ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్ | AP Telangana National International news ABN Andhrajyothy Live Updates of 21st February 2026 Suri



  • Feb 21, 2026 21:31 IST

    నిజామాబాద్‌: రేపు బాన్సువాడ, కామారెడ్డిలో టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు పర్యటన


  • Feb 21, 2026 21:29 IST

    టీ20 వరల్డ్‌ కప్‌: సూపర్‌-8లో తొలి మ్యాచ్‌ రద్దు

    • న్యూజిలాండ్‌ – పాకిస్థాన్‌ మ్యాచ్‌ రద్దు

    • కొలంబోలో భారీ వర్షంతో మ్యాచ్‌ రద్దు

    • ఒక్క బాల్‌ కూడా పడకుండా మ్యాచ్‌ రద్దు

    • న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌కు చెరో పాయింట్‌

    పూర్తికథనం


  • Feb 21, 2026 20:53 IST

    ట్రంప్ టారిఫ్‌‌ల రద్దుపై భారత్ స్పందన

    • యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు, ట్రంప్ స్పందనను పరిశీలిస్తున్నాం

    • పర్యవసనాలను విశ్లేషిస్తున్నామని చెప్పిన వాణిజ్య శాఖ


  • Feb 21, 2026 20:15 IST

    నల్లగొండ: జిల్లా ఆస్పత్రిలో విషాదం

    • ప్రసవం కోసం వెళ్లి గర్భిణి మృతి

    • నార్మల్ డెలివరీ చేస్తుండగా గర్భిణి మృతి

    • వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని బాధితుల ఆందోళన


  • Feb 21, 2026 19:44 IST

    విజయవాడ ఏసీబీ కోర్టులో వాసుదేవరెడ్డి రిమాండ్‌పై ముగిసిన వాదనలు

    • లిక్కర్‌ స్కాం కేసులో వాసుదేవరెడ్డి పాత్ర కీలకం: ప్రాసిక్యూషన్‌ లాయర్‌

    • వాసుదేవరెడ్డికి తెలిసే అక్రమాలు జరిగాయి

    • అప్రూవర్‌గా మారినంతమాత్రాన నిర్దోషిగా చూడలేం

    • వాసుదేవరెడ్డిని కస్టడీకి తీసుకుని మరింత సమాచారంసేకరించాల్సి ఉంది


  • Feb 21, 2026 19:40 IST

    ఏపీ లిక్కర్‌ స్కాం కేసు నిందితుడు వాసుదేవరెడ్డిని అరెస్టు చేసిన సిట్‌

    • ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో A2గా ఉన్న వాసుదేవరెడ్డి

    • లిక్కర్‌ స్కాం కేసులో కీలక నిందితుడు వాసుదేవరెడ్డి

    • రూ.3,500 కోట్ల స్కాంలో వాసుదేవరెడ్డి కీలక నిందితుడని సిట్‌ నివేదిక

    • వైసీపీ ప్రభుత్వంలో బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీగా వాసుదేవరెడ్డి

    పూర్తికథనం


  • Feb 21, 2026 19:36 IST

    6 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పూర్తి

    • గణనీయంగా ఓటర్ల తొలగింపు

    • గుజరాత్‌లో అత్యధికంగా 68 లక్షల ఓటర్ల తొలగింపు

    • మధ్యప్రదేశ్‌లో 34 లక్షల ఓటర్ల తొలగింపు

    పూర్తికథనం


  • Feb 21, 2026 19:10 IST

    రంగారెడ్డి: బండ్లగూడ జాగీర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 6 నెలల శిశువు మృతి

    • ప్రైవేట్‌ ఆస్పత్రి ఎదుట శిశువు తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన

