ఫిబ్రవరి 11, 2026 1:53 PM IST
వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్
హిందూ మతాన్ని.. వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది: ఏపీ డిప్యూటీ సీఎం
దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ హిందూ మతాన్ని గౌరవిస్తారు..
ఏపీలో జగన్ అండ్ కో కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఫిబ్రవరి 11, 2026 1:48 PM IST
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ
ఖమ్మం: ఏదులాపురం జలగంనగర్ పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత..
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ..
అడ్డుకున్న పోలీసులపై తిరగబడిన BRS కార్యకర్తలు..
పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం..
ఫిబ్రవరి 11, 2026 1:46 PM IST
ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళ్తోంది: రాహుల్ గాంధీ
లోక్‌సభ సమావేశాలు: ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళ్తోంది: రాహుల్ గాంధీ
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఏఐ ప్రమాదం ఉందని అంటున్నారు..
ప్రతిభావంతులైన యువతరం భారత్‌కు పెద్ద ఆస్తి..
చైనా, భారత్.. ప్రపంచంలో అతిపెద్ద డేటా కేంద్రాలు..
వ్యవసాయరంగంలో ఆహారోత్పత్తి భారత్‌కు సానుకూలాంశం: రాహుల్ గాంధీ
ఫిబ్రవరి 11, 2026 1:30 PM IST
రూ.35 లక్షల విలువైన 70 కిలోల గంజాయి సీజ్..
హైదరాబాద్‌లో రూ.35 లక్షల విలువైన 70 కిలోల ఎండు గంజాయి సీజ్..
వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్..
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్
ఒడిశాలో పండించిన గంజాయిని హైదరాబాద్‌లో విక్రయించాలని ప్లాన్..
ఫిబ్రవరి 11, 2026 1:21 PM IST
వైసీపీ అవకాశం ఇవ్వకపోతే… సొంతంగా పోటీ చేస్తా: దువ్వాడ శ్రీనివాస్
అమరావతి: వైసీపీ అవకాశం ఇవ్వకపోతే.. సొంతంగా పోటీ చేస్తా: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత.. మొదటిసారి సమావేశాలకు హాజరైన ఎమ్మెల్సీ..
మండలిలో నా వాణి వినిపిస్తాను.. జగన్‌ని త్వరలోనే కలుస్తాను..
లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతా: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
ఫిబ్రవరి 11, 2026 1:03 pm IST
అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్‌డీఏ పక్షాల సమావేశం
అమరావతి: అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్‌డీఏ పక్షాల సమావేశం ప్రారంభం..
హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు..
ఫిబ్రవరి 11, 2026 12:44 IST
అసెంబ్లీలో రేపటి నుంచి ఏఐ అటెండెన్స్..
అమరావతి: అసెంబ్లీలో రేపటి నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్ అమల్లోకి వస్తుంది: స్పీకర్
పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలే బయోమెట్రిక్ వాడుతున్నారు..
పార్లమెంట్‌లో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉంది..
సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదు అవుతుంది: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
ఫిబ్రవరి 11, 2026 12:30 IST
ఉద్దేశపూర్వకంగానే లేఖలు రాసి ఉంటారు: మంత్రు కందుల దుర్గేష్
అమరావతి: నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు..
సత్యకుమార్, అనగాని, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్‌కు బెదిరింపు లేఖలు..
బెదిరింపు లేఖ చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు: మంత్రి కందుల దుర్గేష్
మావోయిస్టులు లేఖ రాయాల్సినంత హడావిడి ఏముంది?..
ఎవరో ఉద్దేశపూర్వకంగానే రాసి ఉంటారు: మంత్రు కందుల దుర్గేష్
ఫిబ్రవరి 11, 2026 12:24 IST
మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఈ నెల 14, 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ..
మహాశివరాత్రి తర్వాత 16వ తేదీ సెలవు..
17 పని దినాలు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు..
