LIVE FEED
- మంచిర్యాల: క్యాతనపల్లిలో బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ అరెస్టు
- బాల్క సుమన్‌ను అరెస్టు చేసిన బెల్లంపల్లి ఏసీపీ, సీఐ
- బాల్క సుమన్‌ను శ్రీరాంపూర్ పీఎస్‌కు తీసుకెళ్తున్న పోలీసులు
- బాల్క సుమన్ అరెస్టు సమయంలో పోలీసులతో బీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం
- బాల్క సుమన్ ఇంటి వద్ద భారీగా గుమికూడిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు
- బాల్క సుమన్ అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్‌ఎస్ నేతలు
- పోలీసులు, బాల్క సుమన్ అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట
- అరెస్టుకు సహకరించాలని బాల్క సుమన్‌కు సూచించిన పోలీసులు
- నిన్న రామకృష్ణాపూర్ పీఎస్‌లో బాల్క సుమన్‌పై కేసు నమోదు
- బాల్క సుమన్ పోలీసులపై దౌర్జన్యం చేశారని కేసు నమోదు
- బాల్క సుమన్ పోలీసుల విధులను అడ్డుకున్నారని కేసు నమోదు
- క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్త వాతావరణం
- క్యాతనపల్లిలో భారీగా మోహరించిన పోలీసులు
- నిన్నటి నుంచి క్యాతనపల్లిలోని ఇంట్లోనే ఉన్న బాల్క సుమన్
- బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ ఇంటి చుట్టూ మోహరించిన పోలీసులు
- బాల్క సుమన్ ఇంటిముందు గుమికూడిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు
- బాల్క సుమన్‌ను అరెస్టు చేస్తారని భావించి గుమికూడిన కార్యకర్తలు
- ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ శ్రేణుల నినాదాలు
- రామకృష్ణాపూర్ పీఎస్‌లో బాల్క సుమన్‌పై కేసు నమోదు
- బాల్క సుమన్ పోలీసులపై దౌర్జన్యం చేశారని కేసు నమోదు
- బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశం
- అరెస్టు చేస్తే అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్న కార్యకర్తలు
- మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠ
- ఛైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఘర్షణ
- ఏఐ అభివృద్ధికి భారత్‌లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి: సుందర్ పిచాయ్
- భారత్‌లో ప్రచండవేగంతో ఏఐ అభివృద్ధి చెందే అవకాశాలు: సుందర్ పిచాయ్
- భారత్‌లో ఉన్న విస్తృత అవకాశాల వల్లే మేం భాగస్వాములం అవుతున్నాం
- భారత్‌తో గూగుల్ సంస్థకు ఫుల్‌స్టాక్ కనెక్టివిటీ ఉంది: సుందర్ పిచాయ్
- భారత్-అమెరికా మధ్య సముద్ర కేబుల్ వ్యవస్థతో కనెక్టివిటీ మరింత బలోపేతం: సుందర్ పిచాయ్
- భారత్‌లో ఏఐ అభివృద్ధికి సముద్ర కేబుల్ వ్యవస్థ బూస్ట్‌గా పనిచేస్తుంది: సుందర్ పిచాయ్
- ప్రపంచంలోని అనేక వ్యవస్థలపై ఏఐ తీవ్ర ప్రభావం చూపుతోంది: సుందర్ పిచాయ్
- కొత్త సంస్థల అభివృద్ధికి భారత్‌లో మంచి ఎకో సిస్టమ్ ఉంది: సుందర్ పిచాయ్
- హైదరాబాద్: బీఎన్‌రెడ్డి నగర్ పరిధి గ్రీన్‌సిటీ కాలనీలో దారుణం
- విడాకులు ఇచ్చిందన్న కోపంతో సునీతను చంపిన మాజీ భర్త
- మహేశ్‌కు విడాకులిచ్చి రెండో వివాహం చేసుకున్న సునీత
- ఇంట్లో చొరబడి సునీతను దారుణంగా నరికి చంపిన మొదటి భర్త మహేశ్
- సునీత రెండో భర్త ఇంట్లోకి కత్తులు, పెట్రోల్ డబ్బాతో వెళ్లిన మహేశ్
- ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి నిప్పంటిస్తానంటూ హెచ్చరికలు
- కత్తులతో సునీత తలపై దారుణంగా నరికి చంపిన మహేశ్
- నిందితుడు మహేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- 2023లో జరిగిన మహేశ్, సునీత వివాహం
- వివాహమైన కొన్నాళ్లకే మనస్పర్థలతో విడిపోయిన మహేశ్, సునీత
- విడిపోయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని బీఎన్‌రెడ్డి నగర్‌లో ఉంటున్న సునీత
- సునీత ఇంటి అడ్రస్ తెలుసుకుని, పక్కా ప్రణాళికతో వెళ్లి హత్య చేసిన మహేశ్
- కెనడాలో ఉద్యోగం చేస్తున్న నిందితుడు మహేశ్
- బ్యాగ్‌లో పెట్రోల్ డబ్బా, వుడ్ కటింగ్ మిషన్, 2 కత్తులతో వెళ్లిన మహేశ్
- ఘటన సమయంలో ఫ్లాట్‌లోనే ఉన్న సునీత అత్త, మరిది
- నేరుగా సునీత గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసిన మహేశ్
- ముంబయి నుంచి దిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి
