ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి అమెరికా గురువారం అధికారికంగా వైదొలిగింది. 1948లో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా ప్రారంభమైనప్పటి నుంచి డబ్ల్యూహెచ్‌వోలో 78 ఏళ్లపాటు అమెరికా కీలక భాగస్వామిగా ఉంది.

వాషింగ్టన్, జనవరి 23: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి అమెరికా గురువారం అధికారికంగా వైదొలిగింది. 1948లో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా ప్రారంభమైనప్పటి నుంచి డబ్ల్యూహెచ్‌వోలో 78 ఏళ్లపాటు అమెరికా కీలక భాగస్వామిగా ఉంది. ఈ సంస్థకు అత్యధిక విరాళాలు ఇచ్చే దేశం కూడా అమెరికానే. ఈ సంస్థ మొత్తం వార్షిక బడ్జెట్ 5.8 బిలియన్ డాలర్లు కాగా, అందులో దాదాపు పావు వంతు నిధులు అమెరికా ఒక్కటే అందిస్తోంది. బ్ల్యూహెచ్ నుంచి అమెరికా తప్పుకొంటున్నట్లు డ బ్బు జనవరిలో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. డబ్ల్యూహెచ్‌వో రాజ్యాంగం ప్రకారం ఒకదేశం తన సభ్యత్వాన్ని రద్దుచేసుకోవాలంటే సంవత్సరం ముందుగా నోటీసు చేయాల్సి ఉంటుంది. నోటీసు ఇచ్చి ఏడాది పూర్తి కావటంతో గురువారం అమెరికా అధికారికంగా సంస్థ నుంచి బయటకు వచ్చింది. కాగా, సభ్యదేశాలు ఇచ్చే విరాళాలతోనే డబ్ల్యూహెచ్‌వో నడుస్తోంది. అయితే, తమకు ఎక్కువ విరాళాలు ఇస్తున్న సంస్థలో తగిన గౌరవం లభించడంలేదని ట్రంప్ అందరినీ. సంస్థలో అవినీతి పెరిగిపోయింది. అమెరికా వైదొలగతో డబ్ల్యూహెచ్‌వోకు నిధుల కటకట ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆ దేశం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థకు దాదాపు 130 మిలియన్ డాలర్లు బకాయి ఉంది. ఇకపై ఆ నిధులు కూడా వచ్చే అవకాశం లేదని సమాచారం. కాగా, డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా బయటకు రావడాన్ని ఆ దేశంలో ప్రముఖులు తప్పుబట్టారు. ఇది తొందరపాటు చర్య అని అమెరికా అంటువ్యాధుల సొసైటీ అధ్యక్షుడు రొనాల్డ్ నహాస్ అభిప్రాయపడ్డారు.
నవీకరించబడిన తేదీ – జనవరి 24, 2026 | 04:28 AM