
మహిళల వండే ప్రపంచకప్-2025 ఫైనల్‌కు భారత్ దూసుకెళ్లింది. గురువారం నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయింది 48.3 ఓవర్లలో చేధించింది.
ఈ భారీ లక్ష్య చేధనలో భారత ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన షెఫాలీ వర్మ(10), స్మతి మంధాన(24).. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ విరోచిత పోరాటం కనబరిచింది. ఆజేయ సెంచరీతో భారత జట్టును ఫైనల్‌కు చేర్చింది. 134 బంతులు ఎదుర్కొన్న రోడ్రిగ్స్.. 14 ఫోర్ల సాయంతో 127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (89; 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుతంగా ఆడింది. వీరిద్దరితో పాటు దీప్తి శర్మ (24), రిచా ఘోష్ (26), అమన్‌జ్యోత్ కౌర్(15) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.