LIVE FEED
ఇఫ్తార్ విందులో పాల్గొన్న కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు
- హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఇఫ్తార్ విందు
- ఇఫ్తార్ విందులో పాల్గొన్న కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు
సికింద్రాబాద్, బంజారాహిల్స్, మోతినగర్, బోరబండలో వర్షం
- హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, వర్షం
- సికింద్రాబాద్, బంజారాహిల్స్, మోతినగర్, బోరబండలో వర్షం
- కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్టలో వర్షం
- చింతల్, షాపూర్, సూరారం, సుచిత్ర ప్రాంతాల్లో వర్షం
రేపు మధ్యాహ్నం దిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- రేపు మధ్యాహ్నం దిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగింపు
- జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం
- మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగింపు
- కార్యాలయంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించిన జీవన్‌రెడ్డి అనుచరులు
- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో జీవన్‌రెడ్డికి విభేదాలు
- ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోందని జీవన్‌రెడ్డి అసంతృప్తి
- కాంగ్రెస్‌లో తనకు ప్రాధాన్యం దక్కట్లేదని జీవన్‌రెడ్డి అసంతృప్తి
నర్మెట్ట ఆయిల్ పామ్ ప్రారంభ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి తుమ్మల సమీక్ష
- నర్మెట్ట ఆయిల్ పామ్ ప్రారంభ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి తుమ్మల సమీక్ష
- వ్యవసాయ శాఖ కార్యదర్శి, అధికారులతో మంత్రి తుమ్మల సమావేశం
- కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలపై మంత్రి సూచనలు
- ఈనెల 20 నుంచి 22 వరకు నర్మెట్టలో రైతుమేళా
- రైతుమేళాలో స్టాల్స్, ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
- ఈనెల 22న నర్మెట్ట ఆయిల్ పామ్ ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
సీఎల్పీ భేటీకి పలువురు ఎమ్మెల్యేలు రాకపోవడంపై సీఎం ఆగ్రహం
- సీఎల్పీ సమావేశంలో పలు సూచనలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
- సీఎల్పీ భేటీకి పలువురు ఎమ్మెల్యేలు రాకపోవడంపై సీఎం ఆగ్రహం(CM Serious)
- సీఎల్పీకి రాలేనంత బిజీగా ఉన్నారా అని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం
- సభకు హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దు: సీఎం
- ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానం ఇచ్చే సమాచారం కలిగిఉండాలి: సీఎం
- గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించే సమయం అయిపోయింది: సీఎం
- మన భవిష్యత్ ప్రణాళికలు, ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టిసారించాలి: సీఎం
- చర్చ పక్కదారి పట్టకుండా, సమయం వృథా కాకుండా చూడాలి: సీఎం
- పార్టీ, ప్రభుత్వపరమైన లైన్‌లోనే అందరూ స్పందించాలి: సీఎం
సభ్యులంతా అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం ఆదేశం
- ముగిసిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం(CLP Meeting)
- సభ్యులంతా సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం ఆదేశం
- ఎమ్మెల్యేలు మాట్లాడేలా మంత్రులు సమయం ఇవ్వాలని సీఎం సూచన
- ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు నేను కూడా సమయం ఇస్తా: సీఎం
- కాంగ్రెస్ సభ్యులు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని సీఎం సూచన
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన బీజేపీ
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన బీజేపీ(Bengal Poll)
- బెంగాల్‌లో 144 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ
ఫలక్‌నుమా పరిధిలో అగ్నిప్రమాదం, ఫర్నిచర్ షాపుతో పాటు పలు దుకాణాలకు వ్యాపించిన మంటలు
- హైదరాబాద్: ఫలక్‌నుమా పరిధి ఫరూక్‌నగర్‌లో అగ్నిప్రమాదం
