రాహుల్ గాంధీ, BJP vs కాంగ్రెస్, వియత్నాం పర్యటన, ప్రతిపక్ష నాయకుడు, షాజాద్ పూనావాలా, భారత రాజకీయాలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, MGNREGA చర్చ


  • వియత్నాం పర్యటనలో రాహుల్ గాంధీ..
  • ”పార్టీ-టూరిజం” లీడర్ అంటూ బీజేపీ విమర్శలు..
రాహుల్ గాంధీ: వియత్నాం టూర్‌లో రాహుల్ గాంధీ.. ''పార్టీ-టూరిజం'' లీడర్ అని బీజేపీ ఫైర్..

రాహుల్ గాంధీ: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విజయం సాధించారు. అయితే, ఈ పర్యటనపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఆయన ప్రతిపక్ష నేతకాదని, పార్టీలు చేసుకునే నేత, టూరిస్ట్ లీడర్ అంటూ విమర్శించింది. ఇటీవల, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా రాహుల్ గాంధీ జర్మనీలో ఉన్నారు. ”రాహుల్ గాంధీ శాశ్వతంగా సెలవుల మూడ్‌లో ఉంటారు” అని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా అన్నారు.

ఇది కూడా చదవండి: జపాన్: చైనాకు చెక్ పెట్టిన ఇండియా ఫ్రెండ్.. డ్రాగన్ ఆట ముగిసినట్లే!

”రెండు విదేశీ పర్యటన మద్య అతను కొన్ని రోజుల పాటు భారత్ వచ్చి జంగల్ సఫారీకి వెళ్లి, మళ్లీ విదేశాలకు వెళ్లిపోతాడు. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘాన్ని నిందిస్తారు. ఇది రాహుల్ గాంధీ సీరియస్ రాజకీయ నాయకుడు కాదని, పరిణతి లేని వ్యక్తి అని చూపిస్తోందని, అందుకే కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా సంతోషంగా లేవు’’ అని అన్నారు. విపక్షాలు రాహుల్‌ను తొలగించి ప్రియాంకను నియమించాలని కోరుతున్నాయని పూనావాలా అన్నారు. దేశానికి సంబంధించి కీలక సమస్యలు తలెత్తినప్పుడల్లా రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడం ఒక అనవాయితీగా మారిందని బీజేపీ ఎమ్మెల్యే జితేంద్ర గోత్వాల్ అన్నారు.





Source link

Spread the love