అవసరమైతే పనిదినాలు పొడిగించాలని నిర్ణయం..
మొత్తం 6 ఆర్డినెన్స్‌లు ప్రవేశపెట్టాలని నిర్ణయం..
ఫిబ్రవరి 11, 2026 12:15 IST
ముగిసిన బీఏసీ సమావేశం
ఫిబ్రవరి 11, 2026 12:13 IST
సంగారెడ్డిలోని ప్రైవేట్ స్కూల్లో అగ్నిప్రమాదం
సంగారెడ్డి: పోతిరెడ్డిపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో అగ్నిప్రమాదం..
భారీగా వ్యాపించిన మంటలు, అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది..
స్కూల్‌కు సెలవు కావడంతో తప్పిన ప్రమాదం..
ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానం..
ఫిబ్రవరి 11, 2026 11:56 IST
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
సభాపతి అధ్యక్షతన బీఏసీ సమావేశం..
అసెంబ్లీ అజెండా ఖరారు చేయనున్న బీఏసీ..
ఫిబ్రవరి 11, 2026 11:55 IST
అసెంబ్లీ లాబీలో మీడియాతో స్పీకర్ సరదా వ్యాఖ్యలు
11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారు: స్పీకర్
అంతకు మించి ఎక్కువ సమయం లేరుగా..
సభ్యులు సభా సంప్రదాయాలు పాటిస్తే మంచిది: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
ఫిబ్రవరి 11, 2026 11:49 IST
అసెంబ్లీ సమావేశాల వేళ కొత్త సంప్రదాయానికి లోకేష్ శ్రీకారం
అమరావతి: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందు సమావేశాలు..
రోజుకో పార్లమెంట్ పరిధిలోని… ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులతో డిన్నర్ సమావేశాలు..
నేతల యోగక్షేమాలు, సమస్యలు తెలుసుకుని పరిష్కారాలకు దిశా నిర్దేశాలు..
ఫిబ్రవరి 11, 2026 11:31 IST
ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన బీఏసీ సమావేశం..
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన బీఏసీ సమావేశం..
అసెంబ్లీ పనిదినాలు, ప్రవేశపెట్టే బిల్లులు, బడ్జెట్ తదితర అంశాలపై చర్చ..
స్పీకర్ అధ్యక్షతన జరిగిన భేటీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు..
ఫిబ్రవరి 11, 2026 11:27 IST
ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారో సీఎం చెప్పాలి: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డివి ఊకదంపుడు ప్రసంగాలు మాత్రమే..
కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి భయపడుతున్నారా?.. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోరా?
రేవంత్‌కు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్
ఫిబ్రవరి 11, 2026 11:22 IST
మరింత పెరిగిన కొలంబో విమాన టికెట్ ధరలు
ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్..
ఢిల్లీ, ముంబై నుంచి కొలంబోకు.. రూ.లక్ష మార్క్‌ను దాటిన విమాన టికెట్ ధరలు
ఫిబ్రవరి 11, 2026 11:05 IST
మంత్రి కందుల దుర్గేష్‌కు వచ్చిన బెదిరింపు లేఖపై సందేహాలు
అమరావతి: మావోయిస్టుల పేరుతో మంత్రి కందుల దుర్గేష్‌కు వచ్చిన బెదిరింపు లేఖపై సందేహాలు..
ఈ లేఖ మావోయిస్టులు రాశారా.. లేక వేరే కోణం ఏదైనా ఉందా అనే దానిపై అనుమానాలు..
కందుల దుర్గేష్ ఫిర్యాదుతో పోలీసుల విచారణ..
ఫిబ్రవరి 11, 2026 10:58 IST
జీరో పావర్టీ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వ పాలన: గవర్నర్
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టంతో అన్ని కుటుంబాలకూ ప్రయోజనం: గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
త్వరలో ఫ్యామిలీ కార్డు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు..
P4 ద్వారా పేద, ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు తగ్గించేందుకు కృషి..
