LIVE FEED
ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ మంత్రుల డిమాండ్
బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా శాసనసభలో గందరగోళం నెలకొంది. పలువురు మంత్రులు, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పపువ్వు సారా అంశంపై శాసనసభలో చర్చ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. పైడి రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలను మంత్రులు సీతక్క, పొన్నం, వాకిటి శ్రీహరి తప్పుపట్టారు. రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యల పట్ల మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ మంత్రుల డిమాండ్ చేశారు. రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు.
నాచారం పీఎస్ పరిధిలో యువతి ఉరేసుకొని ఆత్మహత్య
నాచారం పీఎస్ పరిధిలో యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలే ఆత్మహత్య కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అత్తాపూర్‌లో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు అయింది. డెక్కన్ ట్రేడర్స్ గోదాములపై పోలీసుల దాడులు చేశారు. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. 70 క్వింటాళ్ల కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ప్రమాదకర రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తుంది.
అమ్రాబాద్ పునరావాస కుటుంబాలకు చెక్కుల పంపిణీ
అమ్రాబాద్ పునరావాస కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు చొప్పున భట్టి విక్రమార్క అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్, జూపల్లి పాల్గొన్నారు.
మహేశ్వర్‌రెడ్డి పంతంలో కోసం వెళ్తున్నారు : శ్రీధర్ బాబు
సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య గందరగోళం నెలకొంది. “రూల్స్ అందిరికి తెలుసు అనుకునే వ్యక్తులం మేము. మేము అహంకారంతో ముందుకెళ్లం. మన ప్రవర్తన ప్రజలు గమనిస్తున్నారు. మహేశ్వర్‌రెడ్డి పంతంలో కోసం వెళ్తున్నారు. బుల్డోజ్ చేసి సభను నడపాల్సిన అవరసంలేదు. ప్రజాస్వామికంగా ముందుకెళ్తున్నాం. ఇందిరాగాంధీ పేరు గురించి ఇలా ప్రస్తావించడం సరికాదు. రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలి. సభలో అందరూ సభ్యులు రూల్స్ పాటించాలి. తప్పులు జరిగితే వాటిని సరిచేసుకోవాలి” అని శ్రీధర్ బాబు అన్నారు.
రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదు: మహేశ్వర్‌రెడ్డి
రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని మహేశ్వర్‌రెడ్డి అన్నారు.
ఇందిరాగాంధీ ఉక్కుమహిళ ఆమె అంటే నాకు ఎంతో గౌరవం
బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ, “ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇప్పసారా తయారీ కేంద్రం ఉండాలని సూచించాను. ప్రతి పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టడం కాంగ్రెస్ వాళ్లకు అలవాటు. ఇప్పసారా పథకానికి మాత్రం ఆ పేరు పెట్టవద్దని సూచించాను. నేను చేసిన సూచనలో ఎలాంటి తప్పు లేదు. ఇందిరాగాంధీ ఉక్కుమహిళ ఆమె అంటే నాకు ఎంతో గౌరవం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ నేత మాత్రమే కాదు. భారత మాజీ ప్రధాని. ఇందిరాగాంధీపై గౌరవంతోనే ఆ పేరు పెట్టవద్దని చెప్పాను.” అని వివరించారు.
మహిళా సమాజాన్ని అవమానించినట్లే : పొన్నం ప్రభాకర్
ఇందిరమ్మను అవమానించడం అంటే మహిళా సమాజాన్ని అవమానించినట్లేనని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందిరమ్మను ఉక్కు మహిళ, దుర్గామాతా అని గతంలో వాజ్‌పేయీ అన్నారని గుర్తు చేశారు.
బీజేపీ నేతలు ఇందిరమ్మ మీద ఇంకా అక్కసు ప్రదర్శిస్తున్నారు : మంత్రి సీతక్క
సంక్షేమ పథకాలకు గొప్పవారి పేర్లు పెడతారని, అందుకే ఇందిరమ్మ పేర్లు పథకాలకు పెట్టామని మంత్రి సీతక్క తెలిపారు. బీజేపీ నేతలు ఇందిరమ్మ మీద ఇంకా అక్కసు ప్రదర్శిస్తున్నారని వివర్శిస్తున్నారు.
ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ మంత్రుల డిమాండ్
బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా శాసనసభలో గందరగోళం నెలకొంది. పలువురు మంత్రులు, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పపువ్వు సారా అంశంపై శాసనసభలో చర్చ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. పైడి రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలను మంత్రులు సీతక్క, పొన్నం, వాకిటి శ్రీహరి తప్పుపట్టారు. రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యల పట్ల మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ మంత్రుల డిమాండ్ చేశారు. రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు.
