జనాభా లెక్కల సేకరణ-2027లో జిల్లా ప్రిన్సిపాల్ సెన్సెస్ అధికారులైన కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వీవీఎల్ఎన్ శర్మ ఉన్నారు.

అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): జనాభా లెక్కల సేకరణ-2027లో జిల్లా ప్రిన్సిపాల్ సెన్సెస్ అధికారులైన కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వీవీఎల్ఎన్ శర్మ ఉన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రిన్సిపాల్ సెన్సెస్ అధికారులతో జనాభా లెక్కల సేకరణకు సన్నద్ధతపై ఆయన చర్చించారు. జనాభా లెక్కల సేకరణ మొదటి దశలో హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్, రెండో దశలో పాపులేషన్ ఎన్యుమరేషన్ జరుగుతుండగా. ఈ సారి జనాభా లెక్కల సేకరణ డిజిటల్ విధానంలో జరుగుతుందని చెప్పారు.
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 21 , 2026 | 04:32 AM