పేదల ఆకలి తీర్చేందుకు 113 నియోజకవర్గాల్లో 205 అన్న క్యాంటీన్లు: గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
ఫిబ్రవరి 11, 2026 10:23 IST
ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యుల వాకౌట్..
అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే సభ నుంచి వెళ్లిపోయిన వైసీపీ సభ్యులు
11 నిమిషాల్లోనే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్, వైసీపీ సభ్యులు
జై జగన్ అంటూ అసెంబ్లీ వెలుపుల వైసీపీ సభ్యుల నినాదాలు..
ఫిబ్రవరి 11, 2026 10:10 IST
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ..
అమరావతి: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ..
అసెంబ్లీలో నేరుగా పవన్ కళ్యాణ్ ఛాంబర్‌కు వెళ్లిన లోకేష్..
తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ..
అరగంట తర్వాత భేటీలో పాల్గొన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..
ఫిబ్రవరి 11, 2026 10:04 IST
అసెంబ్లీ లాబీల్లో వైసీపీ సభ్యుల నినాదాలు..
అమరావతి: అసెంబ్లీ లాబీల్లో వైసీపీ సభ్యుల నినాదాలు..
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలి అంటూ నినాదాలు..
ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు..
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను నిలిపేయాలంటూ నినాదాలు..
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. పార్టీ కండువాలు వేసుకుని అసెంబ్లీలోకి ప్రవేశం..
ఫిబ్రవరి 11, 2026 09:19 IST
నాలుగో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
నంద్యాల: శ్రీశైలంలో నాలుగో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ..
సాయంత్రం టీటీడీ నుంచి రానున్న పట్టు వస్త్రాలు..
సాయంత్రం మయూరవాహనంపై స్వామిఅమ్మవార్ల దర్శనం..
రాత్రి క్షేత్ర పుర వీధుల్లో గ్రామోత్సవం..
ఫిబ్రవరి 11, 2026 08:34 IST
మూడు కార్పొరేషన్లకు కమిషనర్లు వీరే..
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సృజన.
మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి.
మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా జయేష్ రంజన్ నియామకం.
కొత్త పాలకమండలి వచ్చే వరకు స్పెషల్ ఆఫీసర్‌గా జయేష్ రంజన్.
మల్కాజ్‌గిరి జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్.పంకజ.
హైదరాబాద్ ఈడీగా సామ్రాట్ అశోక్, సైబరాబాద్ ఈడీగా ఎం.సంతోష్.
లోక్‌భవన్ జాయింట్ సెక్రటరీగా కె.కిరణాచారి..
ఫిబ్రవరి 11, 2026 08:34 IST
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ..
జీహెచ్ఎంసీతో పాటూ సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లు..
3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
ఫిబ్రవరి 11, 2026 08:31 IST
నారాయణపేట: మక్తల్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ఫిబ్రవరి 11, 2026 08:26 IST
జలమండలి పరిధి విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
ఓఆర్ఆర్ పరిధిలో నీటి సరఫరా, సివరేజ్ నిర్వహణ బాధ్యత జలమండలికి బదిలీ..
జీహెచ్ఎంసీ నుంచి జలమండలికి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశం..
నీటి సరఫరా, మురుగు వ్యవస్థల నిర్వహణ చేపట్టనున్న జలమండలి..
మౌలిక వసతుల అభివృద్ధి కూడా చేపట్టనున్న జలమండలి..
ఫిబ్రవరి 11, 2026 08:24 IST
నేడు మధ్యాహ్నం ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
పలవురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం రేవంత్.
తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ..
కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వనున్న సీఎం రేవంత్..
ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్‌రెడ్డి కలిసే అవకాశం..
ఫిబ్రవరి 11, 2026 08:23 IST
నేడు 11వ రోజు పార్లమెంట్ సమావేశాలు
ఉభయసభల్లో కేంద్ర బడ్జెట్‌పై చర్చ..
అవిశ్వాసం నోటీస్‌తో సమావేశాలకు స్పీకర్ దూరం..