LIVE FEED
టీజీఎస్పీడీసీఎల్లో 8 మంది అధికారుల సస్పెన్షన్
- టీజీఎస్పీడీసీఎల్లో అవినీతి ఇంజినీర్లపై వేటు
- నిన్న ఒకేసారి 8 మంది ఇంజినీరింగ్ అధికారులపై సస్పెన్షన్ వేటు
- టీజీఎస్పీడీసీఎల్లో ఏడీఈలు, ఈఏలు, సబ్ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు
- యాంటీ బ్రైబరీ సెల్‌కు వచ్చిన ఫిర్యాదులపై ఇంటెలిజెన్స్ విభాగం విచారణ
- కొత్త కనెక్షన్లు, ప్యానెల్ బోర్డుల ఏర్పాటుకు లంచాలు తీసుకున్న అధికారులు
- ట్రాన్స్ఫార్మర్ మంజూరు వంటివాటికి లంచాలు తీసుకున్న విద్యుత్ ఉద్యోగులు
- ఫోన్‌పే వంటి డిజిటల్ పేమెంట్ ద్వారా లంచాలు స్వీకరించినట్లు ఆధారాలు
సాక్షి మీడియాపై రూ.100 కోట్లకు పరువు నష్టం పిటిషన్ వేసిన హెరిటేజ్ ఫుడ్స్
- సాక్షి మీడియాపై రూ.100 కోట్లకు పరువు నష్టం పిటిషన్ వేసిన హెరిటేజ్ ఫుడ్స్
- హెరిటేజ్ ఫుడ్స్ పిటిషన్‌పై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు
- హెరిటేజ్, బోలేబాబా డెయిరీకి సంబంధం పేరుతో సాక్షి మీడియాలో కథనాలు
- 24 గంటల్లో టెలికాస్ట్ చేసిన లింక్‌లన్నీ తొలగించాలని దిల్లీ హైకోర్టు ఆదేశం
- లేనిపక్షంలో మెటా, గూగుల్, యూట్యూబ్ చర్యలు చేపట్టాలని ఆదేశాలు
- సాక్షి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు
ఇంటర్ వార్షిక పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదల
- ఇంటర్ వార్షిక పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదల
- విద్యార్థుల రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు హాల్‌టికెట్లు పంపిన ఇంటర్ బోర్డు
- రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం
- కళాశాల ప్రిన్సిపల్స్ నుంచి కూడా హాల్‌టికెట్లు తీసుకునేందుకు అవకాశం
- హాల్‌టికెట్‌లో తప్పులుంటే ప్రిన్సిపల్ ద్వారా బోర్డుదృష్టికి తీసుకురావాలని సూచన
ఈనెల 25న ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రాయనున్న 9.9 లక్షల మంది విద్యార్థులు
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 జ్యూరీ కమిటీలో రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డికి బాధ్యతలు
- గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్(Gaddar Film Awards) 2025 జ్యూరీ కమిటీలో కీలక మార్పు
- స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా తమ్మారెడ్డి భరద్వాజ నియామకం
- దర్శకుడు రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజకు బాధ్యతలు
- ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్
బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటన్ అరెస్టు
- బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటన్ అరెస్టు
- పదవి దుర్వినియోగం ఆరోపణలతో ఆండ్రూ మౌంట్బాటన్పై చర్యలు
- లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్కు ఆండ్రూ కీలకమైన నివేదికలు పంపారని ఆరోపణలు
- కీలకమైన వాణిజ్య నివేదికలను పంపించారన్న ఆరోపణలతో పోలీసుల విచారణ
- ఆండ్రూ మౌంట్‌బాటన్ 2010లో వాణిజ్య నివేదికలు పంపినట్లు ఆరోపణ
రాష్ట్రంలో రూ.13,000 కోట్ల విలువైన మోసాన్ని బయటపెట్టిన జీఎస్టీ ఇంటెలిజెన్స్
- హైదరాబాద్: జీఎస్టీ మోసానికి పాల్పడిన గేమింగ్ సంస్థ డైరెక్టర్ అరెస్టు
- అడ్సన్ అడ్వైసరీ సర్వీస్ సంస్థ డైరెకట్ర్ పంకజ్ కుమార్ అరెస్టు
- పంకజ్‌కుమార్‌ను అరెస్టు చేసిన హైదరాబాద్ జీఎస్టీ నిఘా విభాగం
- రూ.13,000 కోట్ల విలువైన మోసాన్ని బయటపెట్టిన జీఎస్టీ ఇంటెలిజెన్స్
- షెల్ కంపెనీలకు నకిలీ కేవైసీ వెరిఫికేషన్లు ఇచ్చినట్లు ఆరోపణలు
- పేమెంట్ గేట్వేలు, బాపా వ్యవస్థలతో లింకులు ఉన్నట్లు గుర్తింపు
- సంస్థకు చెందిన రూ.100 కోట్లు ఉన్న బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాసిన కేటీఆర్
