
స్పోర్ట్స్ కాంప్లెక్స్, గృహాలను ప్రారంభిస్తున్న డీజీపీ బి.శివధర్‌రెడ్డి, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీపీ సునీల్‌దత్ తదితరులు
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సైబర్‌నేరాలు, రహదారి ప్రమాదాలు, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీజీపీ బి.శివధర్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం నగరంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, పోలీస్ గృహాలను ఆదివారం ప్రారంభించారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే మంచి పేరుందని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ముందున్నామని తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ‘ఈగల్’ దేశంలో అత్యున్నతంగా పనిచేస్తున్నాయని వివరించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో నేరాల వివరాలు, కేసుల పురోగతిని సీపీ సునీల్‌దత్ వివరించారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు డీసీపీలు ప్రసాద్‌రావు, రామానుజం, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సారంగపాణి, శ్రీనివాసులు, మహేశ్, సర్వర్, సత్యనారాయణ, ఫణీందర్, సుశీల్‌సింగ్, నర్సయ్య పాల్గొన్నారు.