- రాత్రి 7.30 గం.కు ప్రధాని ఏర్పాటు చేసిన విందుకు హాజరుకానున్న సీఎం
- ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా దిల్లీలో విందు ఏర్పాటు చేసిన మోదీ
- భారత్ మండపంలో ప్రధాని ఇచ్చే విందులో పాల్గొననున్న సీఎం
- రేపు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న సీఎం
- ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి శ్రీధర్‌బాబు
- బీసీలకు 60 శాతం కంటే ఎక్కువ సీట్లు, పదవులు వచ్చాయి: యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
- జనరల్ స్థానాల్లో కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాం: యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
- మా నాయకుడు రాహుల్‌గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాం: యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
- ఎన్నికల తర్వాత రాజకీయాలు ఉండొద్దనేది సీఎం రేవంత్‌రెడ్డి ఆశయం: యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
- అందుకే కొన్నిచోట్ల కలిసివచ్చే వారిని కలుపుకుని ఛైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం
- గతంలో పదేళ్లలో చూసిన బురద రాజకీయాలకు విరుద్ధంగా వెళ్తున్నాం: యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
విడాకులు ఇచ్చిందన్న కోపంతో మాజీ భార్యను చంపిన మాజీ భర్త
- హైదరాబాద్: బీఎన్‌రెడ్డి నగర్ పరిధి గ్రీన్‌సిటీ కాలనీలో దారుణం
- విడాకులు ఇచ్చిందన్న కోపంతో సునీతను చంపిన మాజీ భర్త
- మహేశ్‌కు విడాకులిచ్చి రెండో వివాహం చేసుకున్న సునీత
- ఇంట్లో చొరబడి సునీతను దారుణంగా నరికి చంపిన మొదటి భర్త మహేశ్
- సునీత రెండో భర్త ఇంట్లోకి కత్తులు, పెట్రోల్ డబ్బాతో వెళ్లిన మహేశ్
- ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి నిప్పంటిస్తానంటూ హెచ్చరికలు
- కత్తులతో సునీత తలపై దారుణంగా నరికి చంపిన మహేశ్
- నిందితుడు మహేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముంబయి నుంచి దిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి
- ముంబయి నుంచి దిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి
- రాత్రి 7.30 గం.కు ప్రధాని ఏర్పాటు చేసిన విందుకు హాజరుకానున్న సీఎం
- ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా దిల్లీలో విందు ఏర్పాటు చేసిన మోదీ
- భారత్ మండపంలో ప్రధాని ఇచ్చే విందులో పాల్గొననున్న సీఎం
- రేపు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న సీఎం
- ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి శ్రీధర్‌బాబు
నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
- హైదరాబాద్: నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
- బెదిరింపు మెయిల్‌తో కోర్టు నుంచి పరుగులు తీసిన జడ్జిలు, లాయర్లు
- నాంపల్లి కోర్టులో 12 ఆర్డీఎక్స్ పేలుళ్లు జరుగుతాయని మెయిల్
- నాంపల్లి సీబీఐ కోర్టులో బాంబ్ స్క్వాడ్ అధికారుల తనిఖీలు
- కోర్టులో తనిఖీల తర్వాత ఫేక్ మెయిల్‌గా తేల్చిన పోలీసులు
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,500
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,500
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,350
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,48,000
- హైదరాబాద్: నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
- బెదిరింపు మెయిల్‌తో కోర్టు నుంచి పరుగులు తీసిన జడ్జిలు, లాయర్లు
- నాంపల్లి కోర్టులో 12 ఆర్డీఎక్స్ పేలుళ్లు జరుగుతాయని మెయిల్
- నాంపల్లి సీబీఐ కోర్టులో బాంబ్ స్క్వాడ్ అధికారుల తనిఖీలు
- కోర్టులో తనిఖీల తర్వాత ఫేక్ మెయిల్‌గా తేల్చిన పోలీసులు
- దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై స్పీకర్ విచారణ
- అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్లు
- స్పీకర్ విచారణకు హాజరైన కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
- మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో ఉత్కంఠ