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాసిన కేటీఆర్
- కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 95 శాతం పెండింగ్ ఉన్నాయి: కేటీఆర్
- రెండు బడ్జెట్లలో హామీల అమలుకు కేటాయింపులు చేయలేదు: కేటీఆర్
- ఇచ్చిన హామీలకు ఈ సారైనా బడ్జెట్లో కేటాయింపులు చేయాలి: కేటీఆర్
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలి: కేటీఆర్
- హామీల అమలుకు నిధులు కేటాయించకపోతే.. ఎక్కడికక్కడ నిలదీస్తాం: కేటీఆర్
1,236 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
- 1,236 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
- 365 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ
జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు?: కడియం శ్రీహరి
- జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు?: కడియం శ్రీహరి
- జాతిపిత అయితే ప్రజాసమస్యలపై ఎందుకు స్పందించట్లేదు: కడియం శ్రీహరి
- కేసీఆర్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కేసుల్లో ఇరుక్కున్నారు: కడియం శ్రీహరి
- అనేక అక్రమాలు చేసి కుంభకోణాల్లో ఇరుక్కున్నారు: కడియం శ్రీహరి
- కూలిపోయే కాళేశ్వరం కట్టి.. తెలంగాణను దివాలా తీయించారు: కడియం శ్రీహరి
- కేసీఆర్ కుటుంబం వేలకోట్ల ఆస్తులు చెమటోడ్చి సంపాదించిందా?: కడియం శ్రీహరి
- అధికారం పోయినా… అహంకారం తగ్గలేదు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
- ఇంకెన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్‌తో రాజకీయాలు చేస్తారు: కడియం శ్రీహరి
- బీజేపీ, బీఆర్ఎస్.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి: కడియం శ్రీహరి
20 ఏళ్ల నుంచి పార్టీని పట్టిపీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి: ఎంపీ అర్వింద్
- బీఆర్ఎస్కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది: ఎంపీ ధర్మపురి అర్వింద్
- కేసుల మాఫీ కోసమే కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది: అర్వింద్
- గతంలో కేసీఆర్ అవినీతిని ఎవరూ ప్రశ్నించవద్దని ఎమ్మెల్యేలను కొన్నారు: అర్వింద్
- కేసీఆర్ వ్యవస్థను నాశనం చేశారు.. రేవంత్‌రెడ్డి కొనసాగిస్తున్నారు: ఎంపీ అర్వింద్
- ఎవరు ఎవరి వల్ల భూస్థాపితం అయ్యారో కవితకు తెలియదా?: ఎంపీ అర్వింద్
- 20 ఏళ్ల నుంచి పార్టీని పట్టిపీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి: ఎంపీ అర్వింద్
- మెట్పల్లిలో కోవర్టు వెళ్లిపోయారు.. పార్టీకి పట్టిన పీడ పోయింది: అర్వింద్
- కరీంనగర్‌ను నిజామాబాద్‌తో పోల్చలేం: ఎంపీ అర్వింద్
- నిజామాబాద్‌లో ముస్లింలు ఎక్కువగా వున్నారు: ఎంపీ అర్వింద్
ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అయింది: హరీశ్‌రావు
- ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అయింది: హరీశ్‌రావు
- మంత్రి వివేక్ కనుసన్నల్లో అధికారులు కావాలని కౌన్సిల్‌ని వాయిదా వేశారు: హరీశ్‌రావు
- సుమన్‌ను ఆసిఫాబాద్, లక్షేట్టిపేట జైలులో కాకుండా ఆదిలాబాద్ జైలుకు తరలించారు: హరీశ్‌రావు
- రాజ్యాంగం చేత పట్టుకునే రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించరు: హరీశ్‌రావు
నైజీరియాలోని గనిలో విషపూరిత వాయువు లీక్, 37 మంది మృతి
- నైజీరియాలోని గనిలో విషపూరిత వాయువు లీక్(Poison Gas Leak)
- విషపూరిత వాయువు లీకై 37 మంది మృతి
కంది కేంద్ర కారాగారంలో గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
- సంగారెడ్డి: కంది కేంద్ర కారాగారంలో గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
- జైలులో చెమటలు వచ్చి కిందపడిపోయిన రిమాండ్ ఖైదీ గొల్ల విఠల్(61)