పుట్టింట్లో ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పుట్టింట్లో వివాహిత మమత(25) అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు వరకట్న వేధింపులే కారణమని మమత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మమత మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు.
మెదక్: చిన్నశంకరంపేట మండలం జంగారాయిలో దొంగల హల్‌చల్
- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగారాయిలో దొంగలు హల్‌చల్ చేశారు. వృద్ధ దంపతులపై దాడి చేసి బంగారం దోచుకెళ్లారు. వృద్ధురాలి వద్ద 6 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. దొంగల దాడిలో గాయపడిన వృద్ధ దంపతులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్‌లో పలు భారత వర్సిటీలు
- క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్‌లో పలు భారత వర్సిటీలకు చోటు దక్కింది. వివిధ విభాగాల్లో టాప్-50లో ఆరు యూనివర్సిటీలు చేరాయి. ఇందులో నాలుగు ఐఐటీలు, జేఎన్‌యూ, బిట్స్ పిలానీ ఉన్నాయి. మార్కెటింగ్, బిజినెస్&మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఐఐఎం అహ్మదాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌కు(ధన్‌బాద్) మైనింగ్ ఇంజినీరింగ్‌లో 21వ ర్యాంక్ లభించింది.
ఉడాన్ పథకానికి రూ.28,840 కోట్లు – కేంద్రమంత్రివర్గం నిర్ణయం
- కేంద్రమంత్రివర్గం సమావేశంలో కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. సవరించిన ఉడాన్ పథకానికి రూ.28,840 కోట్లు కేటాయించాలని సమావేశం నిర్ణయించింది. వీటితో పాటు ఇమిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్, ట్రాకింగ్ స్కీమ్‌ను మరో ఐదేళ్లు పొడిగించేందుకు కూడా ఆమోదం తెలిపింది.
మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తే రేవంత్‌రెడ్డికి నష్టమేంటి?: బండి సంజయ్
- మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తే రేవంత్‌రెడ్డికి నష్టమేంటని ప్రశ్నించారు కేంద్రమంత్రి బండి సంజయ్. ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం సీట్లను పెంచింతే దక్షిణాదికి ఏం నష్టం జరుగుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రాంతీయ అసమానతల పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారని మంత్రి మండిపడ్డారు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. ఇలా ఉత్తర, దక్షిణాల పేరుతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. దేశభక్తి, జాతీయవాదం మీలో మచ్చుకైనా కన్పించవా అని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన
- హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షం పడుతోంది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఎల్బీనగర్ వరకు పలు ప్రాంతాల్లో వాన జోరుగా కురుస్తోంది. వర్షానికి తోడు వడగళ్లు కూడా పడుతున్నాయి. సాహెబ్‌నగర్, గాయత్రినగర్, బ్యాంక్ కాలనీలో వడగళ్ల వానతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారి పైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
శ్రీరామనవమి రోజున పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయనున్న కవిత
- శ్రీరామనవమి రోజున కవిత కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఆరోజు పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. పండుగ రోజున నిజామాబాద్‌లోని ఖిల్లా రామాలయంలో జరిగే నవమి సంబురాల్లో కవిత పాల్గొననున్నారు. ఈ వేడుకల్లోనే కీలక ప్రకటన చేస్తారని సమాచారం. కవిత పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని తెలుస్తోంది. ఈ పేరుతో ఆమె జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే పేరు నమోదులో ఆలస్యం జరుగుతోందని తరువాత దిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు.
క్యాన్లు, డబ్బాల్లో ఇంధనం నింపుకుంటే చర్యలు తీసుకుంటాం: ఉత్తమ్
- తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చే మూడు నెలలకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు డిమాండ్ 17,246 కిలోలీటర్లు కాగా, 17,898 కిలోలీటర్లు సరఫరా చేయడం జరిగిందని వివరించారు. ప్యానిక్ కారణంగా డిమాండ్ 25 శాతం పెరిగినప్పటికీ, సరఫరా సగటుకు మించి 22 శాతం అధికంగా కొనసాగుతోందని భరోసా ఇచ్చారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో “నో స్టాక్” బోర్డులు కనిపించడం ట్యాంకర్లు ఇంకా చేరుకోనందువల్లేనని, నిజమైన కొరత కాదన్నారు. క్యాన్లు, కంటెయినర్లలో పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని, అలా చేసినవారిపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ హెచ్చరించారు. హైదరాబాద్ పరిధిలో 596 పెట్రోల్ బంకులు పూర్తిగా నిర్వహిస్తున్నాయని, ఏ బంకునూ మూసివేయడానికి అనుమతించబోమని ఉత్తమ్ స్పష్టం చేశారు. అలాగే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లు పుష్కలంగా ఉన్నాయని, కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్రంతో మాట్లాడుతున్నా ఉత్తమ్ ప్రకటించారు.
