Feb 25, 2026 16:45 IST
కృష్ణా: మచిలీపట్నంలో భారీ చోరీ
ఉపాధ్యాయురాలి ఇంట్లో భారీ ఎత్తున నగదు, నగలు అపహరించిన దొంగలు
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
బాధితురాలి నుండి వివరాలు సేకరిస్తున్న క్రైమ్ పార్టీ సిబ్బంది
Feb 25, 2026 16:33 IST
యూట్యూబర్ కోమలి ఆత్మహత్యపై రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ కామెంట్స్
ప్రేమను నిరాకరించడం వల్లే కోమలి ఆత్మహత్య చేసుకుంది: ఇన్‌స్పెక్టర్ వెంకన్న
అఖిల్, కోమలి ఇద్దరూ విశాఖ వాసులే..: ఇన్‌స్పెక్టర్ వెంకన్న
తన ప్రేమ విషయం అఖిల్‌కు చెప్పగా.. నిరాకరించాడు: ఇన్‌స్పెక్టర్
అప్పటికే వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉన్న అఖిల్: ఇన్‌స్పెక్టర్
Feb 25, 2026 16:31 IST
భారత్-జింబాబ్వే మ్యాచ్.. రింకు సింగ్ వచ్చేశాడు!
తండ్రి అనారోగ్యం కారణంగా స్వగ్రామానికి వెళ్లిన రింకు
జింబాబ్వేతో చెన్నై వేదికగా గురువారం భారత్ మ్యాచ్
ఈ మ్యాచ్‌కు రింకు అందుబాటులో ఉంటాడు: బ్యాటింగ్ కోచ్
Feb 25, 2026 16:25 IST
2018 గ్రూప్ 1 అధికారులపై ఏపీ చీఫ్ సెక్రటరీ కీలక నిర్ణయం
ఫోకల్ పోస్టుల నుంచి వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశాలు
2018 గ్రూప్ 1 అధికారుల బదిలీపై చీఫ్ సెక్రటరీ యాక్షన్
ఫోకల్ పోస్టుల్లో ఉన్న గ్రూప్ 1 అధికారులందరిని వెంటనే రిలీవ్ చేయాలి
Feb 25, 2026 15:59 IST
ఒడిశా గనులశాఖ అధికారి నివాసంలో భారీగా నోట్లకట్టలు
రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు
నగదు సహా భారీగా బంగారం స్వాధీనం చేసుకున్న విజిలెన్స్
రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన..
గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ మొహంతి నివాసంలో సోదాలు
Feb 25, 2026 15:43 IST
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
Feb 25, 2026 15:25 IST
అమరావతి: శాసనమండలి చైర్మన్ ఎదుట విచారణకు ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ హాజరు
వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న జయమంగళం వెంకట రమణ
ఎమ్మెల్సీ పదవికి గతంలో జయమంగళం వెంకటరమణ రాజీనామా
రాజీనామాను ఆమోదించాలని మరోసారి చైర్మన్‌ను కోరిన వెంకటరమణ
ఏడాది గడిచినా రాజీనామాను ఆమోదించని మండలి చైర్మన్
ఇప్పటికే ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జయమంగళం వెంకటరమణ
Feb 25, 2026 15:23 IST
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
రూ. 456 కోట్లతో జరగనున్న ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు
స్థానిక రైతులతో కలిసి ఫీడర్ కెనాల్‌లో తిరిగిన సీఎం చంద్రబాబు
స్థానికంగా ఏఏ పంటలు వేస్తున్నారో రైతుల్ని అడిగి తెలుసుకున్న సీఎం
Feb 25, 2026 15:22 IST
డీజీపీని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
కామారెడ్డి, నిజామాబాద్ ఘటనలపై డీజీపీకి ఫిర్యాదు చేశాం: రామచంద్రరావు
హిందూ కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు: రామచంద్రరావు
కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు మానుకోవాలి: రామచంద్రరావు
Feb 25, 2026 14:42 IST
నా అన్వేషణ అన్వేష్‌కు బిగ్ షాక్
అన్వేష్‌కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు
అన్వేష్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన ఇన్‌స్టాగ్రామ్
అసభ్య పదజాలంతో వీడియో విడుదల చేసిన అన్వేష్
Feb 25, 2026 14:38 IST
అమరావతి: ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
Feb 25, 2026 14:38 IST
మీడియా ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ చిట్ చాట్
బాబాయ్‌ను చంపి కత్తి మా చేతిలో పెట్టారు: లోకేశ్
ఇప్పుడు వీఎస్ఆర్ ఏవియేషన్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు కూడా అలాంటివే: లోకేశ్
హెరిటేజ్‌కు వీఎస్ఆర్ ఏవియేషన్‌కు ఎటువంటి సంబంధం లేదు: లోకేశ్
Feb 25, 2026 13:48 IST
రేపటికి వాయిదా..