    • కాలంతీరిన మందులే శిశువు మృతికి కారణమంటూ బంధువుల ఆరోపణ

    • వైద్యులపై దాడి చేసి ఫార్మసీ ధ్వంసం చేసిన శిశువు బంధువులు

    • ఆస్పత్రి సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు


  • Feb 21, 2026 18:53 IST

    నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం

    • ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్

    • ఆది, సోమవారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

    • ప్రకటించిన ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

    పూర్తికథనం


  • Feb 21, 2026 18:46 IST

    టీ20 ప్రపంచ కప్ 2026: తొలి సూపర్ 8 మ్యాచ్.. టాస్ నెగ్గిన పాకిస్థాన్

    • ప్రేమదాస స్టేడియంలో న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్

    • టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

    • తొలుత ఫీల్డింగ్ చేయనున్న న్యూజిలాండ్


  • Feb 21, 2026 17:21 IST

    మూడో టీ20లో ఆసీస్ చిత్తు.. సిరీస్ టీమిండియాదే

    • ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత మహిళల ఘన విజయం

    • 2-1 తేడాతో సిరీస్‌ను దక్కించుకున్న టీమిండియా

    పూర్తికథనం


  • Feb 21, 2026 17:10 IST

    షబ్బీర్‌ అలీ వల్లే నేను కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చా: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

    • నాకు వస్తున్న బెదిరింపులపై ఎస్పీకి ఫిర్యాదు చేశా

    • రేపటి నుంచి గ్రామాలకు వస్తా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా

    • రేపటి నుంచి యుద్ధమే.. దొంగలెవరో ప్రజలకు బాగా తెలుసు

    • నాకేమి జరిగినా సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత


  • Feb 21, 2026 17:00 IST

    మైక్రోసాఫ్ట్ గేమింగ్ నూతన సీఈఓగా ఆశా శర్మ

    • మైక్రోసాఫ్ట్‌లో భారత సంతతి టెకీకి ఉన్నత పదవి

    • ఫిల్ స్పెన్సర్ పదవీ విరమణ చేయడంతో ఆశా శర్మకు బాధ్యతలు

    • పలు అంతర్జాతీయ టెక్‌ కంపెనీలలో విధులు నిర్వర్తించిన ఆశా శర్మ

    పూర్తికథనం


  • Feb 21, 2026 16:56 IST

    నా బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పు ఉండబోదు: అభిషేక్ శర్మ

    • టీ20 ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా మూడుసార్లు డకౌట్ అయిన అభిషేక్

    • ఏది జరిగినా బ్యాటింగ్‌లో మార్పు ఉండదు: అభిషేక్ శర్మ

    పూర్తికథనం


  • Feb 21, 2026 16:48 IST

    నల్లగొండ: నకిరేకల్‌లో ఓ ఆటోమొబైల్ షాప్‌లో అగ్ని ప్రమాదం

    • షార్ట్ సర్క్యూట్‌తో షాపులో చెలరేగిన మంటలు

    • రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం

    • మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

    పూర్తికథనం


  • Feb 21, 2026 16:46 IST

    శ్రీవారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం దుర్మార్గం: ప్రత్తిపాటి పుల్లారావు

    • వేంకటేశ్వరునితో వైసీపీ పొలిటికల్ గేమ్ ఆడుతోంది

    • శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలన్నదే వైసీపీ లక్ష్యం

    • తప్పు చేస్తే శ్రీనివాసుడు కచ్చితంగా శిక్షిస్తారనేది చరిత్ర ఎరిగిన సత్యం

    పూర్తికథనం


  • Feb 21, 2026 16:44 IST

    అనకాపల్లి జిల్లాలో విషాదం..

