- బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన
- రెండు కీలక బిల్లులు కేంద్రానికి పంపిన తెలంగాణ అసెంబ్లీ
- రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో పరిశీలన
- కేంద్ర నిర్ణయంపైనే బీసీ వర్గాల రాజకీయ, ఉపాధి భవిష్యత్తు

తెలంగాణ బీసీ రిజర్వేషన్లు : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ఇప్పుడు కేంద్రం పరిధిలోకి చేరింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు , స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న స్థాయి నుండి 42 శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది, దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చూపుతుంది. లోక్‌సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బీఎల్ వర్మ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, తెలంగాణ శాసనసభ కార్యదర్శి నుంచి బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రెండు బిల్లులు కేంద్రానికి అందాయని స్పష్టం చేశారు. ఈ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయని, కేంద్రం వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఆయన పేర్కొన్నారు.
OnePlus ధమాకా..! రూ.16 వేలకే అదిరిపోయే ట్యాబ్.. మిస్ అవ్వకండి.!
రిజర్వేషన్ల శాతం పెంచడం అనేది రాజ్యాంగపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఈ రెండు బిల్లులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రపతి భవన్‌కు పంపడం. తెలంగాణలోని బీసీ వర్గాలకు సామాజిక న్యాయం చేకూర్చే విధంగా ఉంది 42 శాతం కోట్లు అమలు చేయాలన్న ప్రతిపాదనపై కేంద్రం వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం ఈ బిల్లులు పరిశీలనలో ఉన్నాయని, తదుపరి చర్యలు రాష్ట్రపతి ఆమోదంపై కొనసాగుతున్నాయని మంత్రి. ఈటల రాజేందర్ వేసిన ఈ ప్రశ్నతో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియపై రాష్ట్రంలో నెలకొన్న సందిగ్ధతకు కొంత తెరపడినట్లయింది. కేంద్రం తీసుకునే తదుపరి నిర్ణయం తెలంగాణలో బీసీ సామాజిక వర్గాల రాజకీయ , ఉపాధి భవిష్యత్తు ఉంది.
ఘుమఘుమలాడే ‘తలకాయ కూర’.. అమ్మ చేతి వంటలా రుచిగా రావాలంటే ఇలా చేయండి.!