Feb 25, 2026 13:47 IST
ఆడబిడ్డ నిధి పథకం అమలుపై శానసమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రశ్న
ఆడబిడ్డ నిధి పథకం ప్రభుత్వ పరిశీలనలో ఉంది: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
సూపర్ సిక్స్‌లో ప్రతి హామీని అమలు చేసేందుకు చర్యలు: మంత్రి
Feb 25, 2026 13:36 IST
జగిత్యాల: సోదరా గణపతి లొంగిపో: ABNతో మావోయిస్టు గణపతి తమ్ముడు రాంచంద్రరావు
స్వగ్రామం, కుటుంబం నీకోసం ఎదురు చూస్తోంది: గణపతి సోదరుడు రాంచంద్రరావు
అందరూ లొంగిపోయారు.. నువ్వు కూడా లొంగిపో: రాంచంద్రరావు
గణపతికి పోలీసులు హాని తలపెట్టొద్దు: ABNతో తమ్ముడు రాంచంద్రరావు
Feb 25, 2026 13:36 IST
శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ కూర్మారావు సస్పెన్షన్
విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ వేటు
ఉన్నతాధికారుల నివేదిక తర్వాత ఏపీ ప్రభుత్వం చర్యలు
డయేరియా ప్రబలడానికి కారణమంటూ సస్పెన్షన్
Feb 25, 2026 13:23 IST
దేశంలో నక్సలైట్ల ఉనికి పోయింది: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
ఇక అర్బన్ నక్సలైట్ల అంతం చూస్తాం: రాంచందర్‌రావు
కుహనా మేధావులు, అర్బన్ నక్సల్స్‌కు రాహుల్ సపోర్ట్ చేస్తున్నారు: రాంచందర్‌రావు
తెలంగాణలో కూడా అర్బన్ నక్సలైట్లు లేకుండా చేయాలి: రాంచందర్‌రావు
రేవంత్, కేసీఆర్ కమ్యూనిజాన్ని బతికించే ప్రయత్నం చేస్తున్నారు: రాంచందర్‌రావు
Ai సమ్మిట్‌లో కాంగ్రెస్ వ్యహరించిన తీరు దారుణం: రాంచందర్‌రావు
రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలి: బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
Feb 25, 2026 13:21 IST
సీఎం రేవంత్‌తో అడోబ్ సీఈవో భేటీ..
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన Adobe సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డ్ సభ్యుడు శంతను నారాయణ్
గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్‌తో చర్చించిన శంతను నారాయణ్
గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై Ai ప్రభావం, స్కిల్లింగ్ & రీస్కిల్లింగ్‌కు సంబంధించిన అంశాలపై చర్చ
తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్‌గా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్
ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
Feb 25, 2026 13:19 IST
అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ
దేశ రాజధాని ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలంటూ..
అమిత్‌షాకు బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్ వాల్ లేఖ
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకూ లేఖ రాసిన ప్రవీణ్ ఖండేల్ వాల్
Feb 25, 2026 13:17 IST
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని వసంత ఆత్మహత్య
యమున హాస్టల్‌లో ఉరివేసుకుని వసంత ఆత్మహత్య
ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న వసంత
విద్యార్థిని వసంత స్వస్థలం వనపర్తి జిల్లా
Feb 25, 2026 13:16 IST
యూట్యూబర్ కోమలి కేసు..
పోలీసుల అదుపులో కోమలి ప్రియుడు, యూట్యూబర్ అఖిల్‌రెడ్డి
తనను దూరం పెట్టాడని ఆత్మహత్యకు పాల్పడిన కోమలి
పోలీసుల చేతికి చిక్కిన కోమలి సూసైడ్ నోట్
Feb 25, 2026 13:14 IST
IFS ఫలితాలు విడుదల
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్(IFS) ఫలితాలు విడుదల
యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా
Feb 25, 2026 12:48 IST
తెలుగు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులు..
విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
హైకోర్టు, నాంపల్లి కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు
Feb 25, 2026 12:47 IST
ఏపీ శాననమండలిలో గందరగోళం
Feb 25, 2026 12:47 IST
ఏపీ హైకోర్టుకు హాజరైన సీఎస్ విజయానంద్
గ్రూప్-1 పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులను నాన్ ఫోకల్ పోస్టులకి..