    Car Accidents

    • బత్తివానిపాలెం గ్రామ సమీపంలో ప్రమాదం

    • చెట్టును ఢీకొన్న నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు

    • ప్రమాదంలో వరుడి చెల్లి మృతి

    • వధూవరులకు తీవ్ర గాయాలు


  • Feb 21, 2026 16:41 IST

    యూపీలో దారుణం: భార్యను కాల్చి చంపిన భర్త

    • సంగీత(30) అనే మహిళపై కాల్పులు జరిపిన ఆమె భర్త

    • రెండు బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే సంగీత మృతి

    • కోర్టులో పెడింగ్‌లో ఉన్న ఈ జంట విడాకుల కేసు

    • మృతురాలికి ఇద్దరు పిల్లలు

    పూర్తికథనం


  • Feb 21, 2026 16:40 IST

    డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

    • ఈ శిక్షణ డీసీసీలకు ఎంతో ఉపయోగపడుతుంది: సీఎం

    • పార్టీలో భిన్నాభిప్రాయాలు చెప్పే వారు ఉంటారు: రేవంత్ రెడ్డి

    • అందరం కలిసి పనిచేస్తేనే అనుకున్నది సాధించవచ్చు: సీఎం రేవంత్


  • Feb 21, 2026 16:33 IST

    టీ20 వరల్డ్‌ కప్‌: నేటి నుంచి సూపర్‌-8 మ్యాచ్‌లు

    • రాత్రి 7 గంటల నుంచి న్యూజిలాండ్‌ Vs పాకిస్థాన్‌

    • రేపు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఇంగ్లండ్‌ Vs శ్రీలంక

    • రేపు రాత్రి 7 గంటల నుంచి భారత్‌ Vs సౌతాఫ్రికా


  • Feb 21, 2026 15:46 IST

    వివేకా హత్యను గుండె పోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు: సీఎం చంద్రబాబు

    • నారాసుర రక్త చరిత్ర అంటూ నాపై నెపం నెట్టారు

    • వివేకా హత్య చుట్టూ నాటకాల రాయుడు నాటకాలు ఆడారు

    • నేరగాళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలి

    • ఇప్పుడు మళ్లీ ప్రతిచోటా ప్రజలను రెచ్చగొడుతున్నారు


  • Feb 21, 2026 15:44 IST

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌లో ఘోర ప్రమాదం

    • ట్రైన్ ఎక్కుతూ కింద పడి వ్యక్తి మృతి

    • సికింద్రాబాద్ నుంచి ఒంగోలు వెళ్లాల్సిన నాగరాజు

    • సింహపురి ఎక్స్ ప్రెస్ అని భావించి మరో ట్రైన్ ఎక్కబోయిన నాగరాజు

    • ప్రమాదవశాత్తు కాలు జారి ట్రైన్ కింద పడిపోయిన నాగరాజు

    • తీవ్ర గాయాలతో మృతి చెందిన నాగరాజు


  • Feb 21, 2026 15:42 IST

    డ్రగ్స్‌ మత్తుతో ఆడబిడ్డల జోలికొస్తే వారికదే చివరిరోజు: సీఎం చంద్రబాబు


  • Feb 21, 2026 15:41 IST

    కొందరు బూతులు మాట్లాడుతున్నారు: సీఎం చంద్రబాబు

    • రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు

    • అసెంబ్లీలో నా సతీమణిని కూడా అవమానించారు

    • 23 క్లెమోర్‌ మైన్స్‌ ప్రయోగించినా నేను భయపడలేదు

    • వేంకటేశ్వస్వామి స్వయంగా నన్ను కాపాడారు

    • వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోను


  • Feb 21, 2026 15:38 IST

    నా ప్రాణం పోయినా తప్పు చేయను: సీఎం చంద్రబాబు

    • నేను‌కూడా జైలుకు వెళ్తానని ఊహించలేదు

    • నోటీసు ఇస్తే సమాధానం చెప్పేవాడిని

    • రాష్ట్రం కోసం పోరాడాను

    • చాలామంది నేను జైల్లోనుంచి ప్రాణాలతో బయటకురానని అనుకున్నారు


  • Feb 21, 2026 15:38 IST

    పల్నాడు: వినుకొండలో సీఎం చంద్రబాబు కామెంట్స్

    • తిరుమల లడ్డూని అపవిత్రం చేశారని చెబితే హెరిటేజ్‌ని తెరపైకి తీసుకొచ్చారు

    • అలాంటి కరుడుగట్టిన నేరస్థుడితో రాజకీయం చెయ్యాలా

    • చెప్పులు‌ వేసుకుని‌ వేంకటేశ్వరస్వామి ఫొటోలు విసిరేశారు

    • వేంకటేశ్వర స్వామి విషయం బయట మాట్లాడకూడదని రెండు రోజులు‌ ఆగాను

    • దొంగే దొంగ అంటూ నాపై ప్రచారం చేశారు


  • Feb 21, 2026 15:34 IST

    Ai సదస్సులో కాంగ్రెస్‌ తీరు ఆవేదన కలిగించింది: సీఎం చంద్రబాబు

    • కాంగ్రెస్‌ తీరు దేశానికి మంచిది కాదు

    • దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు గమనించాలి

    • దేశానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలి


  • Feb 21, 2026 15:33 IST

    ప్రజలకు స్వచ్చమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే మా ఉద్దేశం: సీఎం చంద్రబాబు