- నిన్న బీఆర్‌ఎస్-సీపీఐ, కాంగ్రెస్ వర్గీయుల ఘర్షణతో ఎన్నిక వాయిదా
- మంత్రి వివేక్ ప్రోద్బలంతోనే ఎన్నిక వాయిదా వేసినట్లు బీఆర్‌ఎస్ నేతల ఆరోపణ
- ఇవాళ క్యాతనపల్లి బంద్‌కు పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్-సీపీఐ కూటమి
- బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ ఇంటి చుట్టూ మోహరించిన పోలీసులు
- ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య గృహనిర్బంధం
- మంచిర్యాల సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌ను అరెస్టు చేసిన పోలీసులు
- దాడుల ఘటనపై బాల్క సుమన్ సహా ఆరుగురు బీఆర్‌ఎస్ నాయకులపై కేసు
- మంచిర్యాల: క్యాతనపల్లిలో పోలీసుల మోహరింపుతో ఉద్రిక్తత
- మదనపల్లెలో చిన్నారి హత్య కేసు నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య
- నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడన్న అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్
- చిన్నారి హత్య కేసు నిందితుడి మృతదేహం చెరువులో లభ్యమైంది: ఎస్పీ
- కులవర్థన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు: ఎస్పీ ధీరజ్
- ప్రాథమిక సమాచారం మేరకు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది: ఎస్పీ
- కులవర్ధన్‌ను తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి నిన్న తప్పించుకున్నాడు: ఎస్పీ
- రక్షక్ వాహనంలో తరలిస్తుండగా కులవర్ధన్ తప్పించుకున్నాడు: ఎస్పీ ధీరజ్
- ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగా కులవర్ధన్ శవం దొరికింది: ఎస్పీ ధీరజ్
కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్ మృతదేహం గుర్తించాం: ఎస్పీ ధీరజ్ - కులవర్ధన్ మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాం: ఎస్పీ ధీరజ్
శ్రీశైలం-హైదరాబాద్ జాతీయరహదారిపై వెల్దండ గురుకుల కళాశాల విద్యార్థినుల ధర్నా
- నాగర్‌కర్నూల్: వెల్దండలో గురుకుల కళాశాల విద్యార్థినుల ధర్నా
- శ్రీశైలం-హైదరాబాద్ జాతీయరహదారిపై బైఠాయించిన విద్యార్థులు
- ధర్నా సమయంలో అస్వస్థతకు గురైన నలుగురు విద్యార్థినులు
- పరిస్థితి విషమించిన బాలికను ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు
- మెనూ ప్రకారం భోజనం అందించట్లేదని విద్యార్థినుల ఆరోపణ
- హాస్టల్‌లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినుల ఆవేదన
- ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని విద్యార్థినుల డిమాండ్
- విద్యార్థినులతో చర్చలు జరిపిన వెల్దండ తహసీల్దార్ కార్తీక్ కుమార్
- విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న తహసీల్దార్, పోలీసులు
- ప్రిన్సిపల్, అధ్యాపకులు తమను వేధిస్తున్నారని విద్యార్థినుల ఆవేదన
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు తొలగిన అడ్డంకి
- ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు తొలగిన అడ్డంకి
- ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిర్ణయం ఆర్‌వోదేనన్న హైకోర్టు(TG High Court)
- ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో తుదినిర్ణయం ఆర్‌వోదేనన్న హైకోర్టు
- యాదగిరిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని కలెక్టర్, పోలీసులకు హైకోర్టు ఆదేశం
- యాదగిరి స్వచ్ఛందంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం
- యాదగిరి కుమారుడి హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- స్వస్తివచనం, విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- ఈనెల 28వ తేదీ వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు
- ఈనెల 28 వరకు యాదగిరిగుట్ట ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు
కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
- కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
- 12 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్లు జిల్లా కోర్టుకు మెయిల్
- బాంబు బెదిరింపులతో కోర్టు ఆవరణలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు
ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ
- ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ
- ఇవాళ దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై స్పీకర్ విచారణ
- స్పీకర్ విచారణకు హాజరైన పిటిషనర్ పాడి కౌశిక్‌రెడ్డి
- మ.12 గం.కు హాజరుకానున్న మరో పిటిషనర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
- పిటిషనర్ల నుంచి సాక్ష్యాలు నమోదు చేయనున్న స్పీకర్
- దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు
- కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టనున్న స్పీకర్
- కడియంపై అనర్హత వేటు వేయాలంటూ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్
బీఆర్‌ఎస్ కౌన్సిలర్ యాదగిరిని హైకోర్టులో హాజరుపర్చిన పోలీసులు
- బీఆర్‌ఎస్ కౌన్సిలర్ యాదగిరిని హైకోర్టులో హాజరుపర్చిన పోలీసులు
- తమ తండ్రి కనిపించట్లేదని హైకోర్టులో యాదగిరి కుమారుడు హెబియస్ కార్పస్ పిటిషన్
- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కుమారుడు బలవంతంగా తీసుకెళ్లినట్లు కోర్టుకు తెలిపిన యాదగిరి
- బాపట్ల జిల్లా చీరాల తీసుకెళ్లినట్లు కోర్టుకు తెలిపిన యాదగిరి
- బౌన్సర్లను పెట్టి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారన్న యాదగిరి
- బీఆర్‌ఎస్ తరఫున మున్సిపల్ ఛైర్మన్ రేసులో ఉన్నానన్న యాదగిరి
- ఈనెల 16న ఉదయం నుంచి రాత్రి వరకు కారులోనే తిప్పారన్న యాదిగిరి
- తనకు బీపీ, షుగర్ ఉన్నా భోజనం కూడా ఇవ్వలేదని తెలిపిన యాదగిరి
- తాను లేకపోతే కోరమ్ ఉండదనే తనను తీసుకెళ్లినట్లు కోర్టుకు తెలిపిన యాదగిరి
- నేను కనిపించకపోవడంతో నా కుమారుడు పిటిషన్ వేశారని తెలిపిన యాదగిరి
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ
- ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ (Telangana Municipal Election 2025)
- బీఆర్‌ఎస్ 19వ వార్డు కౌన్సిలర్ యాదగిరిని హైకోర్టులో హాజరుపర్చిన పోలీసులు
- తన తండ్రి కనిపించట్లేదని హైకోర్టులో యాదగిరి కుమారుడు హెబియస్ కార్పస్ పిటిషన్
- యాదగిరి కుమారుడు హైకోర్టులో పిటిషన్ వేయడంతో నిలిచిన ఎన్నిక ప్రక్రియ
- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఎన్నిక ప్రక్రియ నిలిపివేసిన ఎన్నికల అధికారులు
- ఏజీ నుంచి ఫోన్ కాల్ రావడంతో ఎన్నిక ప్రక్రియ నిలిపివేసిన ఎన్నికల అధికారి
- హైకోర్టు తదుపరి ఆదేశాలు, ఎన్నికల సూచనలతో రేపు ఎన్నిక నిర్వహించే అవకాశం
- నిన్న 19వ వార్డు కౌన్సిలర్‌గా ప్రమాణం చేసిన ఆకుల యాదగిరి
- బీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో పాటు పురపాలక కార్యాలయానికి వచ్చిన యాదగిరి
- ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియలోనూ పాల్గొన్న యాదగిరి
- మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సమయంలో ఏజీ నుంచి ఫోన్‌కాల్‌తో ఎన్నికల ప్రక్రియ నిలిపివేత
మంచిర్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం, దంపతులు మృతి
- మంచిర్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం, దంపతులు మృతి
- జైపూర్ మం. టేకుమట్ల పైవంతెన వద్ద బైకును ఢీకొన్న లారీ
- ప్రమాదంలో దంపతులు నారాయణ (70), భారతమ్మ (55) మృతి
- మృతులు నస్పూరు మం. సంగమల్లయ్యపల్లి వాసులుగా గుర్తింపు
తెలంగాణ పోలీసు క్రీడా పోటీలను ప్రారంభించిన డీజీపీ శివధర్‌రెడ్డి
- తెలంగాణ పోలీసు క్రీడా పోటీలను ప్రారంభించిన డీజీపీ శివధర్‌రెడ్డి
- సైబరాబాద్ పరేడ్ మైదానంలో పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్
- బెలూన్లు ఎగురవేసి క్రీడా పోటీలను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి
- ఈనెల 21 వరకు జరగనున్న పోలీసు క్రీడా పోటీలు
- పోటీల్లో పాల్గొంటున్న 3,300 మంది క్రీడాకారులు
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
- రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
- ఎన్నికల షెడ్యూల్ జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
- పది రాష్ట్రాల్లో 37 మంది సభ్యుల పదవీకాలం పూర్తితో షెడ్యూల్ విడుదల
- అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు మార్చి 5 వరకు గడువు
- మార్చి 6న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
- నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 9 వరకు గడువు
- మార్చి 16న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్
- మార్చి 16న సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
- మార్చి 20తో ముగియనున్న ఎన్నికల గడువు
రాష్ట్రం నుంచి రెండు స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- రాష్ట్రం నుంచి రెండు స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు
- ఏప్రిల్ 9న ముగియనున్న కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ పదవీకాలం
- ఫిబ్రవరి 26న నోటిఫికేషన్, మార్చి 16న పోలింగ్
విశాఖ తీరంలో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష
- విశాఖ తీరంలో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష
- ఐఎఫ్‌ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము
- విశాఖ: ఆరు వరుసల్లో 71 యుద్ధనౌకల పరేడ్ నిర్వహణ
- నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి ముర్ము
- కాసేపట్లో ఐఎన్‌ఎస్-సుమేధ నౌకపై ప్రయాణించనున్న రాష్ట్రపతి
- రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు
- ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న ఐఎన్‌ఎస్ విక్రాంత్, 45 యుద్ధనౌకలు
- ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న కోస్ట్‌గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన నౌకలు
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ రాత పరీక్షకు 3,760 మంది అర్హత
- తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ రాత పరీక్షకు 3,760 మంది అర్హత
- నవంబర్‌లో 60 పోస్టులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్
- జనవరిలో ధ్రువపత్రాల పరిశీలనలో షార్ట్ లిస్ట్ అయిన 3760 మంది అభ్యర్థులు
- మార్చి 5, 6, 7 తేదీల్లో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ రాత పరీక్ష
- మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పరీక్ష నిర్వహణ
- సందేహాలపై ఈనెల 21 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచన
- రూ.500 ఫీజు చెల్లించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని వెల్లడి
మదనపల్లె చిన్నారి హత్య కేసు నిందితుడు కులవర్ధన్ మృతి
- అన్నమయ్య జిల్లా: మదనపల్లె చిన్నారి హత్య కేసు నిందితుడు కులవర్ధన్ మృతి
- కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్ మృతదేహం లభ్యం
- కులవర్ధన్ మృతదేహం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలింపు
- స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని పోలీసుల విచారణ
- మదనపల్లెలో చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు కులవర్ధన్
అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో వ్యక్తి మృతదేహం గుర్తింపు
- అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో వ్యక్తి మృతదేహం గుర్తింపు
- స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేస్తున్న పోలీసులు
- కురబలకోట మం. కనసానివారిపల్లె చెరువులో వ్యక్తి మృతదేహం గుర్తింపు
- అన్నమయ్య జిల్లా: మృతుడు కులవర్ధన్‌గా అనుమానిస్తున్న స్థానికులు
- మదనపల్లెలో చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న కులవర్ధన్
అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో వ్యక్తి మృతదేహం గుర్తింపు
- అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో వ్యక్తి మృతదేహం గుర్తింపు
- స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేస్తున్న పోలీసులు
- కురబలకోట మం. కనసానివారిపల్లె చెరువులో వ్యక్తి మృతదేహం గుర్తింపు
- అన్నమయ్య జిల్లా: మృతుడు కులవర్ధన్‌గా అనుమానిస్తున్న స్థానికులు
- మదనపల్లెలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేసిన కేసులో నిందితుడిగా కులవర్ధన్
వరంగల్: నల్లబెల్లి మం. శనిగరం వద్ద ప్రమాదం, ఒకరు మృతి