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే పుకార్లు నమ్మెుద్దు: సీపీ సజ్జనార్
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే పుకార్లు నమ్మెుద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్(HYD CP Sajjanar) విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 60 రోజులకు సరిపడా పెట్రోలు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరు కూడా అపోహలు నమ్మవద్దని కోరారు. పెట్రోల్, డీజిల్ దొరకడం లేదని సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించే వారిపై నిఘా పెట్టామని, అలాంటి వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఉన్న 186 బంకుల వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నామని నగర ప్రజలు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని, ముందుజాగ్రత్త పేరులో ఎక్కువ కొనుగోలు చేయవద్దని సీపీ విజ్ఞప్తి చేశారు.
ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయశర్మ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పాపారావు
- మావోయిస్టు అగ్రనేత, దండకారణ్య జోనల్ కమిటీ కమాండర్‌గా ఉన్న పాపారావు(Paparao Surrender) లొంగిపోయారు. ఇవాళ ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయశర్మ ఎదుట పాపారావు తన ఆయుధాన్ని అప్పగించారు. ఆయనతో పాటు 17 మంది అనుచరులు కూడా డిప్యూటీ సీఎం ఎదుట లొంగిపోయారు. దండకారణ్య ప్రాంతానికి చెందిన మోస్ట్ వాంటెడ్ పాపారావుపై రూ.2 కోట్ల రివార్డు ఉంది. దండకారణ్యంలో హిడ్మా తరువాత మోస్ట్ వాంటెండ్ మావోయిస్టు పాపారావు. దండకారణ్యంలో మావోయిస్టు సంస్థ విస్తరణలో పాపారావు కీలకపాత్ర షోపించారు. ఆపరేషన్ ఖగార్ గడువు దగ్గరపడుతున్న వేళ పాపారావు లొంగుపాటు భద్రతా దళాలకు కొత్త విజయంగా భావించవచ్చు.
సికింద్రాబాద్: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కుమార్తె
- సికింద్రాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారానికి అడ్డుపడిందని తల్లిని ప్రియుడి సహాయంతో కుమార్తె హత్య చేసింది. ఈ ఘటన నగరంలోని జవహర్‌నగర్ పరిధి కౌకూర్ భరత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పది నెలల క్రితం అంజు అనే మహిళ అదృశ్యం అయింది. దీనిపై జవహర్‌నగర్ పీఎస్‌లో పెద్ద కుమార్తె ఫిర్యాదు చేసింది. కుటుంబసభ్యుల ఫోన్‌కాల్స్‌ను పోలీసులు విశ్లేషించడంతో పాటు స్థానికులను విచారించారు. ఈ క్రమంలో తల్లిని హత్య చేసినట్లు చిన్న కుమార్తె ఇషిక అంగీకరించింది. ప్రియుడు మౌంటీరాజ్‌తో కలిసి ఈ హత్య చేసినట్లు వెల్లడించింది. ప్రేమ వ్యవహారానికి అడ్డుపడిందని, అలాగే ప్రియుడితో సహజీవనంపై తల్లి మందలించడంతో తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు చెప్పింది. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్ పరిధిలో మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీ: ఆర్టీసీ ఎండీ
- ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా, నగర వాహనదారులకు ఊరటనిచ్చేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC Offer) కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సుఖవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటించారు. “పెట్రోల్ ఇబ్బందులు పడటం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా..! తమ బస్సుల్లో ప్రయత్నించండి” అని ఎండీ నాగిరెడ్డి ప్రజలకు సూచించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రయోజనాలను ఆయన వివరించారు. సమయం, ఇంధనం ఆదా, క్యూ లైన్లకు స్వస్తి చెప్పండి అని పేర్కొన్నారు. పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఎండీ నాగిరెడ్డి సూచించారు. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులే మేలని పేర్కొన్నారు.
