రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత


చింతకాని : రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నామవరం హై స్కూల్ హెచ్ఎం సుధాకర్ రావు పేర్కొన్నారు. రోడ్డు భద్రత ఛాంపియన్‌షిప్ 2025-26లో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై బుధవారం అవగాహన కలిగించారు. విద్యార్థులందరూ రోడ్డు నియమాలు,  భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు ట్రాఫిక్ నిబంధనలు పాటించటం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని హెచ్ ఎం విద్యార్థులకు సూచించారు. ‌ ఈ సందర్భంగా పాఠశాలలో పలు ట్రాఫిక్, రహదారి చిహ్నాల గురించి చిత్రాలు వేసి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిలారి సురేష్,  భాగం ఉమామహేశ్వరరావు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.



Source link

Spread the love