Telangana High Court: గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట


హైదరాబాద్‌: గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ -1 నియామకాలపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్- 1 జనరల్ ర్యాంకింగ్‌ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్‌ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు అప్పీలు చేశారు. గతంలో విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది.



Source link

Spread the love