Revanth Reddy-Shantanu Narayan: సీఎం రేవంత్‌రెడ్డితో అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌ భేటీ


హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (రేవంత్ రెడ్డి)ని అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌ కలిశారు. హైదరాబాద్‌లో సీఎంతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్‌ బోర్డు సభ్యుడిగానూ శంతను కొనసాగుతున్న నేపథ్యంలో గ్లోబల్‌ ట్రెండ్స్‌, కొత్త అవకాశాలతో రేవంత్‌తో చర్చించారు. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, గ్రీన్‌ ఎనర్జీ, ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చ జరిగింది. ఏఐని సమర్థంగా వినియోగించుకునే విషయంపై శంతను నారాయణ్‌తో రేవంత్‌ చర్చించారు.



Source link

Spread the love