రైతు సమస్యలకు పరిష్కారం చూపాలి | general


మెట్‌పల్లి పట్టణం: రైతు సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇప్పటికీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతు సమస్యలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం రైతు సమస్యలపై తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.



Source link

Spread the love