ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్ | ABN Andhrajyothy ap telangana national international viral and trending telugu live updates of 9th february 2026 kjr



  • Feb 09, 2026 21:51 IST

    రూ. 5 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం..

    • ఖమ్మం జిల్లాలో ఐదు కోట్ల రూపాయల విలువైన గంజాయిని తగలబెట్టిన ఎక్సైజ్ శాఖ పోలీసులు.

    • తల్లాడ మండలం గోపాలపేట గ్రామ సమీపంలో తగలబెట్టిన అధికారులు.

    • ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు ధ్వంసం.

    • సుమారు 953 కేజీల గంజాయి బ్యాగులకి నిప్పుపెట్టిన అధికారులు.

    పూర్తికథనం


  • Feb 09, 2026 21:48 IST

    పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ


  • Feb 09, 2026 21:43 IST

    టాటా AIA నుంచి రెండు కొత్త పెట్టుబడి అవకాశాలు

    • వాల్యూ-బేస్డ్ ఈక్విటీ ఫండ్స్ అనౌన్స్ చేసిన టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్.

    • టాటా AIA లైఫ్ ఎన్‌హాన్స్‌డ్ వాల్యూ ఇండెక్స్ ఫండ్.

    • టాటా AIA ఎన్‌హాన్స్‌డ్ వాల్యూ ఇండెక్స్ పెన్షన్ ఫండ్.

    పూర్తికథనం


  • Feb 09, 2026 21:37 IST

    2026 కాంట్రాక్ట్‌ లిస్ట్‌ ప్రకటించిన BCCI

    • ఏ ప్లస్‌ నుంచి బీ గ్రేడ్‌లోకి రోహిత్‌ శర్మ, కోహ్లీ.

    • గ్రేడ్‌-Aలో శుభ్‌మన్‌గిల్‌, బుమ్రా, రవీంద్ర జడేజా.

    • గ్రేడ్‌-Bలో రోహిత్‌, కోహ్లీ, రాహుల్‌, సిరాజ్‌, పాండ్యా, సుందర్‌.

    • గ్రేడ్‌-Bలో పంత్‌, కుల్దీప్‌, జైశ్వాల్‌, సూర్యకుమార్‌, శ్రేయస్‌.


  • Feb 09, 2026 21:36 IST

    మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శేరిలింగంపల్లి జోన్‌లో నిషేధాజ్ఞలు: డీసీపీ సీహెచ్. శ్రీనివాస్

    • శాంతిభద్రతల పరిరక్షణ కోసమే నిషేధాజ్ఞలు.

    • BNSS సెక్షన్ 163 ప్రకారం ఐదుగురికి మించి గుమికూడరాదని ఆదేశాలు.

    • పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు.

    • ఫిబ్రవరి 11 ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిషేధాజ్ఞలు.

    • ఐడీఏ బొల్లారం, పటాన్ చేరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధాజ్ఞలు.

    • పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రజా సమావేశాలు, గుమికూడడాలు పూర్తిగా నిషేధం.

    • నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు డీసీపీ.


  • Feb 09, 2026 21:17 IST

    ఆదిలాబాద్‌: చెన్నూర్‌లో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో తనిఖీలు

    • పోలీసుల సోదాలపై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆగ్రహం.

    • అధికారులు వివేక్‌కు తొత్తులుగా మారారు: సుమన్‌

    • బీఆర్ఎస్ నేతలనే టార్గెట్‌ చేసి దాడులు చేస్తున్నారు: సుమన్‌

    • కాంగ్రెస్‌ నేతల ఇళ్లలో సోదాలు చేయడం లేదు: సుమన్‌


  • Feb 09, 2026 21:14 IST

    భారత్‌తో టీ20 ఆడేందుకు పాక్‌ అంగీకారం


  • Feb 09, 2026 21:12 IST

    ఏపీలో నియోజకవర్గాల ప్రగతిపై నివేదిక విడుదల

    • మొత్తం 175 ఎమ్మెల్యే నియోజ‌కవ‌ర్గాల్లో A+ గ్రేడ్‌లో 21 నియోజ‌కవ‌ర్గాలు.

    • A గ్రేడ్‌లో 153 నియోజ‌కవ‌ర్గాలు, B గ్రేడ్‌లో ఒక నియోజ‌కవ‌ర్గం.

    • 90 శాతానికిపైగా మార్కులతో A+ గ్రేడ్ ద‌క్కించుకున్న 13 నియోజ‌క‌వ‌ర్గాలు.

    • 93 శాతం మార్కులతో రాష్ట్రంలోనే నెంబ‌ర్ వన్ నియోజ‌కవ‌ర్గంగా ఎన్టీఆర్ జిల్లాలోని విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క వ‌ర్గం.