- గుండెపోటుతో ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతూ విఠల్ మృతి
- విఠల్ స్వగ్రామం సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మం. మరెల్లి గ్రామం
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
- హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
- శివాజీ చిత్రపటం వద్ద నివాళులర్పించిన రామచందర్‌రావు, ఎంపీ అరవింద్
- కవిత పార్టీ స్థాపిస్తే భూస్థాపితం అయ్యేది బీఆర్ఎస్.. బీజేపీ కాదు: రామచందర్‌రావు
- కవిత బీఆర్ఎస్ అనబోయి బీజేపీ అన్నట్లు ఉంది: రామచందర్‌రావు
- కవిత బీఆర్ఎస్ భూస్థాపితం కాకుండా చూసుకోవాలి: రామచందర్‌రావు
ఆదిలాబాద్ జైలులో బాల్క సుమన్‌కు హరీశ్‌రావు పరామర్శ
- ఆదిలాబాద్ జైలులో బాల్క సుమన్‌కు హరీశ్‌రావు(Harish Rao) పరామర్శ
- హరీశ్‌రావు వెంట మాజీమంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి
- హరీశ్‌రావు వెంట ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య
భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు
- భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు
- 900 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్
- 250 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,520
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Rate) రూ. 1,61,520
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,450
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.6 లక్షలు
తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీపై ఎక్స్ వేదికగా స్పందించిన ఖర్గే
- తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీపై ఎక్స్ వేదికగా స్పందించిన ఖర్గే
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది: ఖర్గే
- సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారతకు కట్టుబడి ఉన్నాం: ఖర్గే
- ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం: ఖర్గే
- తెలంగాణ ప్రజల ఆంక్షలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం: ఖర్గే
After our emphatic victory in the Telangana local body elections, we held a comprehensive review with @INCTelangana leaders and ministers to chart the road ahead and advance the vision of Prajala Telangana.
Our resolve for social welfare, economic empowerment, and justice for… pic.twitter.com/YkXfGrv5L8
— Mallikarjun Kharge (@kharge) February 19, 2026
ఏడేళ్లలో రిలయన్స్, జియో కలిసి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెడతాయన్న ముకేశ్
- రిలయన్స్ గ్రూపు(Reliance Investments) తరఫున భారీ పెట్టుబడులు ప్రకటించిన ముకేశ్ అంబానీ
- ఏడేళ్లలో రిలయన్స్, జియో కలిసి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెడతాయన్న ముకేశ్
- ఏఐలో సరికొత్త విప్లవానికి కృతనిశ్చయంతో ఉన్నామన్న ముకేశ్ అంబానీ
- ఊహాజనిత పెట్టుబడి కాదు.. దేశ నిర్మాణానికి ఉపయోగపడుతుందన్న ముకేశ్
- సుసంపన్న యుగానికి ఏఐ నాంది పలుకుతుందని వివరించిన ముకేశ్
- ఏఐలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు పనిచేస్తామన్న ముకేశ్
- దిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్న ముకేశ్ అంబానీ
సుక్మా జిల్లాలో మావోల స్మారకస్తూపం కూల్చివేసిన భద్రతా బలగాలు
- ఛత్తీస్‌గఢ్: సుక్మా జిల్లాలో మావోల స్మారకస్తూపం కూల్చివేసిన భద్రతా బలగాలు
- కిష్టారం పరిధి సన్నంపెంట అడవుల్లో మావోల స్మారకస్తూపం కూల్చిన బలగాలు
- అడవుల్లో సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన 140 మంది జవానుల కూంబింగ్
పారక్వాట్ క్రిమిసంహారక మందు వినియోగంపై హైకోర్టులో విచారణ
