
ICC కొత్త T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ వేదికలను ధృవీకరించింది: టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ వెన్యూకి సంబంధించి తాజాగా ఐసీసీ నుంచి కీలక సమాచారం వెలువడింది. ఇప్పటికే కొన్ని ఫీక్స్ వెన్యూలు కొన్ని పరిస్థితుల వల్ల మరిన్ని వేదికలు ఖరారు చేసింది. ఐసీసీ కొత్తగా ప్రకటించిన ప్లేయింగ్ కండిషన్స్ వల్ల శ్రీలంకకు హోమ్ సెమీఫైనల్ ఆడే అవకాశం తెరుచుకుంది. వారు ఒకవేళ సెమీస్‌కు వెళితే.. అక్కడ ఏ జట్టుతో ఆడాల్సి వస్తుందనే అంశంపై వెన్యూ డిసైడ్ అవుతుంది. సూపర్–8 దశ నుంచి శ్రీలంక చివరి నాలుగులోకి వస్తే, భారతదేశం లేదా పాకిస్థాన్ కాకుండా మరో జట్టును ఎదుర్కొంటే, ఆ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతుంది. ఈ నిర్వహణ ఐసీసీ అధికారికంగా అన్ని స్టేక్హోల్డర్లకు పంపిన కమ్యూనికేషన్లో స్పష్టం చేసింది. ఒకవేళ పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుకుంటే మాత్రం సెమీఫైనల్–1 కొలంబోలోనే జరుగుతుంది. పాకిస్థాన్ క్వాలిఫై కాకపోయినా, శ్రీలంక క్వాలిఫై అయ్యి భారత్‌ను తప్ప మరో జట్టుతో ఆడినా అదే వేదికలో మ్యాచ్ కొనసాగుతుంది.
మరింత చదవండి: మోడీ క్యాబినెట్: కేరళ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్! కొత్త పేరు ఇదే!?
ఇలా కాకుండా పాకిస్థాన్, శ్రీలంక రెండు సెమీఫైనల్‌కు చేరుకోలేకపోతే.. ఆ మ్యాచ్ కోల్‌కతాలోని ఈ గార్డెన్స్‌కు మారుతుంది. రెండో సెమీఫైనల్ మాత్రం ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనే జరుగుతుంది. ఒకవేళ భారత జట్టు సెమీఫైనల్‌కు వస్తే ప్రత్యర్థి ఎవరు అన్నది సంబంధం లేకుండా వాంఖడే వేదికగా ఉంటుంది. కానీ ఇండియా–పాకిస్థాన్ సెమీఫైనల్ జరిగితే మాత్రం మ్యాచ్ కొలంబోకు షిఫ్ట్ అవుతుంది. ఒకవేళ భారత్, పాకిస్థాన్, శ్రీలంక.. ఈ జట్లు సెమీఫైనల్‌కు చేరుకోలేకపోతే, సూపర్–8 గ్రూప్–1లో టాప్‌లో నిలిచిన జట్టు గ్రూప్–2లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో కోల్‌కతాలో ఆడుతుంది. గ్రూప్–2 విజేత గ్రూప్–1 రన్నరప్‌తో ముంబయిలో తలపడుతుంది. సూపర్–8 గ్రూప్‌ల కాంబినేషన్ కూడా ఈసారి ఆసక్తికరంగా మారింది. గ్రూప్–1లో భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి. గ్రూప్–2లో పాకిస్థాన్, శ్రీలంకతో పాటు, న్యూజిలాండ్ ఉన్నాయి. ముఖ్యంగా శ్రీలంక, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండటం వల్ల ఈ రెండు జట్లు సెమీఫైనల్లో ఒకదానితో ఒకటి తలపడే అవకాశం లేదు.