స్టార్టప్‌లపై ప్రధాని మోదీ (ఫోటో/X@BJP4India)
స్టార్టప్ ఇండియాపై ప్రధాని మోదీ: ఇక కంఫర్ట్ జోన్‌లో జీవించే ఉద్దేశ్యం భారతీయ యువతకు లేనే లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. నూతన లక్ష్యాలతో ఎదగాలని వారు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. అసలైన సమస్యల పరిష్కారంపై భారతీయ యువత, ఎంట్రప్రెన్యూర్‌లు ఫోకస్ పెట్టారు. స్టార్టప్ ఇండియా మిషన్ భారతదేశంలో ఒక విప్లవంగా మారింది. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా ప్రారంభించి దశాబ్దం గడిచిన సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 2014లో కేవలం 4 స్టార్టప్‌లతో మొదలైన ఈ గొప్ప కార్యక్రమం, ఇప్పటివరకు 125కుపైగా యూనికార్న్‌లను భారత్‌లో సృష్టించింది. ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌లోనే ఉందని ఆయన చెప్పారు. భారత్‌లోని స్టార్టప్‌ల సంఖ్య 2 లక్షలు దాటిపోయింది.