కామారెడ్డి: నాగిరెడ్డిపేట్ మండలం అక్కంపల్లిలో ఉద్రిక్తత
- కామారెడ్డి: నాగిరెడ్డిపేట్ మండలం అక్కంపల్లిలో ఉద్రిక్తత
- అక్కంపల్లి, కిచెన్నపేట్ గ్రామస్థుల మధ్య భూవివాదం
- సరిహద్దులోని స్థలం తమదేనంటూ ఇరు గ్రామస్థుల వాదన
- అక్కంపల్లి పంచాయతీ భవన స్థల సేకరణలో తలెత్తిన ఘర్షణ
- కామారెడ్డి: ఘర్షణలో పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
- ఘటనాస్థలానికి చేరుకుని ఇరు గ్రామాల ప్రజలను చెదరగొట్టిన పోలీసులు
వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్పు బిల్లుకు ఆమోదం
- వైద్య విధాన పరిషత్ బిల్లును ఆమోదించిన శాసనసభ
- వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్పు బిల్లుకు ఆమోదం
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ పంపిన జీవన్‌రెడ్డి
- కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్‌రెడ్డి
- ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ పంపిన జీవన్‌రెడ్డి
- 42 ఏళ్ల కాంగ్రెస్ బంధానికి గుడ్ బై చెప్పిన జీవన్‌రెడ్డి
- జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో రాజీనామా చేసిన జీవన్‌రెడ్డి
- నాకు అండగా ప్రభుత్వం లేదు.. పార్టీ లేదు: జీవన్‌రెడ్డి
- మహేశ్‌కుమార్‌గౌడ్ ఇచ్చిన హామీ ఏమైంది?: జీవన్‌రెడ్డి
- నాకు పోరాటం కొత్త కాదు.. రేవంత్‌పైనా పోరాటం చేస్తా: జీవన్‌రెడ్డి
- కాంగ్రెస్ పార్టీ తనదని సీఎం అనుకుంటున్నారు: జీవన్‌రెడ్డి
- రెండేళ్లు అవమానంతోనే గడిచింది.. ఆత్మగౌరవ పోరాటం చేద్దాం: జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో లేఖ విడుదల చేసిన జీవన్‌రెడ్డి
- కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి రాజీనామా
- కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో లేఖ విడుదల చేసిన జీవన్‌రెడ్డి
నా కార్యకర్తల హక్కులను కాపాడలేకపోతున్నా : జీవన్‌రెడ్డి
- ప్రభుత్వంలో కొనసాగాలని కోరుతుంటే ఎలా కొనసాగాలి : జీవన్‌రెడ్డి
- నా కార్యకర్తల హక్కులను కాపాడలేకపోతున్నా : జీవన్‌రెడ్డి
- కాంగ్రెస్ కార్యకర్త బలైతే సంయమనం పాటించమంటారా? : జీవన్‌రెడ్డి
నాకు తోడుగా నిలిచిన నాయకుడిని నడిబజారులో కిరాతకంగా చంపారు : జీవన్‌రెడ్డి
- నాకు తోడుగా నిలిచిన నాయకుడిని నడిబజారులో కిరాతకంగా చంపారు
- కాంగ్రెస్ కార్యకర్తకు దారుణ ఘటన జరిగితే స్పందించకూడదా?