    • అందుకే ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వఛ్చాంధ్రలో పాల్గొంటా

    • మార్చి 31కల్లా ఇంటినుంచి చెత్త వందశాతం సేకరించేలా చేస్తాం

    • చెత్త ద్వారా మళ్లీ వస్తువులు ఉత్పత్తి చేస్తాం

    • విశాఖలో చెత్తనుంచి కరెంటు తయారు చేస్తున్నారు

    • మరో ఐదు ప్లాంట్ల ద్వారా కరెంటు తయారు చేస్తాం

    • సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రాష్ట్రంలో బ్యాన్ చేశాం


  • Feb 21, 2026 15:33 IST

    పల్నాడు అంటే పౌరుషాల గడ్డ: సీఎం చంద్రబాబు

    • పల్నాడు వస్తే వైబ్రేషన్స్‌ వస్తాయి

    • శివరాత్రి అంటే కోటప్పకొండ ప్రభలు ప్రత్యేకం


  • Feb 21, 2026 15:31 IST

    టెక్నాలజీ వినియోగంలో ఏపీనే నెంబర్‌ వన్‌: సీఎం చంద్రబాబు

    • వ్యవసాయంలోనూ Ai సేవలు అందుబాటులోకి తెస్తున్నాం

    • రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా చేస్తాం

    • స్త్రీశక్తి, దీపం పథకం అమలు చేస్తున్నాం

    • పేదల ఆదాయం పెంచేందుకు P4 పథకం

    • టెక్నాలజీ వినియోగాన్ని బిల్‌గేట్స్‌ మెచ్చుకున్నారు


  • Feb 21, 2026 15:31 IST

    పల్నాడు: వినుకొండలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కామెంట్స్..

    • మండలానికి ఒక స్వచ్ఛ రథం

    • వారానికి ఒకసారి గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుంది

    • పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారు

    • పరిసరాల పరిశుభ్రతతో పాటు మీకు ఆదాయం వస్తుంది

    • NDA కూటమి రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురాబోతోంది

    • సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ చేశాం

    • ఇప్పటివరకు 108 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త పేరుకుపోయింది


  • Feb 21, 2026 15:25 IST

    భారత్‌ – బ్రెజిల్‌ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు

    • ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు

    • Ai సమ్మిట్‌ రెండు దేశాలకు కొత్త శక్తిని ఇచ్చింది: ప్రధాని మోదీ

    • వ్యూహాత్మక వాణిజ్యంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం: ప్రధాని మోదీ


  • Feb 21, 2026 15:23 IST

    ఢిల్లీ: నలుగురు యూత్‌ కాంగ్రెస్‌ నేతలకు 5 రోజుల పోలీస్‌ కస్టడీ

    • Ai సదస్సులో నిరసన తెలిపిన యూత్‌ కాంగ్రెస్‌ నేతలు

    • యూత్‌ కాంగ్రెస్‌ నేతల బెయిల్‌ పటిషన్లు తిరస్కరించిన కోర్టు


  • Feb 21, 2026 15:22 IST

    ఢిల్లీ: అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదంపై అనుమానం ఉంది: రోహిత్‌ పవార్‌

    • అజిత్ పవార్ మరణం వెనుక కుట్రకోణం ఉంది

    • అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ, అమిత్ షా దృష్టి సారించాలి

    • మోదీ, అమిత్ షా మాత్రమే అజిత్ పవార్‌కు న్యాయం చేస్తారు

    • పైలెట్‌ను బ్లాక్‌మెయిల్‌ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నా


  • Feb 21, 2026 15:21 IST

    గన్నవరం-షార్జా ఎయిరిండియా విమానం నిలిపివేత

    • గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

    • ప్రయాణికులు, ఎయిరిండియా సిబ్బంది వాగ్వాదం

    • షార్జాలో వాతావరణం అనుకూలించక నిలిపివేశామన్న అధికారులు

    • షార్జా వెళ్లాల్సిన 163 మంది ప్రయాణికులు


  • Feb 21, 2026 15:01 IST

    డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

    • హాజరైన రెండు తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, షర్మిల

    • రెండు తెలుగు రాష్ట్రాల నుండి హాజరైన 70 మంది డీసీసీ అధ్యక్షులు


  • Feb 21, 2026 15:00 IST

    తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్..