    • 92 మార్కులతో రెండో ర్యాంకులో విశాఖలోని గాజువాక‌.

    • కాకినాడ న‌గ‌ర నియోజ‌కవ‌ర్గానికి మూడో ర్యాంక్‌.

    • విజ‌య‌వాడ తూర్పు నియోజ‌కవ‌ర్గానికి నాలుగో ర్యాంక్‌.


  • Feb 09, 2026 21:11 IST

    అమ‌రావ‌తి: ఏపీలో నియోజకవర్గాల ప్రగతిపై నివేదిక విడుదల

    • నెంబర్ వన్ ప్లేస్‌లో విజయవాడ వెస్ట్.

    • రెండో స్ధానంలో ఉన్న విశాఖలోని గాజువాక.

    • మూడో స్ధానంలో కాకినాడ, నాలుగో స్ధానంలో విజయవాడ ఈస్ట్.

    • ఐదోస్థానంలో బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురం.

    • పదోస్ధానంలో నిలిచిన పవన్‌కల్యాణ్‌ నియోజకవర్గం పిఠాపురం.

    • వివిధ అంశాల్లో 175 నియోజ‌క‌వ‌ర్గాలకు ర్యాంకులు.

    • వివిధ ఇండికేట‌ర్లను దృష్టిలో పెట్టుకొని ర్యాంకుల ప్రకటన.


  • Feb 09, 2026 21:04 IST

    బాపట్ల: చీరాలకు చేరుకున్న కోస్టల్ సైక్లోథాన్–2026 సీఐఎస్ఎఫ్ బృందం సైకిల్ యాత్ర.

    • ఘన స్వాగతం పలికిన చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్.

    • కలకత్తా నుంచి కొచ్చిన్ వరకు సైకిల్ యాత్ర చేపట్టిన 150 మంది సీఐఎస్ఎఫ్ పోలీసులు.

    • మత్స్యకారులకు విపత్తులపై అవగాహన లక్ష్యంగా యాత్ర నిర్వహణ.

    • కొద్ది దూరం సైకిల్ తొక్కి సైకిలిస్టులను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే కొండయ్య.


  • Feb 09, 2026 20:53 IST

    సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్

    • ఫలితాలకు ముందే సీఎం రేవంత్‌ ఓటమిని ఒప్పుకున్నారు.

    • ఓటమి భయంతోనే బీజేపీపై అవాకులు పేలుతున్నారు.

    • ఎంఐఎంతో డీల్ కుదిరిందా? లేదా? సమాధానం చెప్పాలి.

    • సీఎం, ఒవైసీ స్క్రిప్ట్ ఒకటే.. దారుస్సలాం, గాంధీభవన్‌లో ప్రిపేర్ అవుతోంది.

    • సీఎం చేతగానితనాన్ని ఇతరులపై నెట్టడం ఆయనకు అలవాటైంది.

    • కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదని లేఖ రాయమనండి.

    • వాళ్ల సంగతి మేం చూసుకుంటాం.


  • Feb 09, 2026 20:33 IST

    విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వం.. ప్రజలకే ట్రూ డౌన్ ఫలితాలు: సీఎం చంద్రబాబు

    • ఆర్టీసీలో 1,000 ఈవీ బస్సుల కొనుగోలు: సీఎం చంద్రబాబు

    • కీలక శాఖల్లో నిబంధనలు సరళతరంపై దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబు

    • పన్నుల వసూళ్లు తగ్గకూడదు.. వ్యాపారులను వేధించకూడదు: సీఎం చంద్రబాబు

    • కేంద్రం నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి: సీఎం చంద్రబాబు


  • Feb 09, 2026 20:30 IST

    తిరుమల: సీఎం చంద్రబాబుకు శ్రీవారి ఆలయ పెద్ద జీయర్‌ లేఖ

    • లడ్డూ తయారీలో రసాయనాల వినియోగం అపచారం: పెద్ద జీయర్‌

    • భక్తుల మనోభావాలను దెబ్బతీశారు: పెద్ద జీయర్‌

    • భవిష్యత్తులో మళ్లీ జరగకుండా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలి: పెద్ద జీయర్‌

    • ధర్మాన్ని పరిరక్షించడంతో పాటు ఆలయాల పవిత్రతను కాపాడే శక్తిని ఆ దేవుడు సీఎం చంద్రబాబుకు ప్రసాధించాలి: పెద్ద జీయర్‌


  • Feb 09, 2026 20:29 IST

    టీ20 వరల్డ్‌ కప్‌: ఒమన్‌పై జింబాబ్వే విజయం

    • ఒమన్‌పై 8 వికెట్ల తేడాతో జింబాబ్వే గెలుపు

    • స్కోర్లు: ఒమన్‌ 103 ఆలౌట్‌, జింబాబ్వే 106/2(13.3)


  • Feb 09, 2026 20:22 IST

    హైదరాబాద్‌: సీఎస్‌ రామకృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష

    • కేంద్ర వ్యవసాయశాఖ సలహాదారు రాజీవ్ చావ్లా అధ్యక్షతన భేటీ.