- నాకు తోడుగా నిలిచిన నాయకుడు చనిపోతే సీఎం నుంచి కనీస పరామర్శ లేదు
- కాంగ్రెస్ కార్యకర్త దారుణంగా చనిపోతే కుటుంబానికి కనీస ఓదార్పు లేదు
- బాధిత కుటుంబాన్ని ఆదుకుందామనే భరోసా కల్పించలేదు
- నేను శాసనమండలి సభ్యుడిని.. రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది
నిర్మల్: సారంగపూర్ మం. చించోలి (బి) వద్ద తప్పిన ప్రమాదం
- నిర్మల్: సారంగపూర్ మం. చించోలి (బి) వద్ద తప్పిన ప్రమాదం
- ఆర్టీసీ బస్సులో నుంచి పొగలు గమనించి పక్కకు ఆపిన డ్రైవర్
- నిర్మల్: బస్సులో ఉన్న 35 మందిని కిందకు దించిన డ్రైవర్
- మరో బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపిన డ్రైవర్
- నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ప్రమాదం
పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదు: కేంద్రమంత్రి బండి సంజయ్
- పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదు: కేంద్రమంత్రి బండి సంజయ్
- సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు: బండి సంజయ్
- ఆయిల్ సంస్థల వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయి: బండి సంజయ్
- ఆయిల్ సరఫరాలోనూ ఇబ్బందుల్లేవు: బండి సంజయ్
- పెట్రోల్, డీజిల్ సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది: బండి సంజయ్
- ఆయిల్ నిల్వలపై కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది: బండి సంజయ్
- అవసరానికి మించి కొనుగోళ్లతో కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం: బండి సంజయ్
హైదరాబాద్: వాణిజ్య సిలిండర్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
- హైదరాబాద్: వాణిజ్య సిలిండర్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
- మాదాపూర్ విఠల్‌రావు నగర్‌లో అక్రమంగా వాణిజ్య సిలిండర్ల విక్రయం
- వాణిజ్య సిలిండర్లను బ్లాక్‌లో రూ.6 వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తింపు
- నిందితుడి వద్ద 31 సిలిండర్లు గుర్తించిన శేరిలింగంపల్లి ఎస్‌వోటీ పోలీసులు
- అంబర్‌పేట నుంచి సిలిండర్లు తెచ్చి మాదాపూర్‌లో విక్రయిస్తున్న గణేశ్
- కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘం నాయకుల అరెస్టు
- అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘం నాయకుల అరెస్టు
- ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
- ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకుల అరెస్టు, పీఎస్‌కు తరలింపు
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ట్రైబ్యునల్ నిర్ణయంపై విచారణ
- పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ట్రైబ్యునల్ నిర్ణయంపై విచారణ
- బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం
- ప్రకాశ్‌గౌడ్, తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్యపై పిటిషన్లు వేసిన బీఆర్‌ఎస్
- అరికెపూడి గాంధీ, కృష్ణమోహన్‌రెడ్డి, దానం, శ్రీనివాస్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ పిటిషన్లు
- స్పీకర్ ట్రైబ్యునల్ ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్లు దాఖలు
- పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లు
హైదరాబాద్: ఎర్రమంజిల్‌లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనాల బారులు
- హైదరాబాద్: ఎర్రమంజిల్‌లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనాల బారులు
- అమీర్‌పేట నుంచి ఎర్రమంజిల్ వరకు నిలిచిపోయిన రాకపోకలు
- రహదారి పక్కన భారీగా క్యూలైన్‌లో నిలిచిన ఆటోలు, కార్లు, బైకులు
- పంజాగుట్ట వైపు 2 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం భేటీ
- సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం భేటీ
- ఆర్టీసీకి సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చ
- హైదరాబాద్: సాయంత్రం 4 గం.కు అసెంబ్లీ కమిటీ హాలులో భేటీ
- ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి పొన్నం ముఖాముఖి
- ఆర్టీసీ సమస్యలను లిఖితపూర్వకంగా తీసుకురావాలని కోరిన పొన్నం
మజ్లిస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు
- మజ్లిస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నేతృత్వంలో లోక్‌భవన్ వెళ్లిన బీజేపీ నేతలు
- అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత వందేమాతరం గీతాలాపన బహిష్కరించారని ఫిర్యాదు
వికారాబాద్: పరిగి మం. లక్ష్మీదేవిపల్లిలోని స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు
- వికారాబాద్: పరిగి మం. లక్ష్మీదేవిపల్లిలోని స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు
- స్టీల్ పరిశ్రమలోని బట్టీ పేలడంతో పెద్దఎత్తున ఎగసిపడిన మంటలు
- బట్టీ పేలుడు ముందే గుర్తించి పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన కార్మికులు
