ఫిబ్రవరి 14, 2026 2:24 PM IST
ముంబైలో కుప్పకూలిన నిర్మాణంలోని మెట్రో పిల్లర్
నలుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు.
ములుంద్ వెస్ట్ మెట్రో స్టేషన్ దగ్గర ఘటన.
శిథిలాల కింద చిక్కుకున్న పలువురు.
ధ్వంసమైన పలు వాహనాలు.
ఫిబ్రవరి 14, 2026 2:23 pm IST
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల జోష్..
ZPTC, MPTC ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్.
సాయంత్రం మంత్రులతో సమావేశంకానున్న సీఎం రేవంత్‌రెడ్డి.
ఫిబ్రవరి 14, 2026 2:21 PM IST
త్వరలో తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త!
ఈ నెల 17న రైతు భరోసా విడుదల చేయనున్న ప్రభుత్వం.
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే రూ.9 వేల కోట్లు సమీకరించిన తెలంగాణ ప్రభుత్వం.
ఫిబ్రవరి 14, 2026 2:20 PM IST
బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది: ఎంపీ అర్వింద్
నిజామాబాద్ కార్పోరేషన్లో ప్రతిపక్షంగానే ఉంటాం.
ఎప్పటికైనా ఇందూరులో మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంటుంది.
ఎవరు పార్టీ మారినా పదవులకు రాజీనామా చేసి వెళ్లాలి.
ఫిబ్రవరి 14, 2026 2:19 PM IST
హైదరాబాద్: కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ
బీఆర్ఎస్ గెలిచిన మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికపై చర్చ.
పాల్గొన్న కేటీఆర్, హరీష్‌రావు, పలువురు నేతలు.
ఫిబ్రవరి 14, 2026 2:18 PM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందన..
ఫిబ్రవరి 14, 2026 2:16 PM IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్ చోరీ కేసులో మరో అరెస్ట్
మాస్టర్ మైండ్‌గా నేపాల్‌కు చెందిన భీమ్లా ఉన్నట్టు గుర్తింపు.
హైదరాబాద్‌లో అనేక నేపాలీ గ్యాంగ్ చోరీల్లో భీమ్లా కీలక పాత్ర.
నేపాల్ పారిపోతుండగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.
ఫిబ్రవరి 14, 2026 2:10 PM IST
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
రూ.1,60,504 కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
అసోంలో అండర్ వాటర్ రివర్ టన్నెల్‌కు గ్రీన్‌సిగ్నల్.
గుడెబెళ్లూరు-మహబూబ్‌నగర్ మధ్య 4లైన్ల హైవేకు ఆమోదం.
హైదరాబాద్ పనాజీ కారిడార్‌లో భాగంగా కొత్త 4లైన్ల రోడ్డు నిర్మాణం.
మూడు కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.
ఢిల్లీ-అంబాల, కసారా-మన్మాడ్, బళ్లారి-హోస్పేట్ మధ్య రైల్వేలైన్లు ఏర్పాటు.
ఫిబ్రవరి 14, 2026 11:13 IST
పుల్వామా ఉగ్రదాడికి నేటితో ఏడేళ్లు
ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి.
అమరవీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు.
అమరవీరులను స్మరించుకున్న ప్రధాని మోదీ.
ఫిబ్రవరి 14, 2026 10:59 IST
కరీంనగర్లో మేయర్ పదవి కోసం ఒక్కటైన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం
ఇండిపెండెంట్ కార్పోరేటర్‌కు మేయర్ పదవిని ఆఫర్ చేసిన 3 పార్టీలు.
సదరు కార్పోరేటర్తో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల రహస్య మంతనాలు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం తీరును తీవ్రంగా పరిగణిస్తున్న బీజేపీ.
ఫిబ్రవరి 14, 2026 09:36 IST
నాగర్‌కర్నూల్: తిమ్మన్నపల్లి శివారులో రోడ్డుప్రమాదం
కల్వర్టును ఢీకొట్టిన క్రూజర్ వాహనం, ముగ్గురు మృతి.
పలువురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఘటన.
ఫిబ్రవరి 14, 2026 08:34 IST
ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
ఆర్థిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్.
11:15 గంటలకు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల.
మండలిలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అనిత.
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు.
మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అనగాని సత్యప్రసాద్.
ఫిబ్రవరి 14, 2026 07:57 IST
నంద్యాల: శ్రీశైలంలో ఏడవ రోజుకు చేరుకున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
సాయంత్రం గజావాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకొనున్న ఆది దంపతులు.
రాత్రి క్షేత్ర పురవీధులలో స్వామి అమ్మవారికి వైభవంగా గ్రామోత్సవం.
ఫిబ్రవరి 14, 2026 07:46 IST
జగిత్యాల ఛైర్ పర్సన్ ఎవరికి?
ఎవరికీ రాని మ్యాజిక్ ఫిగర్ స్థానాలు
జగిత్యాలలో 50 వార్డుల్లో 18 సంజయ్, 17 జీవన్ రెడ్డి వర్గం గెలుపు.
పార్టీ బీ ఫామ్‌పై గెలిచిన అభ్యర్థుల్లో రెండు వర్గాలుగా చీలిక.
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో నాటకీయ పరిమాణం.
ఫిబ్రవరి 14, 2026 07:43 IST
యాదాద్రి: చౌటుప్పల్ ఎల్లగిరి వద్ద బృందావన్ కెమికల్ కంపెనీలో పేలిన రియాక్టర్
పేలుడు దాటికి భారీ శబ్దం, ఉలిక్కిపడిన సమీప గ్రామ ప్రజలు, స్థానికులు.
ఏడు ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది.
రియాక్టర్ పేలుడుతో దెబ్బతిన్న కంపెనీ భవనం.
కార్మికుల షిఫ్ట్ చేంజ్ సమయంలో ప్రమాదం జరగడంతో తప్పిన పెను ప్రమాదం.
ఫిబ్రవరి 14, 2026 07:38 IST
ఈ నెల 16న అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన
అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న బిల్ గేట్స్.
ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించనున్న బిల్ గేట్స్.
ఫిబ్రవరి 14, 2026 07:10 IST
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాక వాయిదా పడనున్న ఉభయసభలు
రేపు, ఎల్లుండి చట్టసభలకు సెలవు
ఈ నెల 17న బడ్జెట్‌పై చర్చ అజెండాగా పునఃప్రారంభం కానున్న ఉభయసభలు
ఫిబ్రవరి 14, 2026 07:02 IST
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
ఉ.10:30కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ
ఏపీ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనున్న మంత్రివర్గం
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి వంగలపూడి అనిత
మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అనగాని
ఫిబ్రవరి 14, 2026 06:52 IST
అమరావతి: నేడు ఏపీ బడ్జెట్
నేడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
వ్యవసాయ శాఖకు సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు
ఫిబ్రవరి 14, 2026 06:46 IST
నేడు అసోంలో ప్రధాని మోదీ పర్యటన
రూ.5,450 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
దిబ్రూగఢ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీకి చర్యలు
గువాహటిలో కుమార్ భాస్కర్ వర్మ సేతు ప్రారంభం