Jan 27, 2026 20:44 IST
టీడీపీ పార్లమెంట్ కమిటీ వర్క్‌షాప్‌లో పాల్గొన్న చంద్రబాబు
టీడీపీని మరింత బలోపేతం చేయాలి: సీఎం చంద్రబాబు
టీడీపీలో యువరక్తానికి ప్రాధాన్యం ఇచ్చాం: చంద్రబాబు
దేశంలోనే యంగ్ పార్లమెంట్‌గా టీడీపీ ఉంది: చంద్రబాబు
2024 సార్వత్రిక ఎన్నికల్లో 80% మంది కొత్తవారికి, విద్యావంతులకు ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశం: చంద్రబాబు
సమర్థులకు పెద్దపీట.. అన్ని వర్గాలకు సముచిత స్థానం: సీఎం
పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలను పార్టీ అధ్యక్షులు, సెక్రటరీలు సమన్వయం చేసుకోవాలి: చంద్రబాబు
Jan 27, 2026 20:38 IST
హైదరాబాద్: కూకట్‌పల్లిలో డ్రగ్స్ దందా
డ్రగ్స్ సరఫరా చేస్తున్న విద్యార్థి శ్రీవాత్సవ్ అరెస్ట్.
MDMA డ్రగ్స్, ఓజీ కుష్ గంజాయి విద్యార్థులకు సరఫరా.
36.54 గ్రాముల MDMA, 6.46 ఓజీ కుష్ డ్రగ్స్ స్వాధీనం.
Jan 27, 2026 20:37 IST
ప్రజలకు మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎస్‌కు సూచన
సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని వారి కృపకు పాత్రులు కావాలి: సీఎం
అమ్మవార్ల దర్శనం అనంతరం అందరూ క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలి: సీఎం
Jan 27, 2026 19:27 IST
కృష్ణా: వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదు
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు.
పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పీఎస్‌లో BNS 196(1), 353(2), 351(2), 352 సెక్షన్ల కింద కేసు నమోదు.
ఏలూరు జిల్లా చాట్రాయిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు.
Jan 27, 2026 18:14 IST
బంగ్లాదేశ్ భాగర్ హాట్ జైల్ నుంచి విడుదలైన 23 మంది భారతీయ మత్స్యకారులు.
ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 మంది మత్స్యకారులు.
బంగ్లాదేశ్ డిప్యూటీ సెక్రటరీ, భారత ప్రభుత్వం తరఫున డిప్యూటీ హై కమిషన్ శ్రీ చంద్రజీత్ సమక్షంలో విడుదల.
ఏపీ నుండి ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ హాజరు.
మోంగ్లా పోర్టులో పోలీస్ కస్టడీలో ఉన్న బోట్లు తీసుకొని ఇండియాకు రానున్న మత్స్యకారులు.
బందీగా ఉన్న మత్స్యకారుల కోసం గతంలోనే కేంద్రస్థాయిలో చర్చలు జరిపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.
Jan 27, 2026 17:51 IST
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ముగిసిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల భేటీ
ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చ.
బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసింది: షర్మిల
ఉపాధిహామీ స్కీమ్ పునరుద్ధరణకు ఏపీలో భారీ ఉద్యమం: షర్మిల
ఉద్యమంలో పాల్గొనాలని రాహుల్ గాంధీని ఏపీకి ఆహ్వానించాం: షర్మిల
Jan 27, 2026 17:43 IST
డిప్యూటీ సీఎం భట్టితో భేటీపై మంత్రి శ్రీధర్‌బాబు వివరణ
బహిరంగంగా వెళ్తే అది రహస్యం ఎలా అవుతుంది?
కేబినెట్ ఒక యూనిట్.. పాలన సమన్వయం మా బాధ్యత.
భట్టి నివాసంలో పాలనాపరమైన చర్చలే జరిగాయి.
మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించాం.
రాజకీయ లబ్ధి కోసమే కొందరు తప్పుడు ప్రచారం.
Jan 27, 2026 16:55 IST
తెలంగాణ గవర్నర్ జిష్టుదేవ్ వర్మతో బీఆర్ఎస్ నేతల సమావేశం.