- ఫరూక్‌నగర్ బస్‌డిపో పక్కన దుకాణాల్లో ఎగిసిపడుతున్న మంటలు
- రోడ్డుపక్కన ఉన్న ఒక దుకాణంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు
- పక్కనే ఉన్న ఫర్నిచర్ షాపుతో పాటు పలు దుకాణాలకు వ్యాపించిన మంటలు
- ఫర్నిచర్ దుకాణానికి మంటలు వ్యాపించడంతో పెరిగిన మంటల తీవ్రత
- ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోంది: హరీశ్‌రావు
తెలంగాణకు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ప్రతిసారి ఎత్తిచూపుతున్నాం: హరీశ్‌రావు
గోదావరి, కృష్ణా జలాల హక్కుల్లో మనకు తీవ్ర అన్యాయం జరుగుతోంది: హరీశ్‌రావు
కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాల్లో కూడా అన్యాయం జరుగుతోంది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టీడీపీ చేతిలో కీలుబొమ్మగా మారింది
సీడబ్ల్యూసీ మీటింగ్ వెళ్లటం లేదంటూనే.. ఏపీ డిమాండ్లకు సంతకం చేసి వస్తున్నారు : హరీశ్‌రావు
రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీయే జరగలేదని సీడబ్ల్యూసీ మీటింగ్‌లో జీఆర్‌ఎంబీ చెప్పింది
బచావత్ ట్రైబ్యునల్ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని జీఆర్‌ఎంబీ అంటోంది
జలాల పంపిణీ జరగలేదని జీఆర్‌ఎంబీ ఎలా చెబుతుంది?: హరీశ్‌రావు
గోదావరిలో నీటి కేటాయింపులు జరగకపోతే.. ప్రాజెక్టులకు అనుమతి ఎలా ఇస్తున్నారు?
గోదావరి బేసిన్‌లో వివిధ రాష్ట్రాలు చేపట్టిన 76 ప్రాజెక్టులకు అనుమతి ఎలా ఇచ్చారు
సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోంది: హరీశ్‌రావు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టీడీపీ చేతిలో కీలుబొమ్మగా మారింది: హరీశ్‌రావు
- తెలంగాణకు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ప్రతిసారి ఎత్తిచూపుతున్నాం: హరీశ్‌రావు
- గోదావరి, కృష్ణా జలాల హక్కుల్లో మనకు తీవ్ర అన్యాయం జరుగుతోంది: హరీశ్‌రావు
- కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాల్లో కూడా అన్యాయం జరుగుతోంది
- కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టీడీపీ చేతిలో కీలుబొమ్మగా మారింది
- సీడబ్ల్యూసీ మీటింగ్ వెళ్లటం లేదంటూనే.. ఏపీ డిమాండ్లకు సంతకం చేసి వస్తున్నారు
- ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ అజెండా మొదటి అంశం… పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టు
- అజెండాలో నల్లమలసాగర్ లేకుంటేనే మీటింగ్ వస్తామని చెప్పి తెలంగాణను మోసం చేశారు
- రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీయే జరగలేదని సీడబ్ల్యూసీ మీటింగ్‌లో జీఆర్‌ఎంబీ చెప్పింది
- జలాల పంపిణీ జరగలేదని జీఆర్‌ఎంబీ ఎలా చెబుతుంది?: హరీశ్‌రావు
బంధువులతో ఫోటో దిగుతూ ఒక్కసారిగా కుప్పకూలిన సుస్మిత
- ఖమ్మంలో గృహప్రవేశ వేడుకలో విషాదం
- ఫొటో దిగుతూ గుండెపోటుతో కుప్పకూలి మహిళ మృతి
- బంధువులతో ఫోటో దిగుతూ ఒక్కసారిగా కుప్పకూలిన సుస్మిత
- ఖమ్మం: మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించిన బంధువులు
- ఖమ్మం: అప్పటికే సుస్మిత చనిపోయారని ధ్రువీకరించిన వైద్యులు
939 పాయింట్ల లాభంతో 75,503 వద్ద ముగిసిన సెన్సెక్స్
- భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు(Stock Market Update)
- 939 పాయింట్ల లాభంతో 75,503 వద్ద ముగిసిన సెన్సెక్స్
- 258 పాయింట్ల లాభంతో 23,409 వద్ద ముగిసిన నిఫ్టీ
మేడ్చల్: శామీర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌పై రోడ్డుప్రమాదం, ఇద్దరు మృతి
- మేడ్చల్: శామీర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌పై రోడ్డుప్రమాదం, ఇద్దరు మృతి
- ఆడి కారు ఆపి భోజనం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కంటైనర్
- ప్రమాదంలో మౌలాలికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి
గ్రేటర్‌లో ఈనెల 23 నుంచి పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్ల నిర్ణయం
