హైదరాబాద్‌లో పులి అవయవాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పులి గోర్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నారు..

టైగర్ ఆర్గాన్ ట్రాఫికింగ్
హైదరాబాద్, ఫిబ్రవరి 10: నగరంలో పులి అవయవాల అక్రమ రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) హైదరాబాద్ జోనల్ యూనిట్ నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్‌లో.. గ్రే మార్కెట్లో పులి అవయవాలను అమ్మకానికి ప్రయత్నిస్తున్న ముఠా పట్టుబడింది. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పులికి సంబంధించిన 7 గోర్లు , 3 కేనైన్ దంతాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ అవయవాలను బ్యాక్‌ప్యాక్‌లో జిప్‌లాక్ పౌచ్‌లో దాచిపెట్టి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. డీఆర్ఐ అధికారులు.. అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులను తెలంగాణ అటవీ శాఖకు అప్పగించారు. పులి అవయవాలతో పాటు, మొబైల్ ఫోన్లు, బ్యాగ్, ప్యాకింగ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి…
భార్య, అత్తామామలే కారణం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ సూసైడ్
టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంట్రీ..
తాజాగా చదవండి తెలంగాణ వార్తలు మరియు తెలుగు వార్తలు
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 10 , 2026 | 01:31 PM