- పేలుడు సమయంలో స్టీల్ పరిశ్రమలో 15 మంది కార్మికులు
- స్టీల్ పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దట్టంగా అలముకున్న పొగ
తన సూచనలను మంత్రి పొంగులేటి పట్టించుకోలేదన్న స్పీకర్ ప్రసాద్‌కుమార్
- శాసనసభ: మంత్రి పొంగులేటికి స్పీకర్ ప్రసాద్ కుమార్ సూచన
- రెండు పడక గదుల ఇళ్ల పురోగతిపై సమీక్షించాలని గతంలోనే సూచించానన్న స్పీకర్
- తన సూచనలను మంత్రి పొంగులేటి పట్టించుకోలేదన్న స్పీకర్ ప్రసాద్‌కుమార్
- తన సూచనలు పాటించి సమీక్షించి ఉంటే ఇన్ని ప్రశ్నలు వచ్చేవి కావన్న స్పీకర్
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్
- ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్
- సిరిసిల్ల నేతన్నల కష్టాలపై వినతిపత్రం అందించిన కేటీఆర్
- రూ.38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలని కోరిన కేటీఆర్
- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్, సర్‌ఛార్జ్ మాఫీ చేయాలని కోరిన కేటీఆర్
- పరిశ్రమకు నిరంతర విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలన్న కేటీఆర్
- పాత బకాయిలతో సంబంధం లేకుండా పరిశ్రమకు లబ్ధి చేకూరేలా చూడాలన్న కేటీఆర్
- కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా ఆర్థిక వెసులుబాటు కల్పించాలన్న కేటీఆర్
హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై బంకుల్లో వాహనాల బారులు
- జంట నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ
- పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ కోసం బారులు తీరిన వాహనాలు
- హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై బంకుల్లో వాహనాల బారులు
- జాతీయరహదారిపై పెట్రోల్ బంకులు ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం
- పలు ప్రాంతాల్లో నెమ్మదిగా కదులుతున్న వాహనాలు
ఇవాళ పార్లమెంటు ముందుకు ఎఫ్‌సీఆర్‌ఏ చట్ట సవరణ బిల్లు
- ఇవాళ పార్లమెంటు ముందుకు ఎఫ్‌సీఆర్‌ఏ చట్ట సవరణ బిల్లు
- లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు – 1400 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్
- భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు
- 1400 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్
- 450 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ
ఇంధన కొరత లేదని ప్రకటించిన తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్
- ఇంధన కొరత లేదని ప్రకటించిన తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్
- హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, పీబీసీఎల్ వద్ద తగినంత స్టాక్ ఉందని ప్రకటన
- ఇంధన కొరత ఉందన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచన
- ఇంధనం దొరకదనే భయంతో బంకుల క్యూ కడుతున్నారన్న అసోసియేషన్
- ముందస్తు కొనుగోళ్లతో ఇబ్బంది ఏర్పడుతోందన్న అసోసియేషన్
ఆరో రోజు శాసనసభ బడ్జెట్ సమావేశాలు
- ఆరో రోజు శాసనసభ బడ్జెట్ సమావేశాలు
- శాసనసభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
- ప్రశ్నోత్తరాల తర్వాత శాసనసభలో 2 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సవరణ బిల్లును సభలో పెట్టనున్న సీఎం
- వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లు ఆమోదం కోసం ప్రతిపాదించనున్న దామోదర
- బడ్జెట్‌లో పద్దులపై ఓటింగ్ ఆఫ్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్‌పై చర్చ ప్రారంభించనున్న సీఎం
రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై నేడు కీలక భేటీ
- రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై నేడు కీలక భేటీ
- అసెంబ్లీ కమిటీ హాల్‌లో మ.2 గం.కు అధికారులతో సీఎం సమీక్ష
- ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
- పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై చర్చ
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని ప్రకటించిన హిందూస్థాన్ పెట్రోలియం
- పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని ప్రకటించిన హిందూస్థాన్ పెట్రోలియం
- భయాందోళనలతో ఫిల్లింగ్ స్టేషన్లకు వెళ్లవద్దని హెచ్‌పీసీఎల్ విజ్ఞప్తి
- సాధారణ అవసరాలకు అనుగుణంగా ఇంధనం నింపుకోవాలని హెచ్‌పీసీఎల్ విజ్ఞప్తి
- ఇంధన సరఫరా సక్రమంగా ఉంచేందుకు హెచ్‌పీసీఎల్ కట్టుబడి ఉందని వెల్లడి
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
- లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
- 800 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్
- 200 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదు: పౌరసరఫరాలశాఖ
- రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదు: పౌరసరఫరాలశాఖ
