Kothagudem: కొత్తగూడెం మేయర్‌ పీఠంపై వీడిన ఉత్కంఠ


హైదరాబాద్‌: కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ పీఠంపై ఉత్కంఠ వీడింది. కాంగ్రెస్‌, సీపీఐ ఒక అవగాహనకు వచ్చాయి. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను చెరో రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని నిర్ణయించాయి. మొదటి రెండున్నరేళ్లు సీపీఐకి, ఆ తర్వాత కాంగ్రెస్‌కు మేయర్‌ పీఠం దక్కనుంది. కొత్తగూడెం కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమి (కాంగ్రెస్‌-22, సీపీఎం-1) 23 డివిజన్లలో విజయం సాధించింది. సీపీఐకి 22, బీఆర్‌ఎస్‌-8, భాజపా-1, స్వతంత్రులు 6 డివిజన్లలో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈనెల 16న మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనుంది.



Source link

Spread the love