యూత్ కాంగ్రెస్ నిరసనపై ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. భారత్- అమెరికా ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ యువజన కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరనస తీవ్ర విమర్శలకు దారితీసింది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచస్థాయి ఏఐ సమ్మిట్‌లో షర్టులు విప్పి ఆందోళనకు దిగారు. ట్రంప్ షరతులకు మోదీ ప్రభుత్వం తలొగ్గిందని వారు అనుకూలంగా ఉన్నారు. ఈ డీల్ వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం ఒనగూరదని కాంగ్రెస్ పదే పదే ఆరోపిస్తోంది.
హైలైట్:
- ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కాంగ్రెస్ నిరసన
- ప్రతిపక్ష పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
- కాంగ్రెస్ ఎప్పుడో దిగజారిపోయిందని విమర్శలు

దేశం పరువు తీసిన వాళ్లను మందలించాల్సింది పోయి.. నిరసనకారులను కాంగ్రెస్ నాయకులు ప్రశంసించడం దురదృష్టకరమని మోదీ పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనను విమర్శించిన ఇండియా కూటమిలోని పార్టీలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
ఇక, ఐఐ సమ్మిట్‌లోకి జరిగే భారత మండపం వద్దకు ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు ఉన్న టీ-షర్టులను ధరించి వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులు.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా భారత్, అమెరికా ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ.. ట్రంప్‌కి మోదీ భయపడ్డారని. అడ్డుకోడానికి అక్కడ భద్రతా సిబ్బంది ప్రయత్నించారు.. వారితో కాంగ్రెస్ యువజన నాయకులు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ కృష్ణ హరి, బిహార్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కుందన్ యాదవ్, యూపీ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్, జాతీయ సమన్వకర్త నరసింహ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఇండియా కూటమి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఇది సరైన చర్య కాదని , దేశానికే అవమానమని ఆయన అన్నారు.