సింగరేణి టెండర్లలో భారీ స్కామ్ జరిగిందని ఫిర్యాదు.
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులపై ఫిర్యాదు.
స్కామ్‌కి సంబంధించి నివేదికను గవర్నర్‌కు అందజేసిన బీఆర్ఎస్ నేతలు.
సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి.
Jan 27, 2026 15:54 IST
మున్సిపల్ ఎన్నికల ముఖ్య తేదీలు..
జనవరి 28 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
జనవరి 30 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.
జనవరి 31న నామినేషన్లు పరిశీలిస్తారు.
ఫిబ్రవరి 3 వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు.
ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహణ.
ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక చేపడతారు.
ఫిబ్రవరి 16వ తేదీన కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 52,43,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Jan 27, 2026 15:41 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
320 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్.
127 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ.
Jan 27, 2026 15:02 IST
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అయ్యప్ప స్వామి దేవాలయంలో కనిపించకుండా పోయిన విగ్రహం.
ఈ విగ్రహం చాలా ఖరీదైనదని చెబుతున్న అధికారులు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.
విగ్రహం కనిపించకుండా పోయినా పోలీసులకు ఫిర్యాదు చేయని ఆలయ కమిటీ.
విగ్రహం కనిపించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు.
Jan 27, 2026 14:46 IST
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కల్యాణ్ కుమారుడు అకీరానందన్
AI ద్వారా తన వ్యక్తిత్వం, గోప్యత హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ పిటిషన్.
AI సినిమాతో పాటు యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్బుక్, ఎక్స్‌లో నకిలీ ప్రొఫైల్ పేజీలను తొలిగించాలని కోరుతూ అకీరానందన్ పిటిషన్.
ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు.
ఏఐ సినిమాపై నిషేధం.
Jan 27, 2026 14:38 IST
అధిక ఫీజులతో కార్పొరేట్ స్కూల్స్ దోచుకుంటున్నాయి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సరైన విద్య అందితేనే పేదల సమస్యలు తీరుతాయి.
నేను విద్యాశాఖ మంత్రి అయితే కార్పొరేట్ స్కూల్స్ మూసివేయిస్తా.
ఉత్సాహం ఉంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. లేకుంటే స్కూల్లో విద్యార్థులను చదివిస్తా.
కేంద్రం నుంచి నిధులు తెచ్చి నల్లగొండ రూపురేఖలు మారుస్తా.
Jan 27, 2026 14:36 IST
హైదరాబాద్: నందినగర్ నివాసంలో కేటీఆర్‌తో సంతోష్‌రావు భేటీ
కాసేపట్లో సిట్ విచారణకు హాజరవనున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌రావు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్‌రావును ప్రశ్నించనున్న సిట్.
Jan 27, 2026 14:35 IST
ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి హాజరైన టీడీపీ ఎంపీ బాలశౌరి
అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరాం: ఎంపీ
సోషల్ మీడియా వినియోగంపై చర్చ జరగాలి.
US పన్నుల ప్రభావం ఆక్వా కల్చర్‌పై తీవ్రప్రభావం చూపుతోందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం.
Jan 27, 2026 14:34 IST
ఢిల్లీలో ముగిసిన అఖిలపక్ష సమావేశం
Jan 27, 2026 13:42 IST
భోగాపురానికి శుభవార్త
అదానీ, బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయర్ మధ్య కీలక ఒప్పందం
ఇకపై భారత్‌లోనే విమానాలు తయారుచేయనున్న బ్రెజిల్ సంస్థ
చిన్న, మధ్యస్థ ప్యాసింజర్ విమానాలతో పాటు.. సైనిక, ట్రాన్స్‌పోర్టు విమానాలు తయారు చేయనున్న బ్రెజిల్ సంస్థ.
ఏపీ, గుజరాత్లో తయారీ యూనిట్లు పెట్టనున్న ఎంబ్రాయర్.
భోగాపురంలో ఎంబ్రాయర్ ఫ్యాక్టరీ పెట్టాలని ఏపీ ప్రయత్నం.
