బాల్క సుమన్ అరెస్ట్‌పై భగ్గుమన్న కేటీఆర్, హరీశ్‌రావు


మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో హింసాత్మక ఘటనలు చిచ్చు రేపాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్‌లపై రాళ్ల దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.

కేటీఆర్ వార్నింగ్: “క్యాతనపల్లిని దౌర్జన్యంగా కైవసం చేసుకోవాలనే కుట్రతో ఈ అక్రమ అరెస్టులు చేశారు. బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా, రేవంత్ సర్కార్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది.

హరీశ్‌రావు ఆగ్రహం: “బాల్క సుమన్ అరెస్ట్ అప్రజాస్వామికం. రాష్ట్రంలో కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతోంది. హంగ్ వచ్చిన ప్రతిచోటా అడ్డదారుల్లో పీఠాలను కబ్జా చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ తీరును తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుంది” అని హరీశ్‌రావు ఆరోపించారు.





Source link

Spread the love