- జీహెచ్ఎంసీ పనులు చేసే కాంట్రాక్టర్ల కీలక నిర్ణయం
- గ్రేటర్‌లో ఈనెల 23 నుంచి పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్ల నిర్ణయం
- 3 నెలలుగా బిల్లులు రావట్లేదని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల ఆందోళన
- జీహెచ్ఎంసీ విభజన పేరుతో బిల్లులు చెల్లించట్లేదని కాంట్రాక్టర్ల ఆరోపణ
- జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు వినతిపత్రం అందజేసిన కాంట్రాక్టర్లు
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ఈనెల 20న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- ఈనెల 20న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- ఈనెల 23, 24, 25, 26 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ, పద్దులపై చర్చ
- రేపు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
- ఈనెల 31 అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్న ప్రభుత్వం
- ఆదివారాలు కూడా సమావేశాలు కొనసాగించాలని ఇతర పార్టీల అభిప్రాయం
- ఉగాది, రంజాన్, శ్రీరామనవమి మినహా అన్ని రోజులు నడపాలని సభ్యుల విజ్ఞప్తి
స్పీకర్ ఛాంబర్‌లో కొనసాగుతున్న బీఏసీ సమావేశం
- స్పీకర్ ఛాంబర్‌లో కొనసాగుతున్న బీఏసీ సమావేశం
- బీఏసీ సమావేశంలో పాల్గొన్న భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొన్నం
- బీఏసీ సమావేశానికి హాజరైన హరీశ్‌రావు, కేపీ వివేకానందగౌడ్
- బీఏసీ సమావేశానికి హాజరైన బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి
- బీఏసీ సమావేశానికి హాజరైన అక్బరుద్దీన్(ఎంఐఎం), కూనంనేని సాంబశివరావు(సీపీఐ)
మాజీమంత్రి జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవాలనట్లేదు: ఎమ్మెల్యే సంజయ్
- మాజీమంత్రి జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవాలనట్లేదు: ఎమ్మెల్యే సంజయ్
- జీవన్‌రెడ్డితో కలిసి పనిచేయాలనుకుంటున్నాను: ఎమ్మెల్యే సంజయ్
- జీవన్‌రెడ్డి ఆలోచన ఏముందో నాకు తెలియదు: ఎమ్మెల్యే సంజయ్
ఆసిఫాబాద్: పెంచికలపేట మండలం కొండపల్లిలో దారుణం
- ఆసిఫాబాద్: పెంచికలపేట మండలం కొండపల్లిలో దారుణం
- సలుగుపల్లి అటవీ ప్రాంతంలో ఆదివాసీ యువతి సమ్మక్క(25) హత్య
- సమ్మక్కను ప్రియుడే గొంతు నులిమి చంపినట్లు అనుమానం
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మీడియా సమావేశం
- జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మీడియా సమావేశం
- ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీతో పన్ను చెల్లించే అవకాశం
- మార్చి 31 వరకు ఆస్తి పన్ను వడ్డీపై రాయితీతో చెల్లించే అవకాశం
- ఓటీఎస్ స్కీమ్‌ను అందరూ వాడుకోవాలి: జీహెచ్‌ఎంసీ కమిషనర్
- 28 లక్షల ఆస్తి పన్నుల్లో 18 లక్షల మంది ఆస్తి పన్నులు చెల్లించారు
- ఇప్పటివరకు రూ.2,186 కోట్ల ఆస్తి పన్ను వసూలు అయ్యాయి
- ఓటీఎస్ స్కీమ్ ద్వారా ప్రభుత్వానికి రూ.320 కోట్ల ఆదాయం
- ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టబోతున్నాం
- పారిశుద్ధ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్
- మెగా ఈ-వేస్ట్ డ్రైవ్ చేపట్టాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్
అసెంబ్లీ సమావేశాలు కనీసం 25 రోజులు నిర్వహించాలి: కూనంనేని
- రాష్ట్రం అప్పుల్లో ఉంది: కూనంనేని సాంబశివరావు
- ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రభుత్వం పరిష్కరించాలి: కూనంనేని
- డబ్బుల్లేక ప్రాజెక్టుల పనులు ముందుకు కదలట్లేదు: కూనంనేని
- అసెంబ్లీ సమావేశాలు కనీసం 25 రోజులు నిర్వహించాలి: కూనంనేని
స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం
- స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం
- బీఆర్ఎస్ తరపున బీఏసీ సమావేశానికి హాజరైన హరీశ్‌రావు, వివేకానందగౌడ్
కాసేపట్లో సీఎల్పీ సమావేశం
- కాసేపట్లో సీఎల్పీ సమావేశం
- అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు: ఆది శ్రీనివాస్
- మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు: ఆది శ్రీనివాస్
- మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం: ఆది శ్రీనివాస్
- మీ హయాంలో ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: ఆది శ్రీనివాస్
- ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తున్నాం: ఆది శ్రీనివాస్
అసెంబ్లీ ఆవరణలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి చిట్ చాట్
- అసెంబ్లీ ఆవరణలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి చిట్ చాట్
- సినిమా ఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలు ఎక్కువ ఉన్నాయి: ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి
- ప్రజాప్రతినిధులతో పాటు సినీ ఆర్టిస్టులూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి: అనిరుద్‌రెడ్డి
- 90 రోజులకొకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి: ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి
- డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్న తర్వాతనే సినిమాలు విడుదల చేయాలి: అనిరుద్‌రెడ్డి
- డ్రగ్స్ టెస్ట్ చేయించుకోకపోతే సినిమాలు విడుదల కావు: ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి
- రాజకీయ నాయకులు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి: అనిరుద్‌రెడ్డి
- డ్రగ్స్ టెస్ట్ చేయించుకోకుంటే ప్రజాప్రతినిధులు అసెంబ్లీలోకి రావొద్దు: అనిరుద్‌రెడ్డి
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు
- కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు
- మున్సిపాలిటీలోని అన్ని శాఖలపై ఏసీబీ డీఎస్పీకి అందిన పలు ఫిర్యాదులతో సోదాలు
- మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ శాఖలపై ఏసీబీ అధికారుల సోదాలు
మూడో బడ్జెట్ పెట్టబోతున్నారు: బీఆర్‌ఎస్ నేతలు
- మూడో బడ్జెట్ పెట్టబోతున్నారు: బీఆర్‌ఎస్ నేతలు
- మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఇవ్వలేదు: బీఆర్‌ఎస్ నేతలు
- కనీసం గవర్నర్ ప్రసంగంలో కూడా పెట్టలేదు: బీఆర్‌ఎస్ నేతలు
- తెలంగాణ మహిళలను మోసం చేశారు: బీఆర్‌ఎస్ నేతలు
- పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామన్నారు… అదీ లేదు: బీఆర్‌ఎస్ నేతలు
- మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు: ప్రశాంత్‌రెడ్డి
- రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేశారు: ప్రశాంత్‌రెడ్డి
- రైతుబంధను మూడుసార్లు ఎగ్గొట్టారు: ప్రశాంత్‌రెడ్డి
- రైతుబంధుపై గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు: ప్రశాంత్‌రెడ్డి
- జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయట్లేదు: ప్రశాంత్‌రెడ్డి
- హామీల అమలుపై ప్రభుత్వం చేతులెత్తేసిందా?: ప్రశాంత్‌రెడ్డి
దిల్లీ మద్యం కుంభకోణంపై దిల్లీ హైకోర్టులో విచారణ
- దిల్లీ మద్యం కుంభకోణంపై దిల్లీ హైకోర్టులో విచారణ
- రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును దిల్లీ హైకోర్టులో సవాలు చేసిన సీబీఐ
- 23 మంది ప్రతివాదులకు నోటీసులిచ్చినట్లు కోర్టుకు తెలిపిన సీబీఐ
- కౌంటర్ దాఖలుకు కనీసం 4 వారాల గడువు కోరిన ప్రతివాదులు
- సీబీఐ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
- ప్రత్యేక కోర్టు అన్యాయమైన తీర్పు వెలువరించిందన్న తుషార్ మెహతా
- రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరిన తుషార్ మెహతా
- స్టే ఇవ్వలేని పక్షంలో కోర్టు ఉత్తర్వులు అమలులోకి రాకుండా చూడాలన్న తుషార్
- తుషార్ మెహతా వాదనలను తప్పుబట్టిన ప్రతివాదుల తరఫు న్యాయవాదులు
- తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం – లేకుంటే అన్యాయమా అని ప్రశ్నించిన ప్రతివాదులు
- కౌంటర్ దాఖలుకు ప్రతివాదులకు 3 వారాల గడువు ఇచ్చిన దిల్లీ హైకోర్టు
బడంగ్‌పేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
