
ఇంటర్నెట్ డెస్క్: వివాదాస్పద షక్సాగామ్ వ్యాలీలోని ప్రాంతం తమ దేశంలో భాగమేనని చైనా చేసిన వాదనను భారత్ మరోసారి తిప్పికొట్టింది. ఆ వ్యాలీ అప్పగింతకు సంబంధించి 1963లో పాకిస్థాన్, చైనా మధ్య జరిగిన ఒప్పందం చట్టవిరుద్ధమని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివాదం (Shaksgam Valley)పై స్పందించారు.
”షక్సాగామ్ వ్యాలీని చైనాకు అప్పగిస్తూ బీజింగ్‌తో పాకిస్థాన్ చేసుకున్న ఒప్పందం (1963 పాకిస్థాన్-చైనా ఒప్పందం) చెల్లదు. ఆ ప్రాంతంలో జరిగే ఏ కార్యకలాపాలను మేం గుర్తించబోం. చైనా-పాక్ ఆర్థిక కారిడార్ విషయానికొస్తే.. అది రెండు దేశాలు సంయుక్తంగా చేస్తోన్న చట్టవిరుద్ధమైన చర్యగానే మేం పరిగణిస్తాం” అని జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు.
షక్సాగామ్ వ్యాలీ ప్రాంతంలో చైనా చేపట్టిన అభివృద్ధి పనులపై ఈ నెలలో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ”పాకిస్థాన్-చైనా గుర్తున్న 1963 నాటి సరిహద్దు ఒప్పందాన్ని మేం ఎప్పటికీ గుర్తించబోం. ఒప్పందం మా నిర్ణయంపై మారదు. షక్సాగామ్ వ్యాలీ మా దేశంలో భాగమే” అని స్పష్టం చేసింది. చైనా సూచనూ.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. ఆ ప్రాంతం తమ దేశంలో భాగమేనని, అక్కడ తాము చేస్తున్న అభివృద్ధి పనులపై భారత్ అభ్యంతరం చెప్పడానికి అవకాశం లేదు.
అసలేంటీ షక్సాగామ్ వ్యాలీ..?
షక్సాగామ్ వ్యాలీమైన కారకోరమ్ రహదారిలో ఉంది. స్వాతంత్ర్యం రాగానే పాకిస్థాన్ దీన్ని ఆక్రమించింది. అనంతరం దీనికి చైనాకు ధారదత్తం చేసింది. భారత్‌కు చెందిన ప్రాంతాన్ని ఆక్రమించుకుని మరొక దేశానికి ఇవ్వడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం విరుద్ధం. ఈ వ్యాలీని బీజింగ్‌కు అప్పగించడం ద్వారా పాకిస్థాన్‌తో చైనాకు రహదారి ఏర్పడింది. దీని మీదుగా చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవాను బీజింగ్ నిర్మిస్తోంది.