జాతీయ రహదారి-167 విస్తరణకు కేంద్రమంత్రివర్గం ఆమోదం


LIVE FEED

8:10 PM, 14 Feb 2026 (IST)

ఈ- కార్‌ రేస్‌ కేసులో ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి

  • ఫార్ములా ఈ- కార్‌ రేస్‌ కేసులో కీలక పరిణామం
  • ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి
  • కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గతంలోనే గవర్నర్ అనుమతి
  • ఈ-కార్‌ రేస్‌ కేసులో త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్న ఏసీబీ

8:09 PM, 14 Feb 2026 (IST)

జాతీయ రహదారి-167 విస్తరణకు కేంద్రమంత్రివర్గం ఆమోదం

  • జాతీయ రహదారి-167 విస్తరణకు కేంద్రమంత్రివర్గం ఆమోదం
  • జాతీయరహదారి-167కు రూ 3,175 కోట్లు మంజూరు
  • గూడవల్లూరు-మహబూబ్‌నగర్ మధ్య 4 లేన్ల రోడ్డు నిర్మాణానికి నిధులు
  • నిధులు ఇవ్వటంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ డీకే అరుణ

8:09 PM, 14 Feb 2026 (IST)

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై నేతలతో చర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి

  • మంత్రులు, సీనియర్ నేతలతో ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
  • మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై నేతలతో చర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి
  • హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకోవటంపై సీఎం దిశానిర్దేశం
  • మేయర్‌, ఛైర్మన్ల పదవులపై మంత్రులు, సీనియర్‌ నేతలకు దిశానిర్దేశం

7:35 PM, 14 Feb 2026 (IST)

రేపటితో ముగియనున్న 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన

  • రేపటితో ముగియనున్న 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన
  • నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్‌
  • నాంపల్లిలో ఏటా 45 రోజులపాటు జరుగుతున్న పారిశ్రామిక ప్రదర్శన
  • వారాంతం కావడంతో నుమాయిష్‌కు పోటెత్తిన సందర్శకులు

7:35 PM, 14 Feb 2026 (IST)

సీఎంను కలిసిన వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన 8 మంది కౌన్సిలర్లు

  • సీఎంను కలిసిన వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన 8 మంది కౌన్సిలర్లు
  • సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు
  • వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో సీఎంను కలిసిన ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్లు
  • సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు, మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవితో భేటీ
  • కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన వడ్డేపల్లి ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్లు

7:22 PM, 14 Feb 2026 (IST)

జగిత్యాల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ పీఠంపై ఉత్కంఠ

  • జగిత్యాల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ పీఠంపై ఉత్కంఠ
  • ఛైర్‌పర్సన్‌ పదవి కోసం కాంగ్రెస్‌లోనే రెండువర్గాల పోటీ
  • సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి వర్గం, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మధ్య పోటీ
  • తమవర్గం సభ్యులతో వేర్వేరుగా క్యాంపులు నడుపుతున్న ఇరువురు నేతలు
  • 23 మంది కౌన్సిలర్లను శిబిరానికి తరలించిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌
  • తనవర్గం 14 మందిని హైదరాబాద్‌ తీసుకెళ్లిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

6:33 PM, 14 Feb 2026 (IST)

మంత్రులు, సీనియర్‌ నేతలతో ప్రారంభమైన సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

  • మంత్రులు, సీనియర్‌ నేతలతో ప్రారంభమైన సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
  • జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం, మంత్రుల సమావేశం
  • ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క
  • క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
  • కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై చర్చ
  • ప్రధానంగా 38 హంగ్ మున్సిపాలిటీలపై నేతలు చర్చ
  • 20కి పైగా హంగ్ మున్సిపాలిటీలు హస్తగతం అవుతాయని అంచనా

5:59 PM, 14 Feb 2026 (IST)

పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.80 శాతం ఓట్లు

  • పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.80 శాతం ఓట్లు
  • పురపాలిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 28.75 శాతం ఓట్లు
  • పురపాలిక ఎన్నికల్లో బీజేపీకి 15.67 శాతం ఓట్లు
  • పురపాలిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు 8.30 శాతం ఓట్లు
  • పురపాలిక ఎన్నికల్లో ఎంఐఎంకు పార్టీకి 3.28 శాతం ఓట్లు
  • పురపాలిక ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీకి 1.51 శాతం ఓట్లు
  • పురపాలిక ఎన్నికల్లో సీపీఐకి 1.30 శాతం ఓట్లు
  • పురపాలిక ఎన్నికల్లో సీపీఎంకు 0.58 శాతం ఓట్లు
  • పురపాలిక ఎన్నికల్లో జనసేన పార్టీకి 0.35 శాతం ఓట్లు

4:52 PM, 14 Feb 2026 (IST)

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు

  • ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు
  • బీఆర్‌ఎస్‌లో చేరిన ఇంద్రేశం మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్‌ లావణ్య
  • బీఆర్‌ఎస్‌లో చేరిన ఇస్నాపూర్‌ 10వ వార్డు కౌన్సిలర్ రాహుల్‌రెడ్డి
  • స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన లావణ్య, రాహుల్‌రెడ్డి

4:34 PM, 14 Feb 2026 (IST)

అత్తాపూర్‌లో అడ్వకేట్ ఖదీర్ దారుణహత్య

  • హైదరాబాద్‌: అత్తాపూర్‌లో అడ్వకేట్ ఖదీర్ దారుణహత్య
  • అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్‌ను కత్తులతో పొడిచి చంపిన దుండగులు
  • లాయర్‌ ఖదీర్‌ను కత్తులతో పొడిచి పరారైన దుండగులు
  • కుటుంబ విభేదాలతో బంధువులే చంపినట్లు అనుమానం
  • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

2:34 PM, 14 Feb 2026 (IST)

30పైగా మున్సిపాలిటీలు గెలుస్తామని అనుకున్నాం..కొంత తగ్గింది: కేటీఆర్‌

  • ఎక్స్‌అఫీషియో ఓట్ల నమోదుపై సీఎస్, ఎస్‌ఈసీతో మాట్లాడాం: కేటీఆర్‌
  • 30పైగా మున్సిపాలిటీలు గెలుస్తామని అనుకున్నాం..కొంత తగ్గింది: కేటీఆర్‌
  • హంగ్ వచ్చిన చోట కూడా మాకు అనుకూలంగా ఉంటుంది: కేటీఆర్‌
  • కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదు: కేటీఆర్‌
  • కరీంనగర్, నిజామాబాద్ మినహాయిస్తే బీజేపీ ప్రభావం ఎక్కడా లేదు: కేటీఆర్‌
  • స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు: కేటీఆర్‌
  • స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదు: కేటీఆర్‌

2:32 PM, 14 Feb 2026 (IST)

కరీంనగర్‌లో బీజేపీ విజయం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కే అంకితం: బండి సంజయ్‌

  • మీడియా చిట్‌చాట్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
  • కరీంనగర్‌లో బీజేపీ విజయం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కే అంకితం: బండి సంజయ్‌
  • కరీంనగర్‌లో బీజేపీకి 13 సీట్లే వస్తాయని స్టేట్ ఇంటెలిజెన్స్‌ సీఎంకు నివేదిక ఇచ్చిందట: బండి సంజయ్‌
  • ఇకనైనా సీఎం రేవంత్‌రెడ్డి కళ్లు తెరవాలి: బండి సంజయ్‌
  • కరీంనగర్‌లో మేయర్ పదవి కోసం గుంట నక్కలు ఒక్కటయ్యాయి: బండి సంజయ్‌

2:32 PM, 14 Feb 2026 (IST)

మాదాపూర్, హైటెక్‌సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యపై ఐదు శాఖల సంయుక్త కార్యాచరణ

