ఉత్తరప్రదేశ్.. మీరట్‌లో వేగవంతమైన మెట్రోని నేడు ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGCET-2026) ఉంది. నేడు గుంటూరులో సిఎం చంద్రబాబు పర్యటిస్తారు. పోస్టల్ శాఖ నిర్వహించే డాక్ సేవక్ సమ్మేళన్‌కి హాజరవుతారు. తిరుమలలో నేటి నుంచి మార్చి 2 వరకూ సాలకట్ల తెప్పోత్సవాలు జరుగుతాయి. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్.. సాయంత్రం 4కి రిలీజ్ అవుతుంది. T20 ప్రపంచ కప్‌లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లో ఇండియా vs సౌతాప్రికా మ్యాచ్ రాత్రి 7కి జరుగుతుంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.