- రంగారెడ్డి : బడంగ్‌పేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
- బడంగ్‌పేట మున్సిపల్ కార్యాలయంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు
- పలు పనులకు రూ.కోట్ల అధికంగా చెల్లించినట్లు ఆరోపణలు
- బడంగ్‌పేట: డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు
- బడంగ్‌పేట: పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు
72వ మిస్ వరల్డ్ పోటీలకు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చాం: గవర్నర్
- 72వ మిస్ వరల్డ్ పోటీలకు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చాం: గవర్నర్
- సమ్మక్క- సారక్క పవిత్ర గద్దెలను పునర్‌నిర్మించాం: గవర్నర్
- సమ్మక్క- సారక్క జాతర దేశంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక పండుగలలో ఒకటిగా నిలిచింది: గవర్నర్
ఎస్‌హెచ్‌జీలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాం: గవర్నర్
- ఎస్‌హెచ్‌జీలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాం: గవర్నర్
- అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నాం: గవర్నర్
- ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం: గవర్నర్
- ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం: గవర్నర్
- కొత్తగా ఎన్నికైన 1.15 లక్షల మంది ప్రజాప్రతినిధులకు అభినందనలు: గవర్నర్
- ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక అమలుకు 99 రోజుల కార్యాచరణ రూపొందించాం: గవర్నర్
- ప్రజావాణిలో 64,697 పిటిషన్లు రాగా 47,670 పరిష్కరించాం: గవర్నర్
- బీసీలకు విద్య, ఉపాధిలో 42 శాతం రిజర్వేషన్ల కోసం చట్టం చేసి కేంద్రానికి పంపాం: గవర్నర్
- ఎస్సీ వర్గీకరణ చేసి 3 గ్రూపులకు రిజర్వేషన్ శాతాలను నిర్ణయించాం: గవర్నర్
- ఈగల్ ప్రత్యేక బృందం ద్వారా డ్రగ్స్ సమస్యను నిర్మూలించేందుకు కృషి: గవర్నర్
- టీజీపీఎస్సీ, ఇతర నియామక బోర్డులను సంస్కరించాం: గవర్నర్
- రికార్డు సమయంలో 67,763 ఉద్యోగాలు భర్తీ చేశాం: గవర్నర్
గతేడాది వానాకాలంలో రైతు భరోసా కింద రూ.8,744 కోట్లు ఇచ్చాం: గవర్నర్
- గతేడాది వానాకాలంలో రైతు భరోసా కింద రూ.8,744 కోట్లు ఇచ్చాం: గవర్నర్
- పంట రుణమాఫీ కోసం రూ. 20,616 కోట్లు ఖర్చు చేశాం: గవర్నర్
- సాగునీటి రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది: గవర్నర్
- ప్రభుత్వం కొత్తగా 15.12 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది: గవర్నర్
- రాష్ట్రవ్యాప్తంగా 3.38 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం: గవర్నర్
- 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం: గవర్నర్
- నరేగా ద్వారా 6.52 కోట్ల పనిదినాల ఉపాధి కల్పించాం: గవర్నర్
- మహాలక్ష్మి పథకం ద్వారా 269 కోట్ల ఉచిత ట్రిప్పులు కల్పించాం: గవర్నర్
- మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ.9,222 కోట్ల ఆదా: గవర్నర్
- గృహజ్యోతి ద్వారా 10.97 కోట్ల జీరో బిల్లులు జారీ చేశాం: గవర్నర్
కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది: గవర్నర్
- కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది: గవర్నర్
- 23వ బయోఆసియా సదస్సు ద్వారా రూ.1,700 కోట్ల పెట్టబడులు ఆకర్షించాం: గవర్నర్
- రూ.1.61 లక్షల కోట్ల విలువైన ఎగుమతులతో రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉంది: గవర్నర్
- సేవారంగం 13.5 శాతం వృద్ధితో రాష్ట్ర జీవీఏకు 68.6 శాతం మేరకు దోహదపడుతోంది: గవర్నర్
- జీసీసీలలో 20 శాతం ఆతిధ్యం ఇస్తూ హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్‌గా మారింది: గవర్నర్
- ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా కొనసాగుతోంది: గవర్నర్
- ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి: గవర్నర్
- ఐటీ రంగం 9.39 లక్షల ఉద్యోగాలు కల్పిస్తోంది: గవర్నర్
- వ్యవసాయరంగ అభివృద్ధికి రేర్ నమూనా రూపొందించాం: గవర్నర్
విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్ రూపొందించాం: గవర్నర్
- విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్ రూపొందించాం: గవర్నర్
- రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18 లక్షలకు చేరింది: గవర్నర్
- క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు: గవర్నర్
- రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నాం: గవర్నర్
- 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందిని అంచనా: గవర్నర్
- జీహెచ్‌ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లగా విభజించాం: గవర్నర్
- హైదరాబాద్ మెట్రోపాలిటిన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించాం: గవర్నర్
- హైడ్రా ద్వారా 1,045 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం: గవర్నర్
- హైడ్రా ద్వారా రూ.60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం: గవర్నర్
శాసనసభ సమావేశాలు ప్రారంభం
- శాసనసభ సమావేశాలు ప్రారంభం
- ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగం
- తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ ఎస్‌పీ శుక్లా
- తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ ఎస్‌పీ శుక్లా
- శ్రమించేతత్వంగల శాంతికాముక తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: గవర్నర్
- ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా బడ్జెట్: గవర్నర్
- ప్రతివర్గానికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: గవర్నర్
- ప్రజాకేంద్రీకృత పాలన ప్రభుత్వ విధానం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- 2047 తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నాం: గవర్నర్
- దేశ జీడీపీకి తెలంగాణ 4.99 శాతం అందిస్తోంది: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
గండిపేట వద్ద విషాదం
- హైదరాబాద్: గండిపేట వద్ద విషాదం
- మూసీ నదిలో చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి
- మృతులు: కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేష్ (25)
- ముగ్గురూ హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తింపు
- హైదరాబాద్: మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు
అసెంబ్లీలోని భట్టి ఛాంబర్‌లోకి ఎమ్మెల్యేలను అనుమతించని గన్‌మెన్లు
- అసెంబ్లీలోని భట్టి ఛాంబర్‌లోకి ఎమ్మెల్యేలను అనుమతించని గన్‌మెన్లు
- భట్టి ఛాంబర్‌లోకి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మెల్యేలు మందుల సామెలు, సత్యనారాయణ
- ఎమ్మెల్యేలు వెళ్లేందుకు అనుమతించని గన్‌మెన్లు
- అసంతృప్తితో అక్కడ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు
శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- పునరుద్ధరించిన శాసనమండలి భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- అసెంబ్లీ ఆవరణలో గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించిన గవర్నర్
- హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, స్పీకర్, మండలి ఛైర్మన్
నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన
అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు స్వాగతం పలికిన సీఎం రేవంత్‌రెడ్డి
- గవర్నర్‌కు స్వాగతం పలికిన స్పీకర్, మండలి ఛైర్మన్
ఆరు గ్యారెంటీలు, రైతులు, నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం: కేటీఆర్
- త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తోంది: కేటీఆర్
- ఆరు గ్యారెంటీలు, రైతులు, నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం: కేటీఆర్
- కాంగ్రెస్ సర్కారు వచ్చాక అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు: కేటీఆర్
అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు
- హైదరాబాద్: గన్‌పార్క్ వద్దకు చేరుకున్న కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నేతలు
- అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు
- 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి అంటూ ప్లకార్డుల ప్రదర్శన
- అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న బీఆర్‌ఎస్ నేతలు
కాసేపట్లో శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- కాసేపట్లో శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- పునరుద్ధరించిన శాసనమండలి భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా
కాసేపట్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
- కాసేపట్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
- ఉదయం 11.45 గంటలకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
- ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం
- సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించే అంశంపై బీఏసీలో నిర్ణయం
- ఈనెల 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క
శ్రీశైలంలో నేటి నుంచి ఈ నెల 20 వరకు ఉగాది మహోత్సవాలు
- శ్రీశైలంలో నేటి నుంచి ఈనెల 20 వరకు ఉగాది మహోత్సవాలు
- కాసేపట్లో ఉత్సవాలకు ప్రారంభ పూజలు చేయనున్న ఈవో, అర్చకులు
- శ్రీశైలం: రాత్రి 7 గంటలకు భృంగి వాహన సేవ
- మహాలక్ష్మి అలంకారంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారు
- నేటి నుంచి 20 వరకు మల్లన్న అలంకార దర్శనం ఏర్పాటు
లాస్ ఏంజెలెస్‌లో 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం
- లాస్ ఏంజెలెస్‌లో 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ చిత్రం – వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ నటుడు: మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్)
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ నటి – జెస్సీ బక్లీ (హామ్నెట్)
- ఉత్తమ దర్శకుడు – పాల్ థామస్ ఆండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
- ఉత్తమ సహాయ నటుడు – సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ సహాయ నటి – ఎమీ మాడిగన్ (వెపన్స్)
- ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – కెపాప్ డిమాన్ హంటర్స్
- ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్- ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – ఫ్రాంకెన్‌స్టైయిన్
- ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ – ఫ్రాంకెన్‌స్టైయిన్
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ క్యాస్టింగ్ – వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
- ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ది సింగర్స్, టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – సిన్నర్స్
- ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ – మిస్టర్. నోబడీ ఎగనెస్ట్ పుతిన్
- ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ – ఆల్ ది ఎంప్టీ రూమ్స్
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ సౌండ్ – ఎఫ్ 1
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ ఎడిటింగ్ – వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ సినిమాటోగ్రఫీ- సిన్నర్స్
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ – అవతార్ ఫైర్ అండ్ యాష్
- ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ – సెంటిమెంటల్ వ్యాల్యూ (నార్వే)
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – గోల్డెన్ (కెపాప్ డెమోన్ హంటర్స్)
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ ఒరిజినల్ స్కోర్ – సిన్నర్స్
- ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – ఫ్రాంకెన్‌స్టైయిన్
గ్రాండ్‌గా ఆస్కార్ అవార్డుల సెర్మనీ- చరిత్రలో ఏడోసారి ‘టై’- బెస్ట్ మూవీ ఏంటంటే?
