ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 19: భారతదేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. భారీ పెరుగుదల తర్వాత గత రెండు వారాలుగా కనిపించిన తగ్గుదల ఇప్పుడు కనిపించడం లేదు. రెండు రోజులుగా బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. MCXలో బంగారం ఫ్యూచర్స్ సుమారు రూ.1.54 లక్షల వద్ద స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు భారతదేశంలో సగటు బంగారం ధరలు (ప్రధాన నగరాల ఆధారంగా): 24 క్యారెట్ బంగారం (1 గ్రాము): రూ. 15,419 – రూ.15,420 మధ్య ఉంది.
22 క్యారెట్ బంగారం (1 గ్రాము): రూ. 14,134 – రూ.14,135 మధ్య.. 18 క్యారెట్ బంగారం (1 గ్రాము): రూ. 11,564 – రూ.11,565 మధ్య కొనసాగుతోంది. ఇది 10 గ్రాముల ధరలు (సుమారుగా): 24K: రూ. 1,54,190 – రూ. 1,54,200, 22K: రూ. 1,41,340 – రూ. 1,41,350 మధ్య ఉంది.
ఇక, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లలో డాలర్ బలం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ ఆందోళనలు, జియోపాలిటికల్ టెన్షన్లు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. భారతదేశంలో వివాహాలు, పండుగలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
భారత్లోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు (1 గ్రాము ధర) ఈ విధంగా ఉన్నాయి. వరుసగా 24 క్యారెట్, 22 క్యారెట్ ధరలు..
హైదరాబాద్ రూ. 15,419(24 క్యారెట్) రూ. 14,134(22 క్యారెట్)
విజయవాడ రూ. 15,419 రూ. 14,134
చెన్నై రూ. 15,523 రూ. 14,229
బెంగళూరు రూ. 15,419 రూ. 14,134
కేరళ రూ. 15,419 రూ. 14,134
ముంబై రూ. 15,419 రూ. 14,134
ఢిల్లీ రూ. 15,434 రూ. 14,149
గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
బిల్గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 19, 2026 | 07:01 AM