    • డిజిటల్ క్రాప్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఆదేశం.

    • జిల్లా కలెక్టర్లు, ఎన్‌ఐసి అధికారుల సమన్వయంతో మార్చి 15లోగా డిజిటల్ క్రాప్ సర్వే (DCS) పూర్తి చేయాలి.


  • Feb 09, 2026 19:43 IST

    కడప: జమ్మలమడుగు పట్టణ శివారుల్లో టూరిస్ట్ బస్సు బోల్తా

    • 10 మందికి స్వల్ప గాయాలు.

    • టూరిస్టులు రైల్వే కోడూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.

    • బస్సు స్టీరింగ్ తిరగకపోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.

    • గాయపడిన వారిని జమ్మల మడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

    • కన్నెతీర్థం నుండి ఆలూరు రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి వెళుతుండగా ప్రమాదం.


  • Feb 09, 2026 19:20 IST

    ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని వైసీపీ నిర్ణయం


  • Feb 09, 2026 19:17 IST

    హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో చోరీకి పాల్పడ్డ నేపాలి గ్యాంగ్‌ అరెస్ట్‌

    • నేపాల్ బోర్డర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.

    • రవీంద్ర శర్మ ఇంట్లో పనిమనిషిగా చేరి రూ. 20లక్షలు, డైమండ్ రింగ్, బంగారం ఎత్తుకెళ్లిన నేపాలి గ్యాంగ్.


  • Feb 09, 2026 19:16 IST

    సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్‌లో కీలక అంశాలు

    • ఈసారి దేశంలో జమిలీ ఎన్నికలే: సీఎం రేవంత్‌

    • తెలంగాణకూ 2029లోనే ఎన్నికలు: సీఎం రేవంత్‌

    • జిల్లాల పునర్విభజన చేయాలనే ఆలోచన లేదు: సీఎం రేవంత్‌

    • ముందుగా కేంద్రం నుంచి జనగణన: సీఎం రేవంత్‌

    • ఆ తర్వాత నియోజకవర్గాల డీలిమిటేషన్‌: సీఎం రేవంత్‌

    • జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాదికి నష్టం: సీఎం రేవంత్‌

    • కొత్త పార్లమెంట్‌ కట్టేటప్పుడే 800పైగా సీట్లు ఏర్పాటు చేశారు: సీఎం రేవంత్‌


  • Feb 09, 2026 19:10 IST

    నల్లగొండ: చింతపల్లి మండలం ఉమ్మంతలపల్లిలో దారుణం

    • కుటుంబ కలహాలతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేల్చుకుని శిరీష అనే వివాహిత ఆత్మహత్యాయత్నం.

    • అదే సమయంలో ఇంట్లోనే ఉన్న ఆమె ఇద్దరు పిల్లలు.

    • తల్లి పరిస్థితి విషమం, పిల్లలకు గాయాలు.

    • చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలింపు.


  • Feb 09, 2026 19:08 IST

    గుంటూరు: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు

    • అంబటికి బెయిల్ మంజూరు చేసిన స్పెషల్ మొబైల్ కోర్టు.

    • సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటికి బెయిల్.

    • ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి రాంబాబు.

    • పీటీ వారెంట్‌ కేసులో రిమాండ్‌లోనే ఉండనున్న అంబటి.

    పూర్తికథనం


  • Feb 09, 2026 19:07 IST

    హైదరాబాద్‌: చిలుకూరులోని రిసార్ట్‌లో విషాదం

    • స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు దిగి 15 ఏళ్ల బాలుడు మృతి.

    • సరదాగా ఆడుకుంటూ నీట మునిగిన బాలుడు.


  • Feb 09, 2026 19:06 IST

    ‘సర్’ ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు: సుప్రీంకోర్టు

    • ఏదైనా ఆదేశాలు, స్పష్టత అవసరమైతే కల్పించుకుంటా: సుప్రీంకోర్టు

    • దీన్ని అన్ని రాష్ట్రాలు అర్ధం చేసుకోవాలి: సుప్రీంకోర్టు

    • బెంగాల్ ప్రభుత్వం పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం.

    పూర్తికథనం


  • Feb 09, 2026 19:00 IST

    కరీంనగర్: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ హాట్ కామెంట్స్

    • ముఖ్యమంత్రుల దగ్గరికి మేం వెళ్లం.

