ఆ దేశానికి భారీగా బొగ్గు సరఫరా చేయబోతున్నాం
ట్రంప్ స్పష్టీకరణ
వాషింగ్టన్: భారత్‌తో వాణిజ్య ఒప్పంద చరిత్రాత్మకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించింది. దీనివల్ల ఆ దేశానికి బొగ్గు సరఫరా పెరుగుతుందని. ‘మన నాయకత్వంలో అమెరికా అతి పెద్ద ఇంధనం ఎగుమతిదారుగా అవతరిస్తోంది. గడచిన కొన్ని నెలల్లో భారత్, జపాన్, కొరియాలతో చరిత్రాత్మక ఒప్పందాలను కుదుర్చుకున్నాం. దీనివల్ల మన బొగ్గు ఎగుమతులు నాటకీయ రీతిలో పెరుగుతున్నాయి’ అని వివరించారు. బుధవారం ‘ఛాంపియన్ ఆఫ్ కోల్’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం మనం ప్రపంచం మొత్తానికి బొగ్గును ఎగుమతి చేస్తున్నాం. మన బొగ్గు నాణ్యత ప్రపంచంలోనే గొప్పది’ అని ట్రంప్ అన్నారు.
ట్రంప్‌నకు ప్రతినిధుల సభలో షాక్
అమెరికా ప్రతినిధుల సభలో అధ్యక్షుడు ట్రంప్‌నకు షాక్ తగిలింది. సభలో రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉన్నా కెనడాపై అధ్యక్షుడు విధించిన సుంకాలను వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. దీంతో ట్రంప్ సుంకాలపై సంతకాల ఎజెండాను రిపబ్లికన్ పార్టీ సభ్యులు కొందరు తొలిసారిగా వ్యతిరేకించారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో 219-211 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం పొందింది. దీంతోపాటు సుంకాలను విధించేందుకు ట్రంప్ ప్రకటించిన జాతీయ అత్యవసర స్థితినీ ఈ తీర్మానం ఎత్తివేయాలని కోరింది. తదుపరి ఇది సెనెట్‌కు వెళ్లనుంది. అక్కడ ఓటింగ్ జరుగుతుంది. అయితే దీనికి ట్రంప్ మద్దతు తప్పనిసరి. అందువల్ల అది ఆమోదం పొందలేదు.