  • మాదాపూర్, హైటెక్‌సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యపై ఐదు శాఖల సంయుక్త కార్యాచరణ
  • ట్రిడెంట్ హోటల్ నుంచి శిల్పారామం వరకు రోడ్డు విస్తరణ పనులు పరిశీలన
  • సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు, జలమండలి అధికారుల పరిశీలన
  • రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన ఇరిగేషన్, విద్యుత్, టీజీఐఐసీ అధికారులు

2:32 PM, 14 Feb 2026 (IST)

చౌటుప్పల్ పరిధి లింగోజిగూడెం వద్ద ప్రమాదం, బైకుపై వెళ్తున్న తండ్రి, కుమార్తెను ఢీకొన్న కంటైనర్‌

  • యాదాద్రి జిల్లా: చౌటుప్పల్ పరిధి లింగోజిగూడెం వద్ద ప్రమాదం
  • యాదాద్రి జిల్లా: బైకుపై వెళ్తున్న తండ్రి, కుమార్తెను ఢీకొన్న కంటైనర్‌
  • యాదాద్రి జిల్లా: కుమార్తె మృతి, తండ్రికి గాయాలు
  • హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఘటన
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చౌటుప్పల్ పోలీసులు

2:32 PM, 14 Feb 2026 (IST)

రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం

  • రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం
  • ఎస్‌ఈసీని కలిసిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం
  • మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్‌ఛైర్మన్లు ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి
  • ఎన్నికల నిబంధనలు పాటించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరిన బృందం
  • ఎక్స్‌అఫీషియో సభ్యుల నమోదుకు అవకాశం రేపటి వరకు పొడిగించాలని కోరిన బీఆర్ఎస్

2:32 PM, 14 Feb 2026 (IST)

బీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు బెల్లంపల్లి కౌన్సిలర్లు

  • హైదరాబాద్: బీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు బెల్లంపల్లి కౌన్సిలర్లు
  • బీఆర్‌ఎస్‌లో చేరిన బెల్లంపల్లి 26, 30వార్డు కౌన్సిలర్లు కుమారస్వామి, శంకర్‌
  • హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు
  • ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన 34 వ వార్డు బీజేపీ కౌన్సిలర్‌

2:32 PM, 14 Feb 2026 (IST)

ముంబయిలో కూలిన మెట్రో పిల్లర్‌ స్లాబ్‌, ఇద్దరికి తీవ్రగాయాలు

  • ముంబయి: కూలిన మెట్రో పిల్లర్‌ స్లాబ్‌
  • ముంబయి: మెట్రో పిల్లర్‌ స్లాబ్‌ కూలి ఇద్దరికి తీవ్రగాయాలు
  • ముంబయి: వాహనదారులపై కుప్పకూలిన మెట్రో పిల్లర్‌ స్లాబ్‌
  • ముంబయి: ఆటో రిక్షా, కారుపై పడిన మెట్రో పిల్లర్‌ స్లాబ్‌
  • ముంబయి: ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు

2:32 PM, 14 Feb 2026 (IST)

నందినగర్‌లో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ

  • హైదరాబాద్‌: నందినగర్‌లో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ
  • ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్‌పర్సన్‌ ఎన్నికలపై కేటీఆర్‌, హరీశ్‌రావు కసరత్తు
  • హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫీషియా ఓట్లపై కసరత్తు చేస్తున్న నేతలు

2:32 PM, 14 Feb 2026 (IST)

హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు

  • హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
  • చోరీ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వారంక్రితం సి.వి.రావు ఇనిస్టిట్యూట్‌లో చోరీకి గురైన ల్యాప్‌టాప్‌లు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు

1:01 PM, 14 Feb 2026 (IST)

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,500

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,500
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,60,000

12:24 PM, 14 Feb 2026 (IST)

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంది అక్రమ బంధం

బండి సంజయ్‌

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంది అక్రమ బంధం
  • కాంగ్రెస్‌, ఎంఐఎంది ఎంసీల్‌ బంధం

11:25 AM, 14 Feb 2026 (IST)