    • ముఖ్యమంత్రిలే మా దగ్గరికి వస్తారు.

    • జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా మద్దతు లేనిదే కాంగ్రెస్ గెలిచిందా..?

    • రెడ్డి అయినా రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే.

    • ఎంఐఎం బ్రదర్స్ సత్తా ఏంటో చూపిస్తాం.

    • మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు సత్తా చాటుతారు.


  • Feb 09, 2026 17:00 IST

    తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

    • తెలంగాణ వ్యాప్తంగా మూగబోయిన మైకులు.

    • ఎల్లుండి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్‌.

    • బ్యాలెట్‌ పేపర్ల ద్వారానే ఓటింగ్‌ నిర్వహణ.

    • ఈనెల 13న మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.

    పూర్తికథనం


  • Feb 09, 2026 16:46 IST

    టీ20 ప్రపంచ కప్ 2026: తడబడిన ఒమన్.. జింబాబ్వే టార్గెట్ 104

    • కొలంబో వేదికగా తలపడుతున్న ఒమన్-జింబాబ్వే జట్లు.

    • 19.5 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైన ఒమన్.

    • వినాయక్ శుక్లా(28) టాప్ స్కోరర్.

    • రిచర్డ్, ముజారబని, బ్రాడ్ ఎవన్స్‌లకు తలో 3 వికెట్లు.

    • ఒక వికెట్ పడగొట్టిన జింబాబ్వే కెప్టెన్ సికందర్.

    • జింబాబ్వే విజయ లక్ష్యం 104 పరుగులు.


  • Feb 09, 2026 16:22 IST

    సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన కెప్టెన్: గౌతమ్ గంభీర్

    • టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై హెడ్ కోచ్ గంభీర్ ప్రశంసలు.

    • పొట్టి ఫార్మాట్‌లో కోచ్‌గా సూర్య నా పనిని సులభతరం చేస్తున్నాడు.


  • Feb 09, 2026 16:21 IST

    డిజిటల్‌ ఆర్థిక మోసాలపై సుప్రీంకోర్టులో విచారణ

    • డిజిటల్‌ మోసాలతో రూ.54 వేల కోట్లు కొల్లగొట్టారన్న సుప్రీంకోర్టు.

    • ఇది భారీ దోపిడీ అంటూ సుప్రీంకోర్టు ఆందోళన.

    • డిజిటల్‌ మోసాలపై RBI, బ్యాంకులు తక్షణ చర్యలు తీసుకోవాలి.

    • బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతోనే డిజిటల్‌ మోసాలు.


  • Feb 09, 2026 16:21 IST

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ: సీఎం రేవంత్‌

    • భవిష్యత్తును ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలి.

    • 12 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రానికి ఏమైనా ప్రాజెక్టులు ఇచ్చిందా?

    • తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి?

    • పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని మోదీ చెప్పారు.

    • హామీల అమలు గురించి మాత్రం బీజేపీ చెప్పట్లేదు.

    • మోదీని చూసి ఓటేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారు.


  • Feb 09, 2026 16:18 IST

    తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర.

    • సాయంత్రం 5:00 గంటలకు ముగియనున్న ఎన్నికల ప్రచారం.

    • ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో.. నేడు నేతల సుడిగాలి ప్రచారం.

    పూర్తికథనం


  • Feb 09, 2026 15:58 IST

    సూర్యాపేట: కోదాడలో పలు చోట్ల ఈడీ సోదాలు

    • నీలా సత్యనారాయణ బంధువుల ఇళ్లలో ఈడీ తనిఖీలు.

    • ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే అభియోగంతో సోదాలు.

    • రైస్‌మిల్స్‌, ఇతర వ్యాపారాల్లో పన్ను ఎగవేత ఆరోపణలు.


  • Feb 09, 2026 15:56 IST

    విశాఖ: ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ బయటపెట్టాలి: ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద

    • కల్తీ లడ్డూ వ్యవహారంపై సిట్‌ నివేదికలు ఉన్నాయి.

    • లడ్డూల్లో రసాయనాలు కలిశాయని తెలిసిన తర్వాత కూడా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?

    • వైసీపీ హయాంలోనే ఈ వ్యవహారం అంతా జరిగింది.

    • టీటీడీ గత ఛైర్మన్లకు తెలియకుండానే ఈ వ్యవహారం జరిగిందా?


  • Feb 09, 2026 15:54 IST

    మెదక్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎన్నికల ప్రచారం..

    • ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ జైలుకు వెళ్లడం ఖాయం: హరీశ్

    • అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దహనం చేశారు: హరీశ్

    • సీఎం రేవంత్ డైరెక్షన్‌లోనే ఈ ప్రమాదం జరిగింది: హరీశ్

    • మిర్యాలగూడ, భూపాలపల్లి, నిజామాబాద్ వెళ్లిన సీఎం రేవంత్.. మెదక్‌కు ఎందుకు రాలేదు: హరీశ్


  • Feb 09, 2026 15:52 IST

    నెల్లూరు: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్‌ జ్యోతిపై సస్పెన్షన్ వేటు

    • ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ అజితా వెజెండ్ల.

    • పోలీసు శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్‌మీట్, నిరసన చేపట్టారని చర్యలు.

    • సీతారామపురం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్యోతి.


  • Feb 09, 2026 15:48 IST

    హిమంతపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: ఎంపీ గౌరవ్ గొగోయ్

    • నా భార్య, మైనర్ పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

    • వృత్తి పరంగా నా భార్య గతంలో పాకిస్థాన్ వెళ్లింది.

    • నేను కూడా ఆమెతో 10 రోజులు ఉన్నాను.

    • సిట్ నివేదకను తొక్కిపెట్టారు.

    • పొలిటికల్ డ్రామా ఆడుతున్న సీఎం.

    పూర్తికథనం


  • Feb 09, 2026 15:46 IST

    సింగరేణి సంస్థ అప్పుల ఊబిలో విలవిల్లాడుతోంది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

    • సింగరేణిని రక్షించేది బీజేపీ మాత్రమే.

    • మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలి.

    • రామగుండం అభివృద్ధి కోసం BRS చేసిందేమీ లేదు.

    • రామగుండంలో బీజేపీని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాం.


  • Feb 09, 2026 15:40 IST

    NCP(SP) చీఫ్‌ శరద్‌ పవార్‌కు తీవ్ర అస్వస్థత


  • Feb 09, 2026 15:35 IST

    పంజాబ్‌లో దారుణం

    • ఓ యువకుడు క్లాస్ రూములో యువతిపై తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు.

    • యువతిని కాల్చి చంపి, తను కూడా అదే తుపాకితో కాల్చుకున్నాడు.

    పూర్తికథనం


  • Feb 09, 2026 15:32 IST

    మహబూబ్‌నగర్‌: మున్సిపాలిటీలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో వివరించిన డీకే అరుణ

    • అవినీతిరహిత పారదర్శక పాలన అందించడమే బీజేపీ లక్ష్యం: డీకే అరుణ

    • పట్టణాల్లో స్లమ్‌ ఏరియాలపై ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్‌ చేస్తాం: డీకే అరుణ


  • Feb 09, 2026 15:30 IST

    పఠాన్‌‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    • మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలంటూ ఎమ్మెల్యే పిలుపు.

    • కార్మిక సంఘం నేతలతో నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానించిన చేసిన ఎమ్మెల్యే.

    • కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.


  • Feb 09, 2026 15:26 IST

    స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం

    • సభలో మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించడం లేదని అసంతృప్తి.

    • ఖర్గే నివాసంలో విపక్ష ఎంపీల సమావేశం.

    • రెండో విడత సమావేశాల్లో అవిశ్వాసంపై చర్చకు అవకాశం.

    పూర్తికథనం


  • Feb 09, 2026 15:23 IST

    ఢిల్లీ: కుల్‌దీప్ సింగ్ సెంగార్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట

    • ఉన్నావ్‌ అత్యాచార కేసులో నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే సెంగార్.

    • కుల్‌దీప్ సింగ్ సెంగార్‌కు బెయిల్ ఇవ్వడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరణ.

    • ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం నిరాకరణ.


  • Feb 09, 2026 15:21 IST

    విజయవాడ: ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం

    • ఇంద్రకీలాద్రిపై దాహార్తిని తీర్చేందుకు రూ. కోటి 20 లక్షలతో వాటర్ ప్లాంట్: దుర్గగుడి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ

    • శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు.

    • తిరుపతి తరహాలో లడ్డూ తయారీకి మిషన్లు.

    • ప్రజా ప్రతినిధులతో సమావేశం తర్వాత పార్కింగ్ సమస్యపై పరిష్కారం.

    • నకిలీ టిక్కెట్లపై విచారణ చేస్తున్నాం.


  • Feb 09, 2026 15:19 IST

    నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు

    • రేపు (మంగళవారం) ఐదుగురు కేంద్రమంత్రులతో సీఎం సమావేశం

    • ఏపీకి సంబంధించి పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలకు నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చ

    • కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సాయంత్రం 5 గంటలకు అమరావతికి సీఎం తిరుగు పయనం


  • Feb 09, 2026 15:18 IST

    సంగారెడ్డి: జహీరాబాద్‌లో బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్ రోడ్ షో

    • బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం

    • పస్తాపూర్ కమాన్ నుంచి శివాజీ చౌక్ వరకు రోడ్ షో


  • Feb 09, 2026 15:16 IST

    ఎన్టీఆర్ జిల్లాలో వివాహితపై అత్యాచారయత్నం..

