ముఖ్యమంత్రులతో నేడు మోదీ వర్చువల్‌ భేటీ


ఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రాల సన్నద్ధతపై, వాటి ప్రణాళికలపై చర్చించనున్నారు. యుద్ధం మొదలయ్యాక ఇలాంటి సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు మినహా మిగిలిన సీఎంలందరినీ దీనికి ఆహ్వానించారు. అద్భుతమైన స్ఫూర్తితో, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడానికి ఈ భేటీని ఏర్పాటుచేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి విడిగా సమావేశం కానున్నారు.



Source link

Spread the love