- వరంగల్: నల్లబెల్లి మం. శనిగరం వద్ద ప్రమాదం, ఒకరు మృతి
- లారీ ఢీకొని శనిగరానికి చెందిన కుమారస్వామి (65) మృతి
- జాతీయరహదారిపై ఆందోళనకు దిగిన మృతుడి బంధువులు
- మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్థుల రాస్తారోకో
శ్రీవారి ఆర్జిత సేవల మే నెల కోటా ఉదయం 10 గంటలకు విడుదల
- తిరుమల(Tirumala Update): ఉ.10 గం.కు శ్రీవారి ఆర్జిత సేవల మే నెల కోటా విడుదల
- సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవల కోటా విడుదల
- లక్కీ డిప్ రిజిస్ట్రేషన్‌కు ఈనెల 20న ఉ.10 వరకు ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం
- లక్కీ డిప్‌లో ఎంపికైన వారికి ఈనెల 22న మ.12 లోపు టికెట్లు పొందే అవకాశం
మెదక్: కొల్చరం వద్ద రోడ్డుప్రమాదం, ఒకరు మృతి
- మెదక్: కొల్చరం వద్ద రోడ్డుప్రమాదం, ఒకరు మృతి
- తెల్లవారుజామున చెట్టును ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
- ప్రమాదంలో బీసీవై పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు రోహిత్ గుప్తా (50) మృతి
- కామారెడ్డికి చెందిన విజయ్‌కు తీవ్రగాయాలు, మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- విజయవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా కొల్చారం వద్ద ప్రమాదం
రంగారెడ్డి: షాద్‌నగర్ వద్ద రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి
- రంగారెడ్డి: షాద్‌నగర్ వద్ద రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి (Shadnagar Road Accident)
- అర్ధరాత్రి ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొట్టిన కారు
- ఐదుగురు స్నేహితులు అరుణాచలం వెళ్లి వస్తుండగా ప్రమాదం
- మృతులు తుర్కయాంజల్ వాసులు జైపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి
- ప్రశాంత్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు, మరో ఇద్దరికి గాయాలు
- గాయపడినవారిని షాద్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలింపు
ముంబయి క్లైమేట్ వీక్‌లో నేడు పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి
- ముంబయి క్లైమేట్ వీక్‌లో నేడు పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)
- ఈనెల 19 వరకు ముంబయిలో క్లైమెట్ వీక్ అంతర్జాతీయ సదస్సు
- బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో సదస్సు
- క్లైమేట్ సదస్సును కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కార్యక్రమానికి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించిన మహారాష్ట్ర సీఎం ఫడణవీస్
- రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన, ఇతర అంశాలు వివరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు, రేపు స్పీకర్ విచారణ
- మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు, రేపు స్పీకర్ విచారణ (Telangana Speaker)
- నేడు దానం నాగేందర్, రేపు కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ
- ఉ. 11గం.కు పిటిషనర్ల నుంచి సాక్ష్యాలను రికార్డు చేయనున్న స్పీకర్
- దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు
- రేపు కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై స్పీకర్ విచారణ
- కడియంపై అనర్హత వేటు వేయాలంటూ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్
నేటి నుంచి ఈనెల 28 వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
- నేటి నుంచి ఈనెల 28 వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
- ఉదయం 10 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం
- యాదగిరిగుట్ట: సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణ
- యాదగిరిగుట్ట: రేపు ఉదయం స్వామివారికి అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం
- యాదగిరిగుట్ట: రేపు సాయంత్రం స్వామివారికి భేరీపూజ, దేవతాహ్వానం, హవనం
- ఈ నెల 20న ఉదయం మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం
- యాదగిరిగుట్ట: ఈ నెల 20న రాత్రి 7గంటలకు శేషవాహన సేవ