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో అగ్నిగుండ ప్రవేశం వైభవంగా నిర్వహణ
- కొమురవెల్లి మల్లన్న ఆలయంలో అగ్నిగుండ ప్రవేశం వైభవంగా నిర్వహణ
- 3 నెలలుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలకు అగ్నిగుండ ప్రవేశంతో ముగింపు
- భారీగా తరలివచ్చిన భక్తులు నిప్పులపై నడిచి స్వామివారిని దర్శనం
- అర్ధరాత్రి 12 గంటల తర్వాత అగ్నిగుండానికి భూమిపూజ నిర్వహణ
- భద్రకాళీ మాత అష్టోత్తర శతనామ పూజతో అగ్నిప్రతిష్ట
- కట్టెలు పేర్చి అగ్నిగుండం సిద్ధం చేసిన ఆలయ అర్చకులు
- తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండం ఎదుట ప్రత్యేక పూజలు
- అష్టదిక్పాలకులు, భైరవ పూజలతో బలిహరణ కార్యక్రమాలు
- స్వామివారి చిత్రముఖం, ఖడ్గాలతో అర్చకులు ముందుగా అగ్నిగుండం దాటి ప్రారంభం
- భక్తిశ్రద్ధలతో అగ్నిగుండంలోకి ప్రవేశించిన శివసత్తులు, భక్తులు
- ఒక్కొక్కరిని అగ్నిగుండంలోకి అనుమతించిన పోలీసులు
- పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలతో ఆలయ పరిసరాల్లో భక్తుల ఉత్సాహం
- బోనాలు నెత్తిన పెట్టుకుని ఆలయంలో బారులు తీరిన భక్తులు
ఒడిశాలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి
- ఒడిశాలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి
- కటక్‌లోని ఎస్‌సీబీ వైద్య కళాశాల ఐసీయూలో చెలరేగిన మంటలు
- ఆస్పత్రి అత్యవసర విభాగంలోని ట్రామా కేర్ ఐసీయూలో అర్ధరాత్రి మంటలు
- ఘటనాస్థలిని పరిశీలించి బాధితులను పరామర్శించిన ఒడిశా సీఎం
- మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించిన ఒడిశా సీఎం
- ఘటనపై విచారణకు ఆదేశించిన ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ
నేడు ఉదయం శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- నేడు ఉదయం శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- పునరుద్ధరించిన శాసనమండలి భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఉదయం 11.27- 11.37 మధ్య సమయంలో విగ్రహావిష్కరణ
- అనంతరం 11.45 గంటలకు ఉభయసభ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ సభ్యుల నివాళులు
- నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ సభ్యుల నివాళులు
- అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- సాయంత్రం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
- ఇఫ్తార్ విందులో పాల్గొననున్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- ఉదయం 11.45 గంటలకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
- ఉభయ సభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
- బీఏసీ భేటీలో సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించే అంశంపై నిర్ణయం
- ఈనెల 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక శాఖ మంత్రి భట్టివిక్రమార్క
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
- మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
- పైలట్ రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్ శర్మకు రిమాండ్ విధించిన జడ్జి
- హైదరాబాద్: ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించిన ఉప్పర్‌పల్లి జడ్జి
- ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలింపు
నేటి నుంచి శ్రీశైలంలో 5 రోజులపాటు ఉగాది మహోత్సవాలు
- నేటి నుంచి శ్రీశైలంలో 5 రోజులపాటు ఉగాది మహోత్సవాలు
- శ్రీశైలం: ఉగాది ఉత్సవాల్లో నిత్యం స్వామి అమ్మవార్లకు వాహన సేవలు
- ఉగాది ఉత్సవాలు తిలకించేందుకు తరలివస్తున్న కన్నడ భక్తులు
- నల్లమల అడవుల మీదుగా నడిచి వస్తున్న వేలమంది కన్నడ భక్తులు