
వెల్లండ గ్రామీణం: వెల్దండ మండల కేంద్రంతో పాటు బర్కత్‌పల్లి, కొట్ర, తిమ్మినోనిపల్లి తదితర గ్రామాల్లో గురువారం రాత్రి హిందు సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మండల కేంద్రంలో ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంలో శివాజీ మహరాజ్ చిత్రపటాన్ని ఉంచి ప్రధాన కూడళ్లలో డప్పు మేళాలతో, బాణసంచా పేల్చుతూ జాతీయ రహదారి వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఎస్ఐ కురుమూర్తి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.