భూమి, మౌలిక వసతులు కల్పిస్తామని ఎంబ్రాయర్‌కు ఏపీ ప్రభుత్వం హామీ.
భోగాపురంలో ఏరోస్పేస్ క్లస్టర్లు ఏర్పాటు చేసే అవకాశం.
Jan 27, 2026 13:41 IST
కుదిరిన ఒప్పందం..
అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయర్ మధ్య MoU.
ఒప్పందం కుదిరినట్లు ప్రకటించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.
పెరుగుతున్న అవసరాల మేరకు ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ: రామ్మోహన్
చిన్న, డొమెస్టిక్ ఎయిర్క్రాప్ట్లకు డిమాండ్ ఉంది: రామ్మోహన్
Jan 27, 2026 13:40 IST
డ్రగ్స్‌పై దండయాత్ర
హైదరాబాద్: సా.4 గంటలకు డ్రగ్స్‌పై దండయాత్ర కార్యక్రమం.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి 510 కిలోమీటర్లు సైకిల్ యాత్ర.
చీఫ్ గెస్ట్లుగా హాజరుకానున్న మంత్రులు అనిత, సత్యకుమార్, డీజీపీ.
Jan 27, 2026 13:03 IST
BRSలో అన్ని దుర్మార్గాలకు కారణం సంతోష్రావే: కవిత
సంతోష్‌రావు లాంటి వ్యక్తికి అనుకూలంగా కేటీఆర్, హరీష్‌రావు.. ట్వీట్లు పెట్టడాన్ని BRS శ్రేణులు గమనించుకోవాలి: కవిత
ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తన గూఢచారిని రేవంత్ కాపాడుకుంటారు: కవిత
సిట్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి: కవిత
Jan 27, 2026 13:03 IST
BRSలో ఎందరో నేతల కన్నీళ్లకు కారణం సంతోష్రావే: కవిత
ప్రగతి భవన్ గేటు బయట గద్దర్‌ను నిలబెట్టింది ఆయనే: కవిత
BRS నుంచి ఈటల సస్పెన్షన్‌కు కారణం సంతోష్రావే: కవిత
కేసీఆర్‌ను ఉద్యమకారులు, ప్రజలకు దూరం చేసింది సంతోషే: కవిత
Jan 27, 2026 13:03 IST
మాజీ ఎంపీ సంతోష్‌రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ దగ్గరున్న మొదటి దెయ్యం సంతోష్రావే: కవిత
రేవంత్‌రెడ్డికి ప్రధాన గూఢచారి సంతోష్‌రావు: కవిత
ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఫుల్ ఇడ్లీ తిన్నారా? సగం ఇడ్లీ తిన్నారా? అనే సమాచారం రేవంత్‌కు చేరవేసేది సంతోష్రావే: కవిత
Jan 27, 2026 12:57 IST
పార్టీలో కార్యకర్తలే అధినేతలు: మంత్రి లోకేశ్
యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్
మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలి: మంత్రి లోకేశ్
అన్ని పదవుల్లో సామాజిక న్యాయం: మంత్రి లోకేశ్
పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం కృషి: లోకేశ్
Jan 27, 2026 12:57 IST
సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టుకుంటున్నాం: మంత్రి లోకేశ్
వైసీపీ ఎన్ని కేసులు పెట్టినా డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చాం: మంత్రి లోకేశ్
గుంతలు పూడ్చేందుకు రూ.2వేల కోట్లు ఖర్చు అయ్యాయి: మంత్రి లోకేశ్
సంక్షేమం, అభివృద్ధి రెండూ ఉండాలి: మంత్రి లోకేశ్
పార్టీలో యువతకు అవకాశాలు ఇస్తాం: మంత్రి లోకేశ్
Jan 27, 2026 12:57 IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
ఇవాళ సాయంత్రం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న SEC.
ఎన్నికల ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక.
ఇప్పటికే ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ పూర్తి.
116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు.
Jan 27, 2026 12:53 IST
ట్రేడ్‌ను మరింత పెంచాల్సి ఉంది: కెనడా మంత్రి
భారత్‌తో ఎనర్జీ ట్రేడ్‌ను మరింత పెంచాల్సి ఉంది: కెనడా మంత్రి
ఇంధన రంగంలో కెనడా సూపర్ పవర్ కావాలంటే..
