దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌తో యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇవాళ వైట్‌హౌస్‌లో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇరాన్ కీలక నాయకత్వం అంతమైందని అన్నారు. ఆ దేశ ఎయిర్‌ఫోర్స్, నౌకాదళం కూడా ధ్వంసమైందని తెలిపారు. యుద్ధం వల్ల ఇరాన్ పెద్ద ఎత్తున నష్టపోయిందని, అమెరికా భద్రత కోసం’ఎపిక్ ఫ్యూరీ’ అవసరమని అన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని. అమెరికా అంతం కావాలని ఇరాన్ కోరుకుంటోందని అన్నారు. యూఎస్‌ను శక్తివంతమైన దేశంగా మారుస్తామని పేర్కొన్నారు. తన పాలనలో ఎన్నో విజయాలను సాధించామని.. కానీ ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని అన్నారు. యుద్ధం ఇప్పట్లో ఆగేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్ తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తోందని, హార్ముజ్ జలసంధి నుంచి ఎలాంటి చమురు తనకు అక్కర్లేదని.. అది కేవలం ఆ దేశం కోసమే వినియోగించుకోవాలని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.