    • విషయం బయటకు వస్తే భర్తను, పిల్లలను చంపుతానంటూ బెదిరింపులు

    • ఘటనపై తిరువూరు పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు

    • ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలి ఆవేదన

    • నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని భర్త డిమాండ్


  • Feb 09, 2026 15:16 IST

    వీలైనంత త్వరగా వైభవ్‌ను సీనియర్ జట్టులోకి తీసుకోవాలి: ఎంపీ శశిథరూర్

    • యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు

    • ఇలాంటి క్రికెటర్ తరానికి ఒక్కరు మాత్రమే ఉంటారు: శశిథరూర్

    • సచిన్ కూడా 14 ఏళ్ల వయసులోనే క్రికెట్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు: శశిథరూర్

    పూర్తికథనం


  • Feb 09, 2026 14:59 IST

    టీ20 ప్రపంచ కప్ 2026: ఒమన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన జింబాబ్వే

    • కొలంబో వేదికగా తలపడనున్న ఒమన్-జింబాబ్వే

    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే

    • తొలుత బ్యాటింగ్ చేయనున్న ఒమన్


  • Feb 09, 2026 14:55 IST

    ఆనందంలో హార్ట్ స్ట్రోక్.. యువకుడి మృతి..

    • ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

    • కోడి పందెంలో విజయం సాధించిన ఆనందంలో యువకుడికి గుండెపోటు

    • ఛాతిలో నొప్పి రావడంతో పందెం బరిలోనే కుప్పకూలిన యువకుడు కిరణ్

    • హుటాహుటిన నూజివీడు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలోనే మృతి


  • Feb 09, 2026 13:41 IST

    మధిరలో డిప్యూటీ సీఎం ఎన్నికల ప్రచారం..

    • ఖమ్మం: మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రచారం..

    • మధిరలో గత పదేళ్లలో ఆశించిన అభివృద్ధి జరగలేదు..

    • మధిరకు కావాల్సింది రాజకీయాలు కాదు.. అభివృద్ధి..

    • మధిర రూపురేఖలు మార్చే బాధ్యత నాది: డిప్యూటీ సీఎం


  • Feb 09, 2026 13:08 IST

    సుప్రీంకోర్టులో రాజ్‌ కసిరెడ్డికి దక్కని ఊరట

    • ఢిల్లీ: సుప్రీంకోర్టులో రాజ్‌ కసిరెడ్డికి దక్కని ఊరట..

    • రాజ్‌ కసిరెడ్డికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు..

    • ఏపీ లిక్కర్ కేసులో కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ నిరాకరణ..

    • స్కామ్‌లో కసిరెడ్డి ఎన్ని కోట్లు అక్రమంగా ఆర్జించారంటూ… సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూటి ప్రశ్న


  • Feb 09, 2026 12:39 IST

    టీ20 ప్రపంచ కప్ 2026: చెలరేగిన జార్జ్ మున్సే.. ఇటలీ టార్గెట్ 208

    • ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడుతోన్న స్కాట్లాండ్-ఇటలీ..

    • నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసిన స్కాట్లాండ్..

    • హాఫ్ సెంచరీతో చెలరేగిన జార్జ్ మున్సే(84)..

    • రాణించిన మెకెల్లమ్(41; 18 బంతుల్లో 4 సెక్సులు)..

    • అలీ హసన్, స్టీవర్ట్, థామస్, స్మట్స్‌లకు తలొక వికెట్..

    • ఇటలీ విజయ లక్ష్యం 208..


  • Feb 09, 2026 12:36 IST

    శ్రీశైలంలో శివస్వాముల ఆందోళన

    • నంద్యాల: శ్రీశైలంలో శివస్వాముల ఆందోళన..

    • సర్వదర్శనానికి ఆలస్యమవుతోందని నిరసన..

    • కృష్ణదేవరాయ క్యూలైన్లు విరగ్గొట్టి ఆలయంలోకి చొచ్చుకెళ్లిన భక్తులు..

    • కృష్ణదేవరాయ గోపురం నుంచి వందలాదిగా దూసుకొస్తున్న భక్తులు..


  • Feb 09, 2026 12:26 IST

    కేటీఆర్ భూపాలపల్లి పర్యటనలో ఉద్రిక్తత

    • జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కేటీఆర్ భూపాలపల్లి పర్యటనలో ఉద్రిక్తత..

    • సామాజిక కార్యకర్త, దివంగత రాజలింగమూర్తి ఫ్లెక్సీ తొలగింపుపై ఆగ్రహం..