భారత్‌తో వ్యాపారం అవసరం: కెనడా మంత్రి టిమ్ హడ్గ్సన్
Jan 27, 2026 12:52 IST
నల్లగొండ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
నేను విద్యాశాఖ మంత్రి అయితే కార్పొరేట్ స్కూల్స్ మూసివేయిస్తా: కోమటిరెడ్డి
అధిక ఫీజులతో దోచుకుంటున్నారు.. అంతా దొంగలే: కోమటిరెడ్డి
సరైన విద్య అందితేనే పేదల సమస్యలు తీరుతాయి: మంత్రి కోమటిరెడ్డి
ఉత్సాహం ఉంటే మళ్లీ పోటీ చేస్తా.. లేకుంటే స్కూల్లో విద్యార్థులను చదివిస్తా: కోమటిరెడ్డి
కేంద్రం నుంచి నిధులు తెచ్చి నల్లగొండ రూపురేఖలు మారుస్తా: కోమటిరెడ్డి
నేను మోదీని కలిస్తే.. రూ.వెయ్యి, రూ.2 వేల కోట్ల నిధులైనా ఇస్తారు: కోమటిరెడ్డి
నిధుల మంజూరులో కొడంగల్‌తో పోటీ పడుతూ..
నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా మారుస్తా: మంత్రి కోమటిరెడ్డి
Jan 27, 2026 12:44 IST
తెలంగాణ హైకోర్టుకు ‘మన శంకరవరప్రసాద్’ చిత్ర నిర్మాత
టికెట్ ధరల అంశంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన నిర్మాత
టికెట్ ధరలకు సంబంధించి చిత్రం విడుదలకు 90రోజుల ముందే..
హోంశాఖకు దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల సింగిల్ బెంచ్ ఉత్తర్వులు
సింగిల్ బెంచ్ దగ్గర పిటిషన్ విచారణలో ఉన్నందున..
అక్కడే తెల్చుకోవాలని పిటిషనర్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశం
Jan 27, 2026 12:37 IST
సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: డిప్యూటీ సీఎం భట్టి
అధికారులతో సమానంగా కార్మికులకు సౌకర్యాలు కల్పించేందుకు కమిటీ వేశాం: డిప్యూటీ సీఎం భట్టి
సింగరేణి ఉద్యోగుల పేరు మార్పు సమస్యకు త్వరలో పరిష్కారం: భట్టి
సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చేందుకు కమిటీ: భట్టి
సింగరేణి ఉద్యోగులకు రూ.1.25కోట్ల ప్రమాద బీమా: భట్టి
30వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.40లక్షల ఉచిత ప్రమాద బీమా
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిలో 2,539పోస్టులు భర్తీ చేశాం: భట్టి
2024-25లో సింగరేణి చరిత్రలోనే అత్యధిక లాభాలు: భట్టి విక్రమార్క
రూ.6,394కోట్ల లాభాలు సాధించిన సింగరేణి: డిప్యూటీ సీఎం భట్టి
Jan 27, 2026 12:23 IST
ప్లాట్ల కేటాయింపు
రాజధాని అమరావతి రైతులకు ఈనెల 29న మలివిడత ప్లాట్ల కేటాయింపు
ఈనెల 28కి బదులు 29న లాటరీ నిర్వహించాలని CRDA నిర్ణయం
సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఈ-లాటరీ ద్వారా ప్లాట్లు
నిబంధనల ప్రకారం లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్న అధికారులు
Jan 27, 2026 12:22 IST
ఢిల్లీ: కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం
హాజరైన ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు
బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని కోరిన కేంద్రం
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం
Jan 27, 2026 11:32 IST
ఆ విషయంలో జగ్గారెడ్డి ఫైర్..
