులకు 30ట్రిలియన్ డాలర్లు భారతీయ మార్కెట్ మార్కెట్ కు దారులు తెరుస్తుంది. ఎంఎస్‌ఈలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

ఎగుమతులు పెరగడంతో మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్‌, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రీయ రసాయనాలు, గృహాలంకరణ, చేతివృత్తుల ఉత్పత్తులు, ఎంపిక చేసిన యంత్రాలు వంటి కీలక రంగాలకు లాభదాయకమని చెప్పారు. దేశీయ రైతుల ప్రయోజనాల పరిరక్షణకు మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, నూనెగింజలు, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇథనాల్, పొగాకుతో పాటు కొన్నిరకాల కూరగాయలు, మాంసం వంటి వ్యవసాయం, పాలపై సుంకాల విషయంలో అమెరికాకు రాయితీలు ఇవ్వలేదని గోయల్‌ తెలిపారు.

భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50 శాతం నుంచి 18శాతానికి తగ్గించినట్లు భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఒప్పందం. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా ప్రకటించింది. 500 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించిందని. ఈ నిర్ణయం ఎగుమతులకు ఖచ్చితంగా ఊరటగా ఉంది. ఈ ఒప్పందం సుంకాల తగ్గింపు, ఇంధన భాగస్వామ్యాల పునర్వ్యవస్థీకరణ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపొందించారు. దీని ద్వారా భవిష్యత్తులో కుదిరే విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) వైపు చర్చలను వేగవంతం చేయడానికి రెండు దేశాలు సంకల్పించినట్లు ఉమ్మడి ప్రకటనలో వెల్లడైంది. అయితే, పూర్తి స్థాయి ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఇంకా అనేక దశల చర్చలు అవసరమని కూడా స్పష్టం చేశాయి.

ఇది గ్రేట్ న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీ

భారత్ – అమెరికా మధ్య మధ్య వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స వేదికగా స్పందించారు. ఇది ఇరు దేశాలకు గ్రేట్ న్యూస్ అని గుర్తు చేశారు. ఒప్పంద సాకారం కోసం నిబద్ధతతో కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలను కొత్త దశకు తీసుకెళ్లడం, ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దీనిద్వారా, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్న మహిళలు మోదీ ఆకాంక్షించారు.

ట్రేడ్ డీల్ పై కాంగ్రెస్ ఫైర్

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. మాజీ కేంద్ర జై రాం రమేశ్ సూచన మంత్రి స్పందించారు. ‘హౌడీ మోదీ’ కంటే.. ‘నమస్తే ట్రంప్‌’ పైచేయి సాధించారంటూ జైఎద్దేవా చేశారు. స్నేహితుడు ఎన్నటికీ స్నేహితుడిగానే కొనసాగబోడంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ట్రేడ్ డీల్ పై భారత్- అమెరికా చేసిన సంయుక్త ప్రకటనలో వివరాలను సరిగ్గా ప్రస్తావించలేదు. కొన్ని వస్తువులపై అదనపు సుంకాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.



Source link

Spread the love