    • బీఆర్ఎస్ నేతలే తొలగించారంటూ రాజలింగమూర్తి బంధువుల ఆరోపణ..

    • రోడ్డుపై బైఠాయించి నిరసన..


  • Feb 09, 2026 12:24 IST

    తిరుమల లడ్డూ వ్యవహారంపై శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం

    • విశాఖ: తిరుమల లడ్డూ వ్యవహారంపై శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం..

    • హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి..

    • లడ్డూ ప్రసాదంలో కూడా ఫుడ్‌ మాఫియా చేరింది: శ్రీనివాసానంద సరస్వతి


  • Feb 09, 2026 12:02 IST

    తల్లి ప్రైవేట్ ఫొటోలు తీసి ప్రియుడికి పంపిన కూతురు..

    • బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..

    • కూతురు ఫోన్ చెక్ చేయగా బయటపడ్డ దారుణం..

    • కూతురు, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి..


  • Feb 09, 2026 11:50 IST

    ఏపీఎస్ ఆర్టీసీకి.. సీఎం చంద్రబాబు అభినందనలు

    • అమరావతి: స్త్రీశక్తి పథకం అమలుపై ఏపీఎస్ ఆర్టీసీకి సీఎం చంద్రబాబు అభినందనలు..

    • రూ.4 కోట్ల మంది మహిళా ప్రయాణికులకు ఉచిత సేవలు అందించాం: సీఎం

    • ఏపీఎస్ ఆర్టీసీకి సీఎం ప్రశంసలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి హర్షం..

    • భవిష్యత్‌లో మెరుగైన సేవలు అందిస్తాం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి


  • Feb 09, 2026 11:01 IST

    అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్‌కు శంకుస్థాపన: సీఎం చంద్రబాబు

    • రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు ఇక్కడి నుంచే తయారీ..

    • ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు మనమే అందిస్తాం..

    • AI, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెనుమార్పులు: సీఎం చంద్రబాబు


  • Feb 09, 2026 10:51 IST

    టీ20 ప్రపంచ కప్ 2026: స్కాట్లాండ్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ఇటలీ

    • కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్న స్కాట్లాండ్-ఇటలీ

    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇటలీ..

    • తొలుత బ్యాటింగ్ చేయనున్న స్కాట్లాండ్..


  • Feb 09, 2026 10:47 IST

    ఇనుప కంచెలో చిక్కుకున్న ఎలుగుబంటి..

    • శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరులో జీడి తోటల్లో ఇనుప కంచెలో చిక్కుకున్న ఎలుగుబంటి..

    • వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ బృందం..

    • ఎలుగుబంటిని చాకచక్యంగా బోనులో బంధించి.. విశాఖపట్నం జూకి తరలించిన అటవీశాఖ సిబ్బంది.


  • Feb 09, 2026 09:45 IST

    ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు

    • ఢిల్లీలో 9 స్కూళ్లకు బాంబు బెదిరింపులు..

    • రంగంలోకి పోలీస్ దళాలు, బాంబ్ స్క్వాడ్స్..


  • Feb 09, 2026 09:29 IST

    కొమురంభీం జిల్లాలో మావోయిస్టుల కలకలం

    • తిర్యాణి మండలం పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో..

    • మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసుల కూంబింగ్..

    • మావోయిస్టులు పారిపోయారని ప్రచారం..

    • మావోయిస్టుల సామగ్రి గుర్తించిన గ్రేహౌండ్స్ బలగాలు..

    పూర్తి కథనం..


  • Feb 09, 2026 09:28 IST

    భారత్-పాక్ టీ20 మ్యాచ్‌పై నేడు కీలక సమావేశం

    • లాహోర్‌లో సమావేశం కానున్న ఐసీసీ, పీసీబీ, బీసీబీ..

    • ఇప్పటికే భారత్‌తో మ్యాచ్ ఆడబోమన్న పాక్, బంగ్లాదేశ్..

    • పాకిస్తాన్ నిర్ణయాన్ని ఖండించిన ఐసీసీ..

    • నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కఠిన చర్యలు: ఐసీసీ


  • Feb 09, 2026 09:27 IST

    మదురైలో జల్లికట్టు పోటీలు..

    • మదురై తిరుప్పరంకుండ్రంలో జల్లికట్టు పోటీలు..

    • పోటీలు ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు..

    • పోటీల్లో 1,300 ఎద్దులు, 600 మంది యువకులు..


  • Feb 09, 2026 09:06 IST

    జగిత్యాలలో కరపత్రాల కలకలం

    • కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని వెలిసిన కరపత్రాలు..