హంగ్‌ వచ్చిన మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి

  • సీఎం రేవంత్‌రెడ్డి :
  • హంగ్‌ వచ్చిన మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి
  • నిన్న రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించిన రేవంత్‌రెడ్డి
  • కొత్తగూడెం కార్పొరేషన్‌ ఫలితాలపై చర్చించినట్లు పార్టీ వర్గాల వెల్లడి
  • హంగ్‌ మున్సిపాలిటీల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సీనియర్లతో సీఎం సమాలోచనలు
  • నిఘా వర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
  • ఇవాళ సాయంత్రం మంత్రులు, పీసీసీ ముఖ్యనేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
  • జూబ్లీహిల్స్‌లోని మల్కాజిగిరి పార్లమెంటు కార్యాలయంలో సమావేశం
  • మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్న సీఎం, మంత్రులు
  • హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

10:25 AM, 14 Feb 2026 (IST)

కొత్తగూడెం కార్పొరేషన్‌లో మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, సీపీఐ వ్యూహాలు

కొత్తగూడెం :

  • కొత్తగూడెం కార్పొరేషన్‌లో మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, సీపీఐ వ్యూహాలు
    కొత్తగూడెం: మేజిక్ ఫిగర్ 31 స్థానాలు ఏ పార్టీకి రాకపోవడంతో హంగ్
    కొత్తగూడెంలో చెరో 22 డివిజన్లు గెలిచిన కాంగ్రెస్‌, సీపీఐ
  • కొత్తగూడెంలో బీఆర్‌ఎస్‌- 8, స్వతంత్రులు – 6 వార్డుల్లో విజయం
  • కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఎం, బీజేపీ ఒక్కో వార్డుల్లో విజయం
  • కొత్తగూడెంలో క్యాంపు రాజకీయాలతో ప్రధాన పార్టీలు వ్యూహాలు
    కాంగ్రెస్, సీపీఐ, బీఆర్‌ఎస్‌లో గెలిచిన అభ్యర్థులను శిబిరాలకు తరలింపు
  • బీఆర్ఎస్ నుంచి గెలిచిన సభ్యుడిని తమ వైపు తిప్పుకున్న కాంగ్రెస్
  • స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, సీపీఐ వ్యూహాలు
  • కొత్తగూడెం మేయర్ ఎంపిక నాటికి మారనున్న రాజకీయ సమీకరణాలు

10:23 AM, 14 Feb 2026 (IST)

ఆసక్తికరంగా మారిన భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ

పోచంపల్లి :

  • యాదాద్రి జిల్లా: ఆసక్తికరంగా మారిన భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ
  • నిన్నటి ఫలితాల్లో పోచంపల్లి మున్సిపాలిటీలో ఎవరికీ రాని స్పష్టమైన ఆధిక్యం
  • పోచంపల్లి: ఛైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 7
  • పోచంపల్లి: మొత్తం 13 స్థానాల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5
  • పోచంపల్లి: బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక్కస్థానంలో విజయం
  • ఎక్స్‌అఫీషియో ఓట్లతో మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు
  • బీజేపీ, స్వతంత్రుడి మద్దతుతో మున్సిపాలిటీని కైవసం కోసం బీఆర్ఎస్ కసరత్తు
  • పోచంపల్లి: ఇప్పటికే కౌన్సిలర్లను క్యాంపుకు తరలించిన ఇరుపార్టీలు
  • పోచంపల్లి: ఛైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు ఇస్తానంటున్న స్వతంత్రుడు

9:44 AM, 14 Feb 2026 (IST)

ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులకు నియోజకవర్గ పరిధిలో ఎక్స్ అఫీషియో ఓటు

  • ఎస్‌ఈసీ :
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్అఫీషియో ఓటుపై స్పష్టతనిచ్చిన ఎస్ఈసీ
  • ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులకు నియోజకవర్గ పరిధిలో ఎక్స్ అఫీషియో ఓటు
  • నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో ఓటు
  • ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే ఎమ్మెల్సీలకు ఎక్స్అఫీషియో ఓటు
  • ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే రాజ్యసభ సభ్యులకు ఎక్స్అఫీషియో ఓటు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్అఫీషియో ఓటు నమోదుకు నేటి వరకు అవకాశం

