
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగిలో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ శాయశక్తులా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. పరిగి మున్సిపాలిటీలో మొత్తం 18 స్థానాలుండగా.. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో 8 స్థానాలను గెలుచుకున్నాయి. మరో రెండు వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించారు. వీరిలో అక్కమ్మ అనే స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్కు, మరో అభ్యర్థి హనుమంత్ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు.
మున్సిపల్ పీఠం కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో ఎక్స్అఫీషియో సభ్యుడి ఓటు కీలకంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్గౌడ్ ఈ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కావడంతో ఆ పార్టీకే పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశాలున్నాయి.