2వ ఏప్రిల్ | నాటోపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు.. – Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు మరియు LIVE Updates | ఏపీ, తెలంగాణల్లో బ్రేకింగ్ న్యూస్


2వ ఏప్రిల్ | నాటోపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు..

2వ ఏప్రిల్ | ఇరాన్ యుద్ధానికి మద్దతు లేకపోవడంపై అసంతృప్తి
అమెరికాలో యుద్ధ వ్యతిరేక నిరసనలు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ ప్రభావం
హార్మూజ్ జలసంధి, అంతర్జాతీయ ఆర్థిక ప్రభావం
యుద్ధాన్ని ముగిస్తానన్న ట్రంప్ హెచ్చరికలు

2వ ఏప్రిల్ | ఇరాన్తో యుద్ధం సమయంలో తమ దేశానికి నాతోలోని ఒక్క దేశం కూడా మద్దతుగా ముందుకు రానందుకు నాటో నుంచి వైదొలగే అంశం పునః పరిశీలన స్థితి కూడా దాటి పోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నాతో స్థాపన, సమయం, సందర్భం అన్నీ కూడా కాలం చెల్లాయని ఆయన అభివర్ణించారు. 1949లో సోవి యట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజే షన్ (నాటో) ని కాగితం పులి అని ఆయన అభివర్ణించారు. ఇరాన్తో తమ దేశం, ఇజ్రాయెల్ కలిసిసాగిస్తున్న యుద్ధానికి మద్దతుగా నాతో దేశాలు ముందుకు రాకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నాటో దేశాలను ఆయన పిరికిపందలని కూడా అభివర్ణించారు. ఈ యుద్ధం తమది కాదనీ, తమను వివాదాల్లోకి లాగవద్దని బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్ ట్రంప్ ని ఉద్దేశించి అన్నారు. దాంతో ట్రంప్ అహం దెబ్బతింది. హార్మోజ్ జలసంధి గుండ చమురు ఎలా తెచ్చుకుంటారో తెచ్చుకోండి. మీకు మా సాయం ఉండదు అని ఆయన తెగేసి చెప్పారు. ఇరాన్తో యుద్ధాన్ని అమెరికాలో 67 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.

సొంత దేశంలో ప్రజలే వ్యతిరేకిస్తున్నప్పటికీట్రంప్ మొండిగా ఈ యుద్ధాన్ని ఇంకా కొనసాగించడం ఆయన అహంకారానికి నిదర్శనం. ప్రజల శ్రేయస్సు కన్నా, తన పట్టుదలే ముఖ్యమని ఆయన అందించారు. ఈ యుద్ధంలో ఇంత వరకూ అమెరికా సైనికులు వందలాది మంది మరణించారు. వారి కుటుంబ సభ్యులంతా ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అమెరికన్ నగరాల్లో వేలాది మంది ప్రజలు ఈ యుద్ధానికి వ్యతిరేకంగా యూఆర్ నాట్ కింగ్ అని ట్రంప్ నుద్దేశించి ఈ యుద్ధాన్ని బలవంతంగా తమ పై రుద్దుతున్నారంటూ ట్రంప్ ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ట్రంప్‌లో కించిత్ పునరాలోచన కానీ, పశ్చాత్తాపం కానీ కానరావడం లేదు. ఈ యుద్ధాన్ని బలవంతంగా తెచ్చి పెట్టారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూని ట్రంప్ నేరుగానే అన్నటువంటి సమాచారం. ఈ యుద్ధం వల్ల అమెరికా కోట్లాది డాలర్ల సంపదను, వేలాది మంది సైనికులను కోల్పోయింది.

ఈ యుద్ధం వల్ల వాటిల్లిన నష్టాలనుంచి ఇరాన్ కోలుకోవడానికి పదిపదహేనేళ్ళు పట్టవచ్చని ట్రంప్ స్వయంగా చెప్పారు. ఇరాన్ కూడా ఈ యుద్ధం నుంచి తగిన పాఠాలు నేర్చుకుంటున్నట్టు లేదు. ఇంకా ఎక్కువ పట్టుదలతో పోరాటాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకుంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ లోని బడి పిల్లలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. హార్మూజ్ జలసంధిని తెరిపించేందుకు బ్రిటన్ తన వంతు కృషి చేస్తోందని ప్రధాని కైర్మర్ అన్నారు. తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడం కూడా ముఖ్యమని కైర్మర్ స్పష్టం చేశారు. కాగా, ఇరాన్పై యుద్ధాన్ని కొద్ది రోజుల్లోనే ముగిస్తానని ప్రకటించారు ట్రంప్ అయితే, ఇందుకు తమ దేశం విధించిన షరతులను ఇరాన్ అంగీకరించి తీరాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. తమ దారికి రాకపోతే ఇరాన్ని నామరూపాలు లేకుండా చేస్తానని తెలుసు. ఈ యుద్ధంలో మరణించిన వారిలో అధిక సంఖ్యాకులు పిల్లలు ఉన్నారు దురదృష్టకరమని అన్నారు. ఇరు దేశాల నాయకులు ప్రజల ప్రయోజనాలనూ, వారి ఆస్తులను కోల్పోయినా, తమ ప్రతిష్టను నిలుపుకోవడానికే ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది.



Source link

Spread the love