సంగారెడ్డి: రిజిస్ట్రార్ ఆఫీస్‌ను మరో చోటికి తరలిస్తే ఊరుకోం: జగ్గారెడ్డి
ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పేరుతో పటాన్‌చెరులోని కర్దనూర్‌కు తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా: జగ్గారెడ్డి
మంత్రులు దామోదర, పొంగులేటితో మాట్లాడేవరకు..
అధికారులు ఎలాంటి తరలింపు ఆలోచన చేయొద్దు: జగ్గారెడ్డి
Jan 27, 2026 11:30 IST
శిక్షణ తరగతులు ప్రారంభం
అమరావతి: పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు ప్రారంభం
ప్రారంభించిన నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు
టీడీపీ సీనియర్ నేతలతో పార్లమెంట్ కమిటీలకు శిక్షణ
సాయంత్రం ముగింపు సమావేశంలో కమిటీలకు చంద్రబాబు దిశానిర్దేశం
Jan 27, 2026 11:29 IST
ఆ ప్రశంసాపత్రంపై విమర్శలు
కృష్ణా: రిపబ్లిక్ డే వేడుకల్లో సీఐ కనకారావు ప్రశంసాపత్రంపై విమర్శలు
గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో..
వైసీపీ నేతలను వదిలి.. టీడీపీ నాయకులపై కేసు పెట్టిన సీఐ కనకారావు
కనకారావుకు ప్రశంసాపత్రం ఇవ్వడంపై వెల్లువెత్తున్న విమర్శలు
Jan 27, 2026 11:28 IST
చిరంజీవి వ్యాఖ్యలను ఖండించిన సింగర్ చిన్మయి
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి
క్యాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య: చిన్మయి
కమిట్మెంట్కు నో చెబితే రోల్స్ ఇవ్వరు: చిన్మయి
చిరంజీవి జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు: చిన్మయి
ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదు: సింగర్ చిన్మయి
Jan 27, 2026 11:23 IST
ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
2029 నాటికి చమురు, గ్యాస్ రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యం: మోదీ
చమురు శుద్ధి సామర్థ్యం 260 మిలియన్ టన్నుల నుంచి 300 టన్నులకు పెంచుతాం: మోదీ
భారత్ ను ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంగా తయారు చేస్తాం: మోదీ
భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందంతో తయారీ రంగలో వృద్ధి సాధిస్తాం: ప్రధాని మోదీ
Jan 27, 2026 11:20 IST
ప్రాక్టీస్ మెుదలెట్టిన ధోనీ..
రాంచీలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ మెుదలుపెట్టిన ధోనీ
ఐపీఎల్ 2026 కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్న మాజీ కెప్టెన్ ధోనీ
మార్చి 26 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం.. రెండు నెలల ముందుగానే ప్రాక్టీస్
Jan 27, 2026 11:16 IST
తమిళనాడు: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
జననాయగన్ సినిమా వివాదంలో సింగిల్ బెంచ్ తీర్పు రద్దు
U/A సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు
సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన సెన్సార్ బోర్డు
సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
Jan 27, 2026 10:47 IST
నేడే అఖిలపక్ష భేటీ..
ఢిల్లీ: బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
మంగళవారం ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలో అఖిలపక్ష భేటీ
పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని ప్రధాన కమిటీ హాల్లో సమావేశం
సమావేశానికి హాజరుకానున్న లోక్‌సభ, రాజ్యసభల్లోని వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు
Jan 27, 2026 10:42 IST
చిన్నారి మృతి.. కేసు నమోదు..
హైదరాబాద్: కూకట్పల్లి చైనా మాంజా ఘటనలో కేసు నమోదు
BNS 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు
చైనా మాంజా తగిలి ఐదేళ్ల నిష్విక నిన్న మృతి
ఎవరి మాంజా అనేది గుర్తించడం కష్టమన్న పోలీసులు
గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన కూకట్పల్లి పోలీసులు
Jan 27, 2026 10:08 IST
మెక్సికోలో గ్యాంగ్ వార్
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో డ్రగ్స్ ముఠాల మధ్య కాల్పులు
11 మంది మృతి, 12 మందికి గాయాలు
లోకల్ కార్టెల్, న్యూ జెన్ కార్టెల్ మధ్య గొడవ
Jan 27, 2026 10:08 IST
యువగళానికి మూడేళ్లు..