- ప్రజలు భయాందోళనలకు గురికావొద్దు: పౌరసరఫరాలశాఖ
- రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోంది: పౌరసరఫరాలశాఖ
- ప్రజావసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి: పౌరసరఫరాలశాఖ
- వదంతుల వల్లే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లు పెరిగాయి: పౌరసరఫరాలశాఖ
- వదంతుల వల్ల ప్రజలు భయపడి అకస్మాత్తుగా కొనుగోలు చేస్తున్నారు: పౌరసరఫరాలశాఖ
ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనాల బారులు
- ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనాల బారులు
- ఉదయం నుంచే పెద్దఎత్తున పెట్రోల్ బంకులకు పోటెత్తిన వాహనదారులు
- మెదక్: ఇప్పటికే పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
- యుద్ధం వల్ల పెట్రోల్ దొరకట్లేదనే వదంతులతో బంకుల వద్ద బారులు
- మెదక్: గంటల తరబడి క్యూలైన్‌లో వేచి చూస్తున్న వాహనదారులు
శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానం
- శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానం
- బీజేపీ కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారని వాయిదా తీర్మానం
- ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారన్న బీజేపీ సభ్యులు
విజయవాడ: ఉగ్ర లింకుల కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- విజయవాడ: ఉగ్ర లింకుల కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- హైదరాబాద్ చంచల్‌గూడలోని సయీదా బేగం నివాసంలో సోదాలు
- సయీదా బేగం ఇంట్లో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల సోదాలు
- సోదాల అనంతరం సయీదా బేగంకు 41ఏ నోటీసులు ఇచ్చిన పోలీసులు
- నోటీసులు ఇచ్చి సయీదా బేగంను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సయీదా బేగంను విజయవాడకు తరలించనున్నట్లు సమాచారం
- సయీదా బేగం మహారాష్ట్ర షోలాపూర్ వాసిగా గుర్తించిన పోలీసులు
- కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సయీదా బేగం
- గతంలోనూ తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు సయీదాపై నిఘా ఉంచినట్లు సమాచారం
- విజయవాడలో అరెస్టయిన వారితో సంబంధాల దృష్ట్యా సయీదా బేగం ఇంట్లో సోదాలు
పెట్రోల్, గ్యాస్, యూరియా అందుబాటు భయాందోళనలపై శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
- శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
- పెట్రోల్, గ్యాస్, యూరియా అందుబాటు భయాందోళనలపై వాయిదా తీర్మానం
- ప్రజల్లో భయాందోళనలపై కార్యాచరణ ప్రకటించాలని వాయిదా తీర్మానం
హైదరాబాద్: పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాల బారులు
- హైదరాబాద్: పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాల బారులు
- కూకట్‌పల్లి, ప్రగతినగర్‌లో పలు పెట్రోల్ బంకుల వద్ద బారులు
- సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్‌లోని బంకుల వద్ద బారులు
- లక్డీకాపూల్, అబిడ్స్, ఎర్రగడ్డలోని పెట్రోల్ బంకుల వద్ద రద్దీ
- సనత్‌నగర్, అమీర్‌పేటలోని బంకుల వద్ద క్యూకట్టిన వాహనదారులు
- బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న వాహనదారులు
- హైదరాబాద్: కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు
- పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు నమ్మవద్దని అధికారుల విజ్ఞప్తి
- యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే వదంతులతో బారులు
డ్రగ్స్, కాల్పుల కేసులో రెండో రోజు సిట్ విచారణ
- డ్రగ్స్, కాల్పుల కేసులో రెండో రోజు సిట్ విచారణ
- ముగ్గురు నిందితులను కస్టడీలో విచారించనున్న సిట్
- పైలట్ రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్ శర్మను ప్రశ్నించనున్న సిట్
- కాల్‌డేటా, వాట్సప్ చాటింగ్ ఆధారంగా శంషాబాద్ పీఎస్‌లో విచారణ
- డబ్బు బదిలీ, బ్యాంకు లావాదేవీల ఆధారంగా శంషాబాద్ పీఎస్‌లో విచారణ
తిరుమలలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 15 గంటలు
- తిరుమలలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 15 గంటలు
- శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,381 మంది భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు
- నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 25,451 మంది భక్తులు
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల కుమార్తె పెళ్లికి హాజరుకానున్న సీఎం
- నేడు గుంటూరు వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల కుమార్తె పెళ్లికి హాజరుకానున్న సీఎం
- ఉ.9.30కు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్న సీఎం
- మ.1.30 నుంచి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి
యుద్ధం ముగింపునకు ఇరాన్‌కు 15 షరతులు విధించిన అమెరికా