- పారక్వాట్ క్రిమిసంహారక మందు వినియోగంపై హైకోర్టులో విచారణ
- పారక్వాట్ మందుతో ఏటా రాష్ట్రంలో 200 మంది చనిపోతున్నారని సీజేకు లేఖ
- యూరప్, చైనా, బ్రెజిల్లో క్రిమిసంహారక మందుపై నిషేధం విధించారన్న పిటిషనర్
- సీజేకు రాసిన లేఖ ఆధారంగా సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణ
- పారక్వాట్లో 2 ఉత్పత్తులున్నాయన్న కేంద్రం తరఫు న్యాయవాది భుజంగరావు
- ఇప్పటికే పారక్వాట్ డైసల్ఫేట్పై నిషేధం ఉందన్న భుజంగరావు
- పూర్తి సమాచారం తెలుసుకోవడానికి సమయం కావాలన్న భుజంగరావు
- కౌంటర్ దాఖలుకు 3 వారాల సమయం ఇచ్చిన సీజే ధర్మాసనం
జీహెచ్ఎంసీని విభజిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పిటిషన్
- జీహెచ్ఎంసీని విభజిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పిటిషన్
- మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ జీవో 55 విడుదల చేసిన ప్రభుత్వం
- జీవో 55ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వ్యాపారి గురువారెడ్డి
- 2027 జనాభా లెక్కలపై కేంద్ర సర్కులర్‌కు ఇది విరుద్ధమన్న పిటిషనర్
- జనగణన ముగిసే వరకు జీవోపై స్టే విధించాలని కోరిన పిటిషనర్
- అప్పటివరకు జీహెచ్ఎంసీని యథావిధిగా ఉంచాలని కోరిన పిటిషనర్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ
- విచారణను 3 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు
ఉచిత హామీలు ఇస్తున్న పార్టీల తీరుపై సుప్రీంకోర్టు అసహనం
- ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ఉచిత హామీలు ఇస్తున్న పార్టీల తీరుపై సుప్రీంకోర్టు అసహనం
- ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయన్న సుప్రీంకోర్టు
- చాలా రాష్ట్రాలు ఆర్థిక లోటు ఎదుర్కొంటున్నాయి: సుప్రీంకోర్టు
- ఆర్థిక లోటులో ఉన్నా ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయి: సుప్రీంకోర్టు
- అభివృద్ధిని పట్టించుకోకుండా ఉచితాలు అమలు చేస్తున్నాయి: సుప్రీంకోర్టు
- ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్‌కు బదులు ఉపాధికి కృషి చేయాలి: సుప్రీంకోర్టు
- డీఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై సుప్రీంకోర్టులో విచారణ
- ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని డీఎంకే హామీ
- డీఎంకే పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఏఐసీసీ అగ్రనేతల సమావేశం
- తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఏఐసీసీ అగ్రనేతల సమావేశం
- ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం
- సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్
- భేటీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు
- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు
హైదరాబాద్: ఈసీఐఎల్ వద్ద ఎన్ఎఫ్సీ ఒప్పంద ఉద్యోగుల ఆందోళన
- హైదరాబాద్: ఈసీఐఎల్ వద్ద ఎన్ఎఫ్సీ ఒప్పంద ఉద్యోగుల ఆందోళన
- మూడు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదంటూ ఎన్ఎఫ్సీ సిబ్బంది నిరసన
- విధులు బహిష్కరించి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ బయట 350 మంది ఆందోళన
- ఒప్పంద కార్మికులకు మద్దతుగా ప్రజా సంఘాల నాయకుల ఆందోళన
కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్, ఇద్దరు మావోయిస్టులు మృతి
- కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్, ఇద్దరు మావోయిస్టులు మృతి
- భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు
- నక్సల్స్ మిషన్ దృష్ట్యా మావోయిస్టుల వేట ముమ్మరం చేసిన భద్రతా బలగాలు
- ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ కేజీహెచ్-2 చేపట్టిన భద్రతా బలగాలు