అమరావతి: లోకేశ్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు పూర్తి
మంత్రి లోకేశ్ కు అభినందనలు తెలిపిన టీడీపీ నేతలు
11 ఉమ్మడి జిల్లాల్లో 226 రోజులపాటు..
3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నారా లోకేశ్
Jan 27, 2026 10:07 IST
ఉత్తర భారతంలో హిమపాతం, వర్షాలు
జమ్మూకశ్మీర్, లేహ్, లడఖ్, హిమాచల్, ఉత్తరాఖండ్,..
శ్రీనగర్, మనాలి, సిమ్లాలో భారీగా కురుస్తున్న మంచు
మంచు కారణంగా జమ్ము-శ్రీనగర్ హైవే మూసివేత
హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్‌లో వర్షాలు
ఢిల్లీకి భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్
Jan 27, 2026 10:06 IST
రికార్డులు సృష్టిస్తోన్న బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ఆల్‌టైమ్ హైకి బంగారం ధరలు
5వేల డాలర్ల మార్క్ దాటిన ట్రాయ్ ఔన్సు బంగారం ధర
రూ.లక్షా 61 వేలు దాటిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,61,950
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,48,450
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,87,000
Jan 27, 2026 09:31 IST
హైదరాబాద్: అత్తాపూర్ సాయినగర్‌లో వ్యక్తి ఆత్మహత్య
ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఆదిత్య రెడ్డి
పైన గదిలో పడుకుంటానని వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణం
తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Jan 27, 2026 09:06 IST
కర్ణాటక: విజయపుర జిల్లాలో రిపబ్లిక్ డే రోజే భారీ దోపిడీ
సోమవారం సాయంత్రం 4 గంటలకు గోల్డ్ షాప్ లూటీ
మంకీ క్యాప్, హెల్మెట్ ధరించి బంగారం షాపులోకి వెళ్లిన దొంగలు
తుపాకీతో షాపు యజమానిని, కస్టమర్లను బెదిరించిన కేటుగాళ్లు
బంగారం నగలు తీసుకుని అక్కడ్నుంచి పరారైన దొంగలు
Jan 27, 2026 08:12 IST
ఢిల్లీ: ఉ.11 గంటలకు అఖిలపక్ష సమావేశం
రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
హాజరుకానున్న వివిధ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు
Jan 27, 2026 08:12 IST
మున్సిపల్ పోరుకు షెడ్యూల్..!
నేడు తెలంగాణలో మున్సిపల్ పోరుకు షెడ్యూల్
ఉదయం కలెక్టర్లు, మధ్యాహ్నం సీఎస్‌తో ఈసీ సమావేశం
సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం
Jan 27, 2026 08:08 IST
రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం, వెండి ధరలు
పెరగడమే తప్ప తగ్గడం అనేది లేకుండా దూసుకెళ్తున్న రేట్లు
హైదరాబాద్‌లో మంగళవారం ఉదయానికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,960
అలాగే రూ.1,48,460కి చేరిన 22 క్యారెట్ల పసిడి రేటు
హైదరాబాద్‌లో రూ.3,75,100కి ఎగబాకిన కిలో వెండి ధర
Jan 27, 2026 07:58 IST
టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు, లోకేష్
అమరావతి: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై టీడీపీ అధిష్టానం దృష్టి
పార్టీ బలోపేతంపై నూతన కమిటీలకు సీనియర్ నేతలు దిశానిర్దేశం
25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,..
కమిటీ సభ్యులందరూ హాజరుకావాలని ఆదేశాలు
సాయంత్రం వరకు టీడీపీ ఆఫీస్‌లోనే చంద్రబాబు, లోకేష్
Jan 27, 2026 07:57 IST
అమెరికాలో మంచు తుఫాన్
అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో మంచు తుఫాన్
విద్యుత్ తీగలు తెగి 7.5లక్షలకు పైగా నివాసాలకు కరెంట్ నిలిపివేత
వివిధ కారణాలతో 25 మంది మృతి