    TDP Leader JC Prabhakar reddy

    • సీఎం చంద్రబాబు నేర్పించిన విజన్‌తో బతుకుతున్నాం

    • గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలను ఈ ప్రభుత్వం కడుతుంది

    • పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యంగా వదిలేశారు


  • Feb 21, 2026 14:59 IST

    వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

    • భవిష్యత్‌లో వినుకొండకు అన్నీ మంచి రోజులే: సీఎం చంద్రబాబు

    • పల్నాడుకు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి: ముఖ్యమంత్రి

    • ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే నా ఉద్దేశం: సీఎం చంద్రబాబు


  • Feb 21, 2026 14:55 IST

    గ్రూపింగ్‌ అంశంపై ఆకాశ్ చోప్రా ఆగ్రహం

    • టీ20 ప్రపంచ కప్: సూపర్ 8 గ్రూపింగ్ అంశంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

    • టీమిండియాకు అనుకూలంగా గ్రూప్ 1కి మార్చుకున్నట్టు వార్తలు

    • వీటిని ఖండించిన టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా

    పూర్తికథనం


  • Feb 21, 2026 14:51 IST

    టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌కు బిగ్ షాక్

    • ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన మహ్మద్ సిరాజ్

    • హార్ధిక్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా సిరాజ్ మోకాలికి తగిలిన బంతి

    • నొప్పితో విలవిల్లాడిన సిరాజ్

    • ఆందోళనలో టీమిండియా అభిమానులు

    పూర్తికథనం


  • Feb 21, 2026 14:45 IST

    చిలీ: రోడ్డుపై పేలిన ట్రక్

    • లిక్విడ్‌ గ్యాస్‌ లోడ్‌ తీసుకెళ్తున్న ట్రక్

    • ఘటనలో నలుగురు మృతి, 17 మందికి గాయాలు

    • సోషల్‌ మీడియాలో వైరల్ అయిన పేలుడు ఘటన వీడియో

    పూర్తికథనం


  • Feb 21, 2026 14:27 IST

    వైసీపీ నేతల తీరుపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

    • వైసీపీ నేతల ప్రవర్తన చాలా దుర్మార్గం

    • దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారు

    • అసెంబ్లీకి జగన్ రారు, శాసనమండలిలో సభ జరగనివ్వరు

    • మంత్రి లోకేశ్ ప్రభుత్వ ధనాన్ని ఎక్కడా వృధా చేయలేదు

    పూర్తికథనం


  • Feb 21, 2026 14:26 IST

    నాగర్ కర్నూల్: కుమ్మెర గ్రామం మల్లన్న జాతరలో విషాదం

    • మల్లన్న దర్శనం కోసం వెళ్లిన భక్తులను డబ్బులు అడిగిన నిర్వాహకులు

    • డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన భక్తులపై దాడి చేసిన నిర్వాహకులు

    • దాడిలో ఓ మూడు నెలల పాపకు సైతం తీవ్ర గాయాలు

    • ఆస్పత్రిలో పాప మృతి

    పూర్తికథనం


  • Feb 21, 2026 14:26 IST

    విశాఖ: భీమిలోని లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్యామ్ ఆత్మహత్య

    • ప్రియురాలు పావనితో శ్యామ్‌కు గొడవ

    • గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకున్న పావని

    • పావని ఆత్మహత్య నేపథ్యంలో ప్రాణాలు తీసుకున్న శ్యామ్

    పూర్తికథనం


  • Feb 21, 2026 14:03 IST

    హైదరాబాద్: గాంధీభవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపు

    • గాంధీభవన్, బీజేపీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

    • గాంధీభవన్ దగ్గర నిరసనకు బీజేవైఎం నేతల యత్నం

    • ఆందోళనకారులను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు

    • నిన్న ఢిల్లీలో జరిగిన AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన

    • ఇండియా పరువు తీశారని విమర్శిస్తున్న బీజేపీ


  • Feb 21, 2026 13:12 IST

    స్కూల్లో కాల్పులు..! చాట్‌జీపీటీతో హంతకురాలి చాటింగ్

    • కెనడా పాఠశాలలో ఫిబ్రవరి 10న కాల్పుల కలకలం

    • విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డ 18 ఏళ్ల జెస్సీ వాన్ రూట్‌సెల్లర్