- ఆపరేషన్ కర్రెగుట్టలు హిల్స్-2 చేపట్టిన సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు
- కర్రెగుట్టల్లో 2 వేల మంది భద్రతా బలగాలతో రెండ్రోజులుగా గాలింపు
- 2026 మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదం నిర్మూలన లక్ష్యంగా కేంద్రం చర్యలు
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉండవు: కవిత
- తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉండవు: కవిత
- పార్టీ పెట్టాక తెలంగాణలో మేమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం: కవిత
- ఎన్నికల్లో గెలిచి వంద శాతం అధికారంలోకి వస్తాం: కవిత
- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తే ఏదో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేస్తాం: కవిత
- జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు పార్టీ ఏర్పాటు పూర్తయితే మా గుర్తుపై పోటీ చేస్తాం: కవిత
- మా పార్టీలో యువత, కొత్త వారికి పెద్దపీట వేస్తాం: కవిత
- బీఆర్ఎస్లో ఉన్నవారు చాలా మంది నాతో టచ్‌లో ఉన్నారు: కవిత
- ఎవరు టచ్‌లో ఉన్నారో సందర్భం వచ్చినపుడు చెబుతా: కవిత
- షర్మిలతో నన్ను పోలుస్తూ మాట్లాడడం తగదు: కవిత
- షర్మిల.. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు: కవిత
- పార్టీలు పెట్టిన మగవారిపై ఎందుకు చర్చించరు.. ఆడవాళ్లనే ఎందుకు ప్రస్తావిస్తారు?: కవిత
- చిరంజీవి పార్టీ గురించి ఎందుకు మాట్లాడరు?: కవిత
సూర్యాపేటలో యువతిపై సుత్తితో దాడి చేసిన యువకుడు
సూర్యాపేటలో యువతిపై సుత్తితో దాడి చేసిన యువకుడు
తనను దూరం పెడుతోందనే కోపంతో యువతిపై సుత్తితో దాడి
యువతి తలకు తీవ్రగాయాలు, సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలింపు
నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
ఉస్మానియా వర్సిటీలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ వర్సిటీస్ సెంట్రల్ జోన్ వీసీల సదస్సు
- ఉస్మానియా వర్సిటీలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ వర్సిటీస్ సెంట్రల్ జోన్ వీసీల సదస్సు
- సెంట్రల్ జోన్ వీసీల సదస్సును ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- సదస్సులో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన వీసీలు
- ఏఐ, క్వాంటం సాంకేతికతతో ఉన్నత విద్యాసంస్థల రూపకల్పనపై సదస్సు
- రెండ్రోజులపాటు ఏఐయూ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సు
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు
కవిత :
- కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు
- మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ ఏర్పాటు చేస్తాం : కవిత
- పార్టీ పేరులో తెలంగాణ ఉంటుంది : కవిత
- ఎన్నికల్లో నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు : కవిత
- సిద్దిపేట, బోధన్.. రెండింట్లో ఒకచోట పోటీ చేస్తా : కవిత
- మొదటి చాయిస్ సిద్దిపేట, రెండో చాయిస్ బోధన్: కవిత
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక భేటీ
కీలక భేటీ :
- ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక భేటీ
- భేటీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్
- భేటీలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్
ధర్మారం సమీపంలో కారు బీభత్సం
కారు బీభత్సం :
- నిజామాబాద్ : ధర్మారం సమీపంలో కారు బీభత్సం
- అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు, ఒకరికి తీవ్రగాయాలు
- డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ప్రమాదం
- నిజామాబాద్: కారు ఢీకొని ధ్వంసమైన ఇల్లు ప్రహరీ గోడ
సూర్యాపేటలో యువతిపై సుత్తితో దాడి చేసిన యువకుడు
సుత్తితో దాడి :