- యుద్ధం ముగింపునకు ఇరాన్‌కు 15 షరతులు విధించిన అమెరికా
- మధ్యప్రాచ్యానికి 3 వేల మంది సైనికులను తరలిస్తున్న అమెరికా
- ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగిస్తామని వెల్లడించిన అమెరికా
- ఇరాన్‌తో దౌత్య చర్చలు కొనసాగుతున్నాయని పునరుద్ఘాటించిన అమెరికా
- అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేకూడదన్న అమెరికా
- తమ ప్రధాన డిమాండ్‌కు టెహ్రాన్ అంగీకరించిందని పేర్కొన్న ట్రంప్
ఆరోరోజు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు
- నేడు ఆరోరోజు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు
- ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం
- ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశం
- సభలో తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి దామోదర
పశ్చిమాసియా సంక్షోభంపై నేడు అన్ని పార్టీలతో చర్చించనున్న కేంద్రం
- పశ్చిమాసియా సంక్షోభంపై నేడు అన్ని పార్టీలతో చర్చించనున్న కేంద్రం
- దిల్లీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత అఖిలపక్ష భేటీ
- ఇవాళ సాయంత్రం 5గంటలకు దిల్లీలో అఖిలపక్ష సమావేశం
- సమావేశంలో పాల్గొననున్న విదేశాంగమంత్రి జైశంకర్
- సమావేశానికి హాజరుకాబోనని తెలిపిన రాహుల్ గాంధీ కేరళలో ముందుగానే నిర్ణయించిన కార్యక్రమం ఉన్నందున భేటికి రాలేనన్న రాహుల్‌గాంధీ
నేడు కాంగ్రెస్ పార్టీని వీడనున్న ఆ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డి
- నేడు కాంగ్రెస్ పార్టీని వీడనున్న ఆ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డి
- నేడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న జీవన్‌రెడ్డి
- ఇవాళ జగిత్యాల బండారి గార్డెన్‌లో కార్యకర్తలతో జీవన్‌రెడ్డి సమావేశం
- అధిష్ఠానం పెద్దలు బుజ్జగించినా.. నా నిర్ణయంలో మార్పు లేదన్న జీవన్‌రెడ్డి
- కాంగ్రెస్‌తో ఉన్న 42 ఏళ్ల బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్న జీవన్‌రెడ్డి
- కాంగ్రెస్ పార్టీని వీడాక బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం
- జీవన్‌రెడ్డితో కేటీఆర్ ఇప్పటికే సమావేశమైనట్లు సమాచారం
- జీవన్‌రెడ్డికి పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట
- ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట
- పవన్ సినిమాల్లో నటించకూడదని మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ పిటిషన్ దాఖలు
- విజయ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
- సినిమా కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్
- టికెట్ ధర పెంపు విషయంలో నిబంధనలు పాటించలేదన్న పిటిషనర్ తరఫు న్యాయవాది
- సినిమాల్లో నటించడం, ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించడం పరస్పర విరుద్ధమన్న న్యాయవాది
- మంత్రుల పదవుల్లో ఉన్నవారు సినిమాల్లో నటించడంపై నిషేధం లేదన్న ఏజీ
- సీనియర్ ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పుఇచ్చింది: ఏజీ
- టికెట్ ధరలు పెంచే విషయంలో పవన్‌కు సంబంధం లేదన్న ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్
- వాదనల తర్వాత ఇటీవల తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి
- తాజాగా విజయ్‌కుమార్ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి అస్వస్థత
- కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి అస్వస్థత
- అస్వస్థతతో సోనియా గాంధీకి దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
- ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలన్న రేవంత్‌రెడ్డి
- దిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి
- హైదరాబాద్ వచ్చే ముందు ఎంపీ అభిషేక్ సింఘ్వీ ఇంట్లో విందుకు హాజరైన సీఎం
- అభిషేక్ సింఘ్వీ ఇంట్లో మీడియా ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి ఇష్టాగోష్టి
- సీట్ల పెంపుతో ఉత్తరాదిన సీట్లు పెరిగి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: సీఎం
- దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఏర్పడే అవకాశం: సీఎం
- ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన సమస్య కాదు: సీఎం రేవంత్‌రెడ్డి
- దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన అంశం: సీఎం రేవంత్‌రెడ్డి
- ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యత తగ్గింది: సీఎం రేవంత్‌రెడ్డి
- ఉత్తరాదిన సీట్ల పెంపుతో దక్షిణాదికి మరింత నష్టం జరిగే అవకాశం ఉంది: సీఎం
- డీలిమిటేషన్‌తో దక్షిణాదిపై కుట్ర జరుగుతోందన్న సీఎం రేవంత్‌రెడ్డి
- 4 ఉత్తరాది రాష్ట్రాలతోనే కేంద్రంలో అధికారంలోకి రావొచ్చన్న సీఎం
- దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలన్న రేవంత్‌రెడ్డి