    • ఘటనా స్థలంలోనే నిందితురాలి మృతి

    • ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల అంచనా

    • చాట్‌జీపీటీతో జెస్సీ అనుమానాస్పద చాట్స్‌ను గతేడాదే గుర్తించామన్న ఓపెన్ ఏఐ సంస్థ

    • జెస్సీతో ప్రమాదం ఉండకపోవచ్చని భావించి పోలీసులను అప్రమత్తం చేయలేదని వెల్లడి

    పూర్తి కథనం


  • Feb 21, 2026 13:11 IST

    మరోసారి భారత్, పాక్ మ్యాచ్ జరిగే అవకాశం

    • జపాన్‌లో జరిగే ఆసియా క్రీడలు-2026లో భారత్, పాక్ మ్యాచ్

    • ఈ టోర్నీకి భారత్ పురుషుల, మహిళల జట్లు పంపేందుకు సిద్ధమైన బీసీసీఐ


  • Feb 21, 2026 13:10 IST

    చిలీలో పేలిన లిక్విడ్ గ్యాస్ ట్రక్

    • నలుగురి మృతి, 17మందికి తీవ్రగాయాలు

    • గురువారం రెంగా ప్రాంతంలోని హైవేపై ప్రమాదం

    • సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు


  • Feb 21, 2026 12:45 IST

    దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు నేటితో 13 ఏళ్ళు

    • 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్‌లో బాంబు పేలుళ్లు

    • ఈ ఘటనలో 18మంది మృతి, 130మందికి గాయాలు

    • టిఫిన్ బాక్సుల్లో ఉగ్రవాదులు బాంబులు పెట్టి పేలుళ్లు

    • ప్రధాన నిందితుడు ఇండియన్ ముజాహిద్దీన్‌ కీలక నేత యాసిన్ భత్కల్

    • 2013లో నేపాల్ సరిహద్దులో యాసిన్ బత్కల్‌, అబ్దుల్లా అక్తర్‌ను అరెస్ట్

    • నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు


  • Feb 21, 2026 12:31 IST

    ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటనకు ఏడాది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

    • ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట: ఎమ్మెల్యే కేటీఆర్

    • కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే కేటీఆర్

    • కాంగ్రెస్ నేతలు కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారు: ఎమ్మెల్యే కేటీఆర్

    పూర్తి కథనం


  • Feb 21, 2026 12:04 IST

    విశాఖ కేజీహెచ్‌లో నవజాత శిశువు మృతి కలకలం

    • సూపరింటెండెంట్‌ ఆఫీసు దగ్గర గోనెసంచిలో డెడ్‌బాడీ గుర్తింపు

    • పోలీసులకు సమాచారం ఇచ్చిన కేజీహెచ్ అధికారులు


  • Feb 21, 2026 12:03 IST

    గుంటూరు: నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత

    • వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజ్ పేరు మార్పుపై వైసీపీ నేతల ఆగ్రహం

    • వీసీకి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన వైసీపీ నేతలను అడ్డుకున్న TNSF నేతలు‌

