సిబ్బంది సిద్ధం.. ఓటేసేందుకు వెళ్దాం | general


హుస్నాబాద్‌: పోలింగు నిర్వహణకు వచ్చిన సిబ్బంది

దుబ్బాక, చేర్యాల, గజ్వేల్, హుస్నాబాద్, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లాలోని నాలుగు పురపాలికలైన దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్, చేర్యాలలో బుధవారం జరగనున్న పుర ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్దమైంది.ఈ నెల 13వ తేదిన కౌంటింగ్, ఫలితాల ప్రకటన జరగనుంది. పుర ఎన్నికల్లో దుబ్బాకకు సంబంధించి తెలంగాణ ఆదర్శ పాఠశాల (లచ్చపేట), చేర్యాలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల(చేర్యాల), హుస్నాబాద్‌కు పీఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాల (హుస్నాబాద్‌), గజ్వేల్‌కు బాలికల ఎడ్యుకేషన్‌ హబ్‌ (గజ్వేల్‌)లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్‌ కేంద్రం, స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.బుధవారం ఆర్వోలు, పుర అధికారులు పీవో, ఏపీవోతో పాటు ఎన్నికల సిబ్బందికి అధికారులు పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేసి, పటిష్ట పోలీసుల భద్రత మధ్య వాహనాల్లో వారకి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు ప్రైవేట్‌ వాహనాల్లో తరలించారు.మంగళవారం దుబ్బాక పురపాలికలోని లచ్చపేట ఆదర్శ పాఠశాలలో పుర ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని, కౌంటింగ్‌ కేంద్రం, స్ట్రాంగ్‌ రూమ్‌ను జిల్లా పాలనాధికారి కె.హైమావతి, జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మస్రత్‌ ఖానమ్‌ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. (ఇతర ఓటర్లు హుస్నాబాద్‌లో 6 మంది, గజ్వేల్‌లో ఒకరు ఉన్నారు.)

శిశువుతో ఉపాధ్యాయిని



Source link

Spread the love