9:07 AM, 14 Feb 2026 (IST)

మహబూబ్‌నగర్‌: 53 డివిజన్‌లో ఒక్క ఓటు తేడాతో బీజేపీ అభ్యర్థి రమేశ్‌కుమార్‌ విజయం

మహబూబ్‌నగర్‌

  • మహబూబ్‌నగర్‌: 53 డివిజన్‌లో ఒక్క ఓటు తేడాతో బీజేపీ అభ్యర్థి రమేశ్‌కుమార్‌ విజయం
  • మహబూబ్‌నగర్‌: అర్ధరాత్రి వరకు కొనసాగిన 53వ డివిజన్‌ ఓట్ల లెక్కింపు
  • మహబూబ్‌నగర్‌: 53వ డివిజన్‌లో రెండుసార్లు రీకౌంటింగ్‌ అనంతరం విజేత ప్రకటన

9:06 AM, 14 Feb 2026 (IST)

సంగారెడ్డి జిల్లా: పోచారం వద్ద చెట్టును ఢీకొట్టిన కారు, ఒకరు మృతి

  • సంగారెడ్డి జిల్లా: పోచారం వద్ద చెట్టును ఢీకొట్టిన కారు, ఒకరు మృతి
  • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
  • మృతుడు ఇంద్రేశానికి చెందిన ముజీబుద్దీన్(28)గా గుర్తింపు

9:06 AM, 14 Feb 2026 (IST)

వికారాబాద్ జిల్లా కిష్టమ్మగుళ్లతండాలోని ఓ ఇంట్లో చోరీ

  • వికారాబాద్ జిల్లా: పరిగి మం. కిష్టమ్మగుళ్లతండాలోని ఓ ఇంట్లో చోరీ
  • ఓ ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు, రూ.30 వేలు ఎత్తుకెళ్లిన దుండగులు
  • వికారాబాద్ జిల్లా: పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు, కేసు నమోదు

7:24 AM, 14 Feb 2026 (IST)

నాగర్‌కర్నూల్‌ : ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి వద్ద ప్రమాదం

  • నాగర్‌కర్నూల్‌: ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి వద్ద ప్రమాదం
  • నాగర్‌కర్నూల్‌: కల్వర్టును ఢీకొన్న వ్యాన్‌, ముగ్గురు మృతి
  • ప్రమాద సమయంలో వ్యాన్‌లో 10 మంది ప్రయాణికులు
  • నాగర్‌కర్నూల్‌: మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు గుర్తింపు
  • మృతులు కర్ణాటకకు చెందిన మహాదేవి, మేఘా, రాంరెడ్డిగా గుర్తింపు

6:45 AM, 14 Feb 2026 (IST)

మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కైవసం

  • మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కైవసం
  • మహబూబ్‌నగర్‌లో 60 డివిజన్లకుగాను 29 చోట్ల కాంగ్రెస్‌ విజయం
  • మహబూబ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌-15, బీజేపీ-8 డివిజన్లలో గెలుపు
  • మహబూబ్‌నగర్‌లో ఎంఐఎం-03 ఇతరులు-05డివిజన్లలో విజయం

6:45 AM, 14 Feb 2026 (IST)

నేడు అనధికారంగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశం

  • నేడు అనధికారంగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశం
  • ఇవాళ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం
  • కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంత్రివర్గ భేటీ
  • ఇది అనధికార మంత్రివర్గ సమావేశమని ప్రభుత్వవర్గాల సమాచారం

6:43 AM, 14 Feb 2026 (IST)

రాత్రి చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

  • రాత్రి చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం
  • రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి ఎగిసిపడుతున్న మంటలు
  • భారీగా ఎగిసిపడుతున్న మంటలు, పలువురు కార్మికులకు గాయాలు
  • రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
  • రియాక్టర్ పేలిన భారీ శబ్దానికి భయాందోళనకు గురైన స్థానికులు



Source link

Spread the love