    • వర్సిటీలో రాజకీయాలు వద్దంటున్న TNSF నేతలు‌‌


  • Feb 21, 2026 12:02 IST

    కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

    • కోడిగుడ్లు, టమాటాలతో కాంగ్రెస్ ఆఫీసుపై బీజేవైఎం దాడులు

    • కార్యాలయం గేటు ధ్వంసం, ఫ్లెక్సీలు చించివేసిన బీజేవైఎం శ్రేణులు

    • ఏఐ సమ్మిట్‌లో రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ దాడులు


  • Feb 21, 2026 11:44 IST

    విజయవాడ: ఈగల్ వార్షిక నివేదిక వెల్లడించిన ఐజీ రవికృష్ణ

    • ఈగల్ టీమ్ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది: ఐజీ రవికృష్ణ

    • ఏపీలో గంజాయి సాగు ఉండకూడదని నిర్ణయించాం: ఐజీ

    • ఆపరేషన్‌ను చైతన్యవంతంగా ప్రజల్లోకి తీసుకువచ్చాం: ఐజీ రవికృష్ణ


  • Feb 21, 2026 11:43 IST

    హైదరాబాద్: చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్ర

    • నగరంలో విధ్వంసానికి ప్లాన్ చేసినట్టు నిఘావర్గాల అనుమానం

    • ములాఖత్‌కు వచ్చిన వ్యక్తులతో ఉగ్రదాడుల గురించి మాట్లాడినట్టు సమాచారం

    • జైలు నుంచే ప్రణాళికలు సాగినట్టు అనుమానిస్తున్న నిఘావర్గాలు

    • ముసారంబాగ్, సైదాబాద్, మలక్‌పేట ప్రాంతాలపై పోలీసుల నిఘా

    • లష్కర్ ఏ తోయిబాకు చెందిన ఉగ్రవాది కుట్రలు చేసినట్టు సమాచారం


  • Feb 21, 2026 11:32 IST

    అతివేగంతో స్కూటీని ఢీకొన్న కారు.. డెలివరీ బాయ్‌ మృతి

    • ఢిల్లీలో విషాదం.. యువకుడి ప్రాణం తీసిన అతివేగం

    • ఢిల్లీలోని సుభాష్ నగర్‌లో కారు, బైక్‌ ఢీకొని డెలివరీ బాయ్ మృతి

    • కారు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు

    పూర్తి కథనం


  • Feb 21, 2026 11:20 IST

    కామారెడ్డి: శిశుమందిర్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

    • శిశుమందిర్ దగ్గరకు చేరుకున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు

    • ఇరువర్గాలను అడ్డుకుని అరెస్ట్ చేస్తున్న పోలీసులు

    • ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల కబ్జాపై ఇరు పార్టీల ఆరోపణలు

    • నిజాలు తేల్చేందుకు సిద్ధమని MLA వెంకటరమణారెడ్డి సవాల్

    • చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ నేతలు ప్రతిసవాల్

    పూర్తి కథనం


  • Feb 21, 2026 11:18 IST

    కామారెడ్డి: MLA క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

    • MLA క్యాంప్ ఆఫీస్‌కు భారీగా వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

    • కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న బీజేపీ శ్రేణులు

    • కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ, తోపులాట

    • కాంగ్రెస్ నేత కారును ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు

    • ఇరువర్గాలను అడ్డుకుని చెదరగొట్టిన పోలీసులు

    • తోపులాటలో పలువురు పోలీసులకు గాయాలు


  • Feb 21, 2026 11:17 IST

    కామారెడ్డి: బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కీలక ప్రకటన

    • శిశుమందిర్ దగ్గరకు ఎవరూ రావొద్దు: వెంకటరమణారెడ్డి

    • ఇది పార్టీ సమస్య కాదు.. ఎక్కడివారు అక్కడే ఉండండి: వెంకటరమణారెడ్డి

    • ఇది నా కుటుంబంపై వచ్చిన ఆరోపణ.. నిరూపించుకోవాల్సింది నేను: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి


  • Feb 21, 2026 11:16 IST

    పాక్, కివీస్ మ్యాచ్‌కి వాన గండం

    • కివీస్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ బిగ్ షాక్

    • వర్షం కారణంగా రద్దైన పాకిస్థాన్ నెట్ ప్రాక్టీస్


  • Feb 21, 2026 11:08 IST

    టీ-20 ప్రపంచ కప్-2026 అప్డేట్స్

    • నేటి నుంచి సూపర్-8 ప్రారంభం

    • సూపర్-8లో భాగంగా ఇవాళ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్

    • శ్రీలంక కొలంబోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా తలపడనున్న కివీస్, పాక్

    పూర్తి కథనం


  • Feb 21, 2026 11:03 IST

    మాజీ ఎమ్మెల్యేకు షాక్..