- సూర్యాపేటలో యువతిపై సుత్తితో దాడి చేసిన యువకుడు
- తనను దూరం పెడుతోందనే కోపంతో యువతిపై సుత్తితో దాడి
- యువతి తలకు తీవ్రగాయాలు, సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలింపు
ఈ నెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం
సమావేశాలు :
- ఈ నెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం
- ఈనెల 23న కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం
- ఈనెల 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
- 10-15 రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం
కొనసాగుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ
- కొనసాగుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ
- ఎమెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ విచారణ
- కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కేపీ వివేకానంద పిటిషన్
- అనర్హత పిటిషన్‌పై అసెంబ్లీలో కేపీ వివేకానందగౌడ్ విచారణ
- నిన్న ఎమెల్యే దానం నాగేందర్‌పై వేసిన అనర్హత పిటిషన్ల విచారణ
కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోంది: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ :
- కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోంది: ప్రధాని మోదీ
- భారత్ ఆరో వంతు ప్రపంచ జనాభా కలిగి ఉంది: ప్రధాని మోదీ
- సాంకేతికత కేంద్రంగా ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తోంది: మోదీ
- యువత.. భారత్‌కు కొత్త విశ్వాసం, ఆస్తిగా ఉంది: మోదీ
- వేగంగా, విశ్వాసంతో సాంకేతికతను స్వీకరిస్తున్నాం: మోదీ
- యువత ఏఐ అమలులో ఆసక్తి కనబరుస్తున్నారు: మోదీ
- వివిధ రంగాల సమస్యలకు ఏఐ పరిష్కారం చూపుతోంది: మోదీ
- మేడిన్ ఇండియా, భారత ఆవిష్కరణల సామర్థ్యం ఏఐ సదస్సు చాటుతోంది: మోదీ
- ఏఐ సామర్థ్యం ఆలోచనలకు అందనంత దూరంగా ఉంది: మోదీ
- మానవ కేంద్రీకృత ఏఐ నిర్మాణం మన లక్ష్యం కావాలి: మోదీ
- భారత్ ఏఐ పురోభివృద్ధి ఒక చరిత్రగా నిలుస్తుంది: మోదీ
ఏఐ నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది: సుందర్ పిచాయ్
సుందర్ పిచాయ్ :
- ఏఐ నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది: సుందర్ పిచాయ్
- గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్‌లు ఏర్పాటు చేస్తోంది: సుందర్ పిచాయ్
- విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటవుతోంది: సుందర్ పిచాయ్
- కోట్లాది ప్రజల జీవితాలను ఏఐ మార్చుతుంది: సుందర్ పిచాయ్
- కొత్త ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో నడిపిస్తాయి: సుందర్ పిచాయ్
- అపరిష్కృత సమస్యలకు ఏఐ ద్వారా పరిష్కారం సాధ్యం: సుందర్ పిచాయ్
ఏఐ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా: చంద్రశేఖరన్
చంద్రశేఖరన్
- ఏఐ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా: చంద్రశేఖరన్
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా భారత్ మారుతోంది: చంద్రశేఖరన్
- డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలకు భారత్ సాక్షిగా నిలుస్తోంది: చంద్రశేఖరన్
- 140 కోట్ల ప్రజలతో అతిపెద్ద డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థ కలిగి ఉంది: చంద్రశేఖరన్
- ప్రపంచంలో జరిగే వాటిలో భారత్ నుంచే సగం డిజిటల్ లావాదేవీలు: చంద్రశేఖరన్
- భారత్‌ను ఏఐ కేంద్రంగా ప్రధాని తీర్చిదిద్దుతున్నారు: చంద్రశేఖరన్
- సెమీకాన్ ఇండియా, ఇండియా ఏఐ మిషన్‌లో భాగంగా సాంకేతికత అభివృద్ధి: చంద్రశేఖరన్
- ఏఐ నైపుణ్య శిక్షణలో భారత్ పురోభివృద్ధి సాధిస్తోంది: చంద్రశేఖరన్
- ఏఐ అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు: చంద్రశేఖరన్
