వాణిజ్య ఒప్పందాలు వాయిదా | ట్రంప్ 15% టారిఫ్ మూవ్ మధ్య భారతదేశం US ట్రేడ్ డీల్ చర్చలు ఆలస్యం, నీల్ కత్యాల్ స్పందించారు


ABN
ప్రచురించిన తేదీ – ఫిబ్రవరి 23 , 2026 | 01:33 AM

భారత్‌-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు నిలిచిపోయాయి. ఇటీవలే ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలపై ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల…

వాణిజ్య ఒప్పందాలు వాయిదా

  • ట్రంప్ సుంకాల్లో మార్పుల నేపథ్యంలోనే..

  • పరిణామాలను సమీక్షించిన అనంతరం

  • అమెరికా, భారత్‌తో భేటీ

  • ఈ 15 శాతం సుంకాలకూ చట్టబద్ధత ఎక్కడ?

  • ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా వాదించారు

  • లాయర్‌ నీల్‌ కత్యాల్‌ మండిపాటు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: భారత్‌-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు నిలిచిపోయాయి. ఇటీవలే ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలపై ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒప్పందంలోని అంశాలకు తుది మెరుగులు దిద్ది మార్చి మూడో వారానికల్లా సంతకాలులా ఇరుదేశాల చర్యలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా సోమవారం (23న) నుంచి మూడు రోజులపాటు అమెరికాలో వాషింగ్టన్‌లో ఇరు దేశాల బృందాల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. కానీ ట్రంప్‌ అదనపు సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడం, దీనితో ఇతర చట్టాల కింద ప్రపంచ దేశాలపై 15 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడం నేపథ్యంలో.. వాణిజ్య ఒప్పందంపై చర్చలను వాయిదా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిణామాలను సమీక్షించిన అనంతరం చర్చలు తిరిగి ఎప్పుడు జరిగేదీ నిర్ణయించనున్నట్టు వెల్లడించారు. కాగా, అమెరికా సుప్రీంకోర్టు అదనపు సుంకాలను చేయడంతో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరో చట్టం కింద ప్రపంచ దేశాలపై 15 శాతం సుంకాలను విధించడాన్ని న్యాయవాది నీ కత్యాల్‌ తప్పుబట్టారు. ట్రంప్ అదనపు సుంకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదించి, గెలిచిన ఆయన… ఈ 15 శాతం సుంకాలకు చట్టబద్ధత ఎక్కడ లేదని, చట్టసభలను తోసిరాజని అధ్యక్షుడు ఏకపక్షంగా వ్యవహరించలేరని పేర్కొన్నారు.

నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 23 , 2026 | 01:33 AM



Source link

Spread the love