సిరీస్ పట్టాలని.. | మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఒత్తిడి పెరగడంతో టీ20 సిరీస్‌ను చేధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది


ABN
ప్రచురణ తేదీ – జనవరి 25, 2026 | 05:33 AM

న్యూజిలాండ్‌తో భారత్‌ ఐదు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య మూడో మ్యాచ్‌ ఆదివారం జరుగనుంది. ఇప్పటికే 2-0తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న భారత్‌.. గువాహటిలోనూ తమ ఫామ్‌ను…

సిరీస్ పట్టాలని..

మూడో టీ20 నేడు

రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

గువాహటి: న్యూజిలాండ్‌తో భారత్‌ ఐదు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య మూడో మ్యాచ్‌ ఆదివారం జరుగనుంది. ఇప్పటికే 2-0తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న భారత్‌.. గువాహటిలోనూ తమ ఫామ్‌ను కొనసాగిస్తున్న సిరీస్‌ పట్టేయాలనుకుంటోంది.

సంజూ రాణించాలి: రెండో టీ20లో ఇషాన్‌ కిషన్‌తో పాటు కెప్టెన్‌ సూర్య అదరగొట్టడంతో జట్టు బ్యాటింగ్‌ దుర్భేద్యంగా మారింది. అయితే ఓపెనర్‌ సంజూ శాంసన్‌ మాత్రం సిరీ‌సలో 16 పరుగులే చేసి విఫలమయ్యాడు. దీంతో అతడి స్థానానికి ఎసరు వచ్చే ఛాన్సుంది. ఒకవేళ తిలక్‌ వర్మ కోలుకుని ప్రపంచకప్‌లో ఆడితే సంజూ తన బెర్త్‌ను ఇషాన్‌కు కోల్పోవాల్సి ఉంటుంది. అదే జరిగితే అభిషేక్‌, ఇషాన్‌ల విధ్వంసకర ఓపెనింగ్‌తో జట్టుకు భారీస్కోర్లు ఖాయమవుతుంటాయి. అందుకే తుది జట్టులో చోటు ఉండాలంటే కివీస్‌తో టీ20 సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లు శాంసన్‌కు ఆఖరి ఛాన్స్‌ లాంటివి. బౌలింగ్‌లో స్పిన్నర్‌ కుల్దీప్‌, పేసర్‌ హర్షిత్‌ మధ్య ఓవర్లను కట్టడి చేస్తున్నారు. అయితే బుమ్రా ఈ మ్యాచ్‌ ఆడనుండడంతో హర్షిత్‌ బెంచీకే పరిమితమవొచ్చు. మరోవైపు ఈ టూర్‌లో భారత్‌పై వన్డే సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్.. పొట్టి ఫార్మాట్‌లో ఆ జోరు చూపలేకపోతోంది. టీ20 సిరిస్‌లో నిలవాలంటే ఈ మూడో మ్యాచ్‌లో కివీస్‌ శక్తిమేరా రాణించాల్సిందే. రెండో టీ20లో ఆరంభం బాగున్నా చివరి వరకు ఆ జోరు కొనసాగించలేకపోయింది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ

ఇది శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్

నవీకరించబడిన తేదీ – జనవరి 25 , 2026 | 05:33 AM



Source link

Spread the love