    • ఏలూరు: మాజీ ఎమ్మెల్యే వెంకట్రావ్‌, మరో 12 మంది వైసీపీ నేతలకు నోటీసులు

    • మార్చి 16న 13 మందీ కోర్టుకు హాజరుకావాలని భీమడోలు కోర్టు నోటీసులు

    • 2017లో గురజాల ఆదిలక్ష్మి అనే మహిళను గాయపరిచినట్లు ఆరోపణలపై కేసు


  • Feb 21, 2026 11:01 IST

    ఎర్రకోట సహా పలు ఆలయాలపై ఉగ్రదాడులకు ప్రణాళికలు: నిఘావర్గాలు

    • దేశవ్యాప్తంగా దేవాలయాల సమీపంలో పేలుళ్లకు కూడా కుట్రలు: నిఘావర్గాలు

    • ఇస్లామాబాద్ మసీద్‌లో పేలుళ్లకు ప్రతీకార దాడులకు ప్రణాళికలు: నిఘావర్గాలు


  • Feb 21, 2026 11:01 IST

    భివాండి కోర్టుకు రాహుల్‌ గాంధీ

    • మహారాష్ట్ర: భివాండి కోర్టుకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ

    • RSSకు సంబంధించిన పరువునష్టం దావా కేసులో కోర్టుకు హాజరు


  • Feb 21, 2026 10:44 IST

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

    • సీఎం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ను పరిశీలించాం: రామ్మోహన్‌

    • వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతం: రామ్మోహన్‌

    • పౌరవిమానయాన శాఖలోనూ ఈ తరహా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం: రామ్మోహన్‌

    పూర్తి కథనం


  • Feb 21, 2026 10:42 IST

    ఢిల్లీలో హైఅలర్ట్‌… ఉగ్రముప్పు ఉందని నిఘావర్గాల హెచ్చరికలు

    • ఢిల్లీలో దాడులకు లష్కరే తోయిబా ప్లాన్‌ చేసినట్లు సమాచారం

    • పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడులకు కుట్ర

    • ఎర్రకోట, చాందినీచౌక్‌లోని ఆలయం దగ్గర IMD పేలుళ్లకు ప్రణాళికలు

    • ఢిల్లీలో వీవీఐపీ ప్రాంతాల వద్ద భద్రత కట్టుదిట్టం

    పూర్తి కథనం


  • Feb 21, 2026 10:01 IST

    అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు: వెంకయ్యనాయుడు

    • మన అస్తిత్వానికి సుస్థిర కోట నిర్మించేది మన మాతృభాషే: వెంకయ్య

    • మనకంటూ గర్వంగా చెప్పుకోవడానికి ఉంది మన భాష, సంస్కృతులే: వెంకయ్య


  • Feb 21, 2026 09:09 IST

    హైదరాబాద్: FSL అగ్నిప్రమాదం కేసులో కీలక మలుపు

    • దగ్ధమైన ఫైళ్లు రిట్రీవ్ చేయలేమని తేల్చిన నాగపూర్ బృందం

    • ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో 1,100ల ఫైళ్లు దగ్ధమైనట్లు అనుమానం

    • కేసుల డేటా రిట్రీవ్‌కు ప్రయత్నం చేసిన సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్


  • Feb 21, 2026 07:57 IST

    నేటి నుంచి వికారాబాద్‌లో కాంగ్రెస్‌ శిక్షణ తరగతులు

    • అనంతగిరిలో ఏపీ, తెలంగాణ DCC అధ్యక్షులకు శిక్షణ

    • 10 రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించనున్న రేవంత్‌ రెడ్డి

    • పాల్గొననున్న మహేష్ గౌడ్, షర్మిల, మంత్రులు, కీలక నేతలు

    • మార్చి 1న ముగింపు సమావేశానికి హాజరుకానున్న రాహుల్‌ గాంధీ

    పూర్తి కథనం


  • Feb 21, 2026 07:33 IST

    టీ20 వరల్డ్‌ కప్‌ అప్డేట్

    • టీ20 వరల్డ్‌ కప్‌ సూపర్-8లో పాకిస్థాన్ Vs న్యూజిలాండ్

    • కొలంబోలో ఇవాళ రాత్రి 7గంటలకు మ్యాచ్


  • Feb 21, 2026 07:29 IST

    భివాండి కోర్టుకు కాంగ్రెస్ అగ్రనేత

    • మహారాష్ట్ర: నేడు భివాండి కోర్టుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్

    • RSSకు సంబంధించిన పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరుకానున్న రాహుల్ గాంధీ



  • Source link

    Spread the love