    • కాంగ్రెస్ బీఫామ్ పొందిన 35మంది.. గతంలో BRS కౌన్సిలర్లు అంటూ కరపత్రాలు..


  • Feb 09, 2026 08:58 IST

    మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్..

    • మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం..

    • మున్సిపాలిటీల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం..

    • సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని..

    • పోలింగ్ ముగిసే వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం..


  • Feb 09, 2026 08:53 IST

    ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..14 మందికి తీవ్ర గాయాలు..

    • తిరుపతి: శ్రీకాళహస్తి పెద్దకన్నలి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..

    • 14 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు..

    • క్షత్రగాత్రులను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు..


  • Feb 09, 2026 08:53 IST

    గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు..

    • రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు అంబటి రాంబాబు తరలింపు..

    • పీటీ వారెంట్‌పై గుంటూరు కోర్టుకు తరలించిన పోలీసులు..

    • గత నవంబర్ 12న పట్టాభిపురం పీఎస్‌లో అంబటిపై కేసు..

    • అంబటిని గుంటూరు కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు..


  • Feb 09, 2026 07:47 IST

    శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు..

    • తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న హీరో తేజ సజ్జ, హీరోయిన్ శ్రీలీల..

    • సంగీత దర్శకుడు తమన్, సింగర్స్ శ్రీకృష్ణ, సాకేత్, సాహితీ చాగంటి, శ్రుతిరంజని..


  • Feb 09, 2026 07:26 IST

    అమెరికా కోర్టులో ట్రంప్‌నకు భారీ విజయం

    • బాండ్ హియరింగ్‌కు అనుమతి ఇవ్వకుండానే..

    • వలసదారులను నిర్బంధించే ట్రంప్‌ విధానాన్ని సమర్థించిన అప్పీల్స్ కోర్టు..


  • Feb 09, 2026 07:25 IST

    లారీని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి..

    • ఏలూరు: పెదవేగి మండలం చక్రాయగూడెం వద్ద లారీని వెనుక నుంచి ఢీకొన్న బైక్..

    • బైక్‌పై ఉన్న రాంబాబు(50) అనే వ్యక్తి మృతి, అతడి కుమార్తెకు గాయాలు..

    • ఏలూరులో జరిగే జాతరను చూసేందుకు వెళ్తుండగా ప్రమాదం..


  • Feb 09, 2026 07:12 IST

    సైబర్ నేరగాళ్ల వేధింపులకు మరొకరు బలి

    • ములుగు జిల్లా: సైబర్ నేరగాళ్ల వేధింపులకు మరొకరు బలి..

    • గడ్డి మందు తాగిన రామారావు, చికిత్స పొందుతూ మృతి..

    • తన ఫోన్ హ్యాక్ చేసి వేధిస్తున్నారని సూసైడ్ నోట్..

    • ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న రామారావు..

    • మృతుడి స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం..


  • Feb 09, 2026 06:12 IST

    నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు..

    • నేడు ఢిల్లీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..

    • ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్న చంద్రబాబు..


  • Feb 09, 2026 06:10 IST

    భారత్‌ పర్యటనలో గ్రీస్‌ రక్షణ మంత్రి నికోస్‌

    • నేడు ఢిల్లీలో రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నికోస్ భేటీ..

    • రక్షణ రంగంలో పరస్పర సహకారంపై చర్చ..


  • Feb 09, 2026 06:09 IST

    నేడు భూపాలపల్లిలో కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం..

    • నేడు భూపాలపల్లిలో మాజీ మంత్రి కేటీఆర్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం..

    • మధ్యాహ్నం పరకాల, మహబూబాబాద్‌లో కేటీఆర్‌ ప్రచారం..


  • Feb 09, 2026 06:07 IST

    నేటి సీఎం రేవంత్‌రెడ్డి మెదక్ సభ రద్దు

    • మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..

    • నేడు మెదక్ జిల్లాలో హరీష్‌రావు ఎన్నికల ప్రచారం..

    • ఖమ్మం: నేడు మధిరలో డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం..

    • కొత్తగూడెం, ఏదులాపురంలో పొంగులేటి ప్రచారం..

    • నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి, సూర్యాపేటలో ఉత్తమ్‌..

    • నిజామాబాద్‌లో మహేష్‌గౌడ్‌, ఎంపీ అర్వింద్‌ ఎన్నికల ప్రచారం..


  • Feb 09, 2026 06:05 IST

    నేటితో తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం బంద్‌

    • సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం..

    • నేడు చివరి రోజు కావడంతో హోరాహోరీగా పార్టీల ప్రచారం..

    • ఈ నెల 11న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌, 13న కౌంటింగ్‌..



  • Source link

    Spread the love