- ఏఐ అనేది అన్ని పరిశ్రమలకు ఉపయోగపడే సాంకేతిక పునాది: చంద్రశేఖరన్
- ఏఐ అనేది కృత్రిమమైనది కాదు.. వాస్తవమైనది: చంద్రశేఖరన్
- ఏఐ డేటా నుంచి ప్రతిరోజూ వేగంగా నేర్చుకుంటుంది: చంద్రశేఖరన్
- ఎలాంటి స్థిర నిబంధనలపై ఏఐ ఆధారపడి ఉండదు: చంద్రశేఖరన్
- ఏఐ చాలా వేగంగా స్కేల్ చేయగలదు: చంద్రశేఖరన్
- కచ్చిత నిబంధనలేమీ లేకుండా డేటా నుంచి వేగంగా ఏఐ నేర్చుకుంటుంది: చంద్రశేఖరన్
- ఏఐ భవిష్యత్తు మౌలిక సదుపాయంగా మారుతుంది: చంద్రశేఖరన్
ఏఐ సదస్సు గొప్ప విజయవంతమైంది: అశ్వినీ వైష్ణవ్
అశ్వినీ వైష్ణవ్ :
- ఏఐ సదస్సు గొప్ప విజయవంతమైంది: అశ్వినీ వైష్ణవ్
- సాంకేతికత అందరికీ అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం: అశ్వినీ వైష్ణవ్
- పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి కట్టుబడి ఉన్నాం: అశ్వినీ వైష్ణవ్
హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ బయల్దేరిన హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు
- హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ బయల్దేరిన హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు
- నేరడిగొండలో ఎమ్మెల్యే అనిల్ ఇంటి వద్ద పార్టీ శ్రేణులతో మాట్లాడనున్న హరీశ్‌రావు
- ఆదిలాబాద్ జైలులో బాల్క సుమన్‌ను పరామర్శించనున్న హరీశ్‌రావు
- క్యాతనపల్లిలో జరిగిన ఘటనల్లో బాల్క సుమన్‌కు రిమాండ్ విధింపు
- పోలీసుల విధులు అడ్డుకుని, దౌర్జన్యం చేశారని బాల్క సుమన్‌పై కేసులు
నక్సల్స్ మిషన్ దృష్ట్యా మావోయిస్టుల వేట ముమ్మరం చేసిన భద్రతా బలగాలు
ముమ్మర వేట :
- నక్సల్స్ మిషన్ దృష్ట్యా మావోయిస్టుల వేట ముమ్మరం చేసిన భద్రతా బలగాలు
- ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ కేజీహెచ్-2 చేపట్టిన భద్రతా బలగాలు
- ఆపరేషన్ కర్రెగుట్టలు హిల్స్-2 చేపట్టిన సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు
- బీజాపూర్ జిల్లా పరిధి నంబి నుంచి వ్యాపించిన కర్రెగుట్టల ప్రాంతంలో వేట
- కర్రెగుట్టల సరిహద్దు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ తనిఖీలు
- దాదాపు 2 వేల మంది భద్రతా బలగాలతో ముమ్మరంగా గాలింపు
- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ కోసం గాలింపు
- జూనియర్ క్యాడర్ బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సోధి కోసం గాలింపు
- కర్రెగుట్టల్లోని తడపల, పామునూరు, మురుమూరు, డోలీలో నిత్యం ఆపరేషన్
- 2026 మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదం నిర్మూలన కేంద్రం లక్ష్యం
వార్షిక బ్రహ్మోత్సవాల్లో అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ మహోత్సవం
యాదగిరిగుట్ట ఆలయంలో రెండోరోజు వార్షిక బ్రహ్మోత్సవాలు
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ మహోత్సవం
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ మహోత్సవం
హైదరాబాద్ శివారు మూసీ ప్రాజెక్టు భూసేకరణపై ఇవాళ గ్రామసభ
- హైదరాబాద్ శివారు మూసీ ప్రాజెక్టు భూసేకరణపై ఇవాళ గ్రామసభ
- కిస్మత్పూర్ వార్డు ఆఫీసులో ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ
- అభ్యంతరాలపై లిఖితపూర్వకంగా గ్రామసభలో ఇవ్వాలని సూచన
- రాజేంద్రనగర్ ఆర్డీవో ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహణ
- మూసీ ప్రాజెక్ట్ ఫేజ్ 1 కింద భూసేకరణకు ఈనెల 12న నోటిఫికేషన్
- నోటిఫికేషన్ ఇచ్చిన మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్
తిరుమలలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటలు
- తిరుమలలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటలు
- శ్రీవారి సర్వదర్శనానికి 14 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,804 మంది భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు
- నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 24,142 మంది భక్తులు
అదుపుతప్పి గుంతలో పడ్డ ఆర్టీసీ బస్సు, 20 మంది ప్రయాణికులకు గాయాలు
- గద్వాల జిల్లా: ఉండవెల్లి మం. ఇటిక్యాల పాడు సమీపంలో ప్రమాదం
- అదుపుతప్పి గుంతలో పడ్డ ఆర్టీసీ బస్సు, 20 మంది ప్రయాణికులకు గాయాలు
- క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
- హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
రాష్ట్ర రాజకీయ పరిణామాలపై నేడు దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం
- రాష్ట్ర రాజకీయ పరిణామాలపై నేడు దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం
- మల్లికార్జున ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సమావేశం
- ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినందును పనితీరుపై లోతైన సమీక్ష చేయనున్న కాంగ్రెస్
- రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాన చర్చ
- భేటీలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
- భేటీలో పాల్గొననున్న మంత్రులు, సీనియర్ నాయకులు
- తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌గౌడ్, మీనాక్షి నటరాజన్‌తో ప్రత్యేకంగా సమావేశం
- సమావేశంలో ప్రభుత్వానికి చెందిన అంతర్గత విషయాలపై చర్చ
- రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల భర్తీ, నైనీ బొగ్గు గనిపై వచ్చిన ఆరోపణలు చర్చించే అవకాశం
- నాయకుల మధ్య తలెత్తిన విభేదాలపై భేటీలో చర్చించే అవకాశం
ఆదిలాబాద్ జైలులో బాల్క సుమన్‌ను పరామర్శించనున్న హరీశ్‌రావు
- నేడు ఆదిలాబాద్‌కు వెళ్లనున్న హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు
- ఆదిలాబాద్ జైలులో బాల్క సుమన్‌ను పరామర్శించనున్న హరీశ్‌రావు
- క్యాతనపల్లిలో జరిగిన ఘటనల్లో బాల్క సుమన్‌కు రిమాండ్ విధింపు
- పోలీసుల విధులు అడ్డుకుని, దౌర్జన్యం చేశారని బాల్క సుమన్‌పై కేసులు
యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
- యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
- యాదగిరిగుట్ట: ఉదయం స్వామివారికి అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం
- యాదగిరిగుట్ట: సాయంత్రం స్వామివారికి భేరీపూజ, దేవతాహ్వానం, హవనం
విమానాల్లో అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన డీజీసీఏ
- విమానాల్లో అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన డీజీసీఏ
- కొత్త ముసాయిదా నిబంధనలు రూపొందించిన డీజీసీఏ
- అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులను ఎయిర్‌లైన్ సంస్థలు నేరుగా శిక్షించే అవకాశం
- గతంలో స్వతంత్ర దర్యాప్తు కమిటీ నిర్ధరిస్తేనే శిక్ష పడే అవకాశం
- విమానంలో పొగ తాగడం, అనుమతి లేకుండా పలు పరికరాల వినియోగంపై శిక్ష
- విమానాల్లో ఆందోళనలు, నినాదాలు చేయడాన్ని నిషేధించిన డీజీసీఏ
- విమానాల్లో సైగలతో, మాటలతో వేధింపులకు గురి చేస్తే 3 నెలలు వరకు నిషేధం
- భౌతిక దాడులు, లైంగిక వేదింపులకు పాల్పడితే వ్యక్తిపై 6 నెలల వరకు నిషేధం
- ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తే రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిషేధం
- విమాన సిబ్బంది ఉన్న ప్రదేశంలోకి చొరబడితే రెండేళ్లు, అంతకంటే ఎక్కువ నిషేధం
- నిబంధనలపై సూచనలు, అభ్యంతరాలను వచ్చే నెల 16 లోపు పంపాలన్న డీజీసీఏ
టీ20 ప్రపంచకప్‌లో నేడు 3 మ్యాచ్‌లు
- టీ20 ప్రపంచకప్‌లో నేడు 3 మ్యాచ్‌లు
- కోల్‌కతాలో ఉదయం 11 గం.కు వెస్టిండీస్, ఇటలీ మ్యాచ్
- కొలంబోలో మధ్యాహ్నం 3 గం.కు శ్రీలంక, జింబాబ్వే మ్యాచ్
- చెన్నైలో రాత్రి 7 గంటలకు అఫ్గనిస్థాన్, కెనడా మ్యాచ్