- ఈ నెల 21న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంసవాహన సేవ
- ఈ నెల 22న ఉదయం శ్రీకృష్ణాలంకార సేవ, రాత్రి పొన్నవాహన సేవ
- ఈ నెల 23న ఉదయం గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహవాహన సేవ
- ఈ నెల 24న ఉదయం జగన్మోహిని అలంకార సేవ, రాత్రి అశ్వవాహన సేవ
- ఈ నెల 25న ఉదయం హనుమంత వాహన సేవ, రాత్రి గజవాహన సేవ
- యాదగిరిగుట్ట: ఈ నెల 25న రాత్రి స్వామిఅమ్మవార్ల తిరుకల్యాణోత్సవం
- ఈ నెల 26న ఉదయం గరుడవాహన సేవ, రాత్రి దివ్య విమాన రథోత్సవం
- ఈ నెల 27ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన
- ఈ నెల 28న ఉదయం స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం
- ఈ నెల 28న రాత్రి స్వామివారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు సమాప్తి
- బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆర్జిత సేవలు, నిత్య కల్యాణం, ఇతర సేవలు రద్దు
విశాఖ తీరంలో నేడు అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష-2026
- విశాఖ తీరంలో నేడు అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష-2026
- ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా ఐఎన్‌ఎస్-సుమేధ నౌకపై ప్రయాణించనున్న రాష్ట్రపతి
- విశాఖ: 71 నౌకలు ఆరు వరుసలలో పరేడ్ నిర్వహణ
- ఆరు వరుసల్లో నిలిపిన 71 యుద్ధనౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్న రాష్ట్రపతి
- ఫ్లీట్ రివ్యూలో రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు
- ఫ్లీట్ రివ్యూలో పాల్గొననున్న ఐఎన్‌ఎస్ విక్రాంత్‌తో పాటు 45 యుద్ధ నౌకలు
- ఫ్లీట్ రివ్యూలో కోస్ట్‌గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన నౌకలు
- విశాఖ: రేపు మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్
- విశాఖ: ఎల్లుండి ఐయాన్ కానైవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాలు
ప్రధాని మోదీని జీ7 సదస్సుకు ఆహ్వానించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్
- ప్రధాని మోదీని జీ7 సదస్సుకు(G7 SUMMIT) ఆహ్వానించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్
- ఈ ఏడాది 52వ జీ7 శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహిస్తోన్న ఫ్రాన్స్
- జీ7కు ముందు అజెండాపై భారత్-ఫ్రాన్స్ మధ్య సమావేశం జరగాలన్న మెక్రాన్
అమెరికా: మార్టిన్ లూథర్ కింగ్ అనుచరుడు జెస్సీ ఎల్. జాక్సన్(84) కన్నుమూత
- అమెరికా: మార్టిన్ లూథర్ కింగ్ అనుచరుడు జెస్సీ ఎల్. జాక్సన్(84) కన్నుమూత
- రెండుసార్లు దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన మానవ హక్కుల ఉద్యమ నేత జెస్సీ ఎల్. జాక్సన్
- మార్టిన్ లూథర్ కింగ్ తానే వారసుడినని ప్రకటించుకున్న జాక్సన్
- అమెరికాతోపాటు ఇతర దేశాల్లోనూ నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం కృషి
- నిరుపేదలకు విద్య, వైద్య, ఉపాధి అవకాశాల కోసం పోరాటం చేసిన జాక్సన్
- నల్ల జాతీయులకు గౌరవాన్ని, సమానత్వాన్ని సాధించడం కోసం కృషి
- జాక్సన్ సేవలకు ప్రెసి డెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అవార్డు ఇచ్చిన అమెరికా
బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్‌ను భారత్‌కు ఆహ్వానించిన ప్రధాని మోదీ
- బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్‌ను భారత్‌కు ఆహ్వానించిన ప్రధాని మోదీ
- కుటుంబంతో కలిసి భారత్‌కు రావాలని తారిఖ్ రెహమాన్‌కు మోదీ ఆహ్వానం
- ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం కోసం ఎదురుచూస్తున్నానట్లు మోదీ లేఖ
- భారత్, బంగ్లా మధ్య ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయన్న మోదీ
- ప్రమాణ స్వీకారం తర్వాత రెహమాన్‌ను కలిసి మోదీ రాసిన లేఖను ఇచ్చిన స్పీకర్
టీ20 ప్రపంచకప్‌లో నేడు 3 మ్యాచ్‌లు
- టీ20 ప్రపంచకప్‌లో నేడు 3 మ్యాచ్‌లు
- దిల్లీలో ఉదయం 11 గం.కు దక్షిణాఫ్రికా, యూఏఈ మ్యాచ్
- కొలంబోలో మధ్యాహ్నం 3 గం.కు పాకిస్థాన్, నమీబియా మ్యాచ్
- అహ్మదాబాద్‌లో రాత్రి 7 గంటలకు భారత్, నెదర్లాండ్స్ చివరి గ్రూప్ మ్యాచ్