మార్చాలని గతంలో జారీ చేసిన ఆదేశాల అమలు అంశంపై విచారణ
Feb 25, 2026 12:46 IST
ఢిల్లీ: చందన్ పార్క్ ఏరియాలో దారుణం
భార్యతోపాటు ముగ్గురు పిల్లలను హత్య చేసిన ముంచన్ కెవాత్
ఇంట్లో భార్య, ముగ్గురు కుమార్తెల మృతదేహాలను గుర్తించిన పోలీసులు
గొంతు కోసి చంపినట్లు గుర్తించిన పోలీసులు
పరారీలో నిందితుడు ముంచన్ కెవాత్
Feb 25, 2026 12:13 IST
ఇజ్రాయెల్‌కు పర్యటనకు బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ
ఇవాళ, రేపు(గురువారం) ఇజ్రాయెల్‌లో భారత ప్రధాని పర్యటన
మోదీ పర్యటన నేపథ్యంలో ఇజ్రాయెల్ పార్లమెంట్(క్నసెట్) భవనం ముస్తాబు
భారత త్రివర్ణ పతాక రంగుల్లో మెరిసిపోనున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ భవనం
ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి స్వాగతం పలుకనున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
Feb 25, 2026 11:20 IST
యువతకు అవసరమైన శిక్షణ అందించేలా చర్యలు: మంత్రి లోకేశ్
దేశంలో తయారయ్యే ఏసీల్లో 50 శాతం ఏపీలో తయారవుతున్నాయి: మంత్రి లోకేశ్
ఉద్యోగాల కల్పనకు సంబంధించి మంత్రులతో సబ్‌కమిటీ ఏర్పాటు: మంత్రి లోకేశ్
సెక్టర్‌ల వారిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు గుర్తించి..
వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం చర్యలు చేపట్టాం: మంత్రి లోకేశ్
Feb 25, 2026 11:20 IST
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం: మంత్రి లోకేశ్
క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు: మంత్రి లోకేశ్
అనంతపురం, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 22 క్లస్టర్లు: మంత్రి లోకేశ్
ఒక రంగానికి సంబంధించిన ఉత్పత్తులు, ఉపకరణాలు,..
విడి భాగాలు ఒకే చోట తయారు చేసేలా ప్రణాళికలు: మంత్రి లోకేశ్
Feb 25, 2026 11:19 IST
మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
భారత్- పాక్ మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్
లేకుంటే పాక్‌లో 35 మిలియన్ల ప్రజలు చనిపోయేవారు: ట్రంప్
భారత్- పాక్ యుద్ధం ఆపకపోయి ఉంటే పాక్ ప్రధాని చనిపోయేవారని నాతో చాలామంది అన్నారు: ట్రంప్
టారిఫ్‌లు విధించే హక్కు, అధికారాలు నాకు ఉన్నాయి: ట్రంప్
అధ్యక్షుడిగా నాకు సర్వాధికారాలు ఉన్నాయి: డొనాల్డ్ ట్రంప్
Feb 25, 2026 11:18 IST
అధికారిపై వేటు..
రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌పై వేటు
విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్ డా.సత్యనారాయణ
కొత్త సూపరింటెండెంట్‌గా డాక్టర్ కెనడి నియామకం
Feb 25, 2026 11:01 IST
మచిలీపట్నంలో పాల కేంద్రాల్లో అధికారుల తనిఖీలు
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనతో ఫుడ్‌సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు
ఎస్.ఎస్ మిల్క్, జిల్లా పరిషత్ కృష్ణవేణి మిల్క్ డైరీ పాల కేంద్రాల నుంచి పాల శాంపిల్స్ సేకరణ
మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేని బాదం పాల ప్యాకెట్లు గుర్తింపు
Feb 25, 2026 11:00 IST
ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య..
మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్న కోమలి
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువకుడితో మూడేళ్లుగా ప్రేమాయణం
ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య
Feb 25, 2026 10:59 IST
సీఎం చంద్రబాబు సమీక్ష
శ్రీకాకుళం డయేరియా, రాజమహేంద్రవరం పాల ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష
వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా
Feb 25, 2026 10:36 IST
రాజధానిలో ఏడీబీ బృందం పర్యటన
అమరావతిలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు(ADB) బృందం పర్యటన
ఉండవల్లి పంప్ హౌస్ దగ్గర పనులు పర్యవేక్షించిన బ్యాంక్ ప్రతినిధులు
నిర్మాణ పనులను వివరించిన CRDA అడిషనల్ కమిషనర్ భార్గవతేజ
Feb 25, 2026 10:35 IST
రక్త నమూనాలు సేకరణ
రాజమహేంద్రవరం: కల్తీ పాల ఘటనలో కొనసాగుతున్న నమూనాల సేకరణ
బాధితుల రక్త నమూనాలు సేకరించిన వైద్యాధికారులు
ప్రైవేట్ ఆస్పత్రుల్లో 15మందికి చికిత్స, 8మంది పరిస్థితి విషమం
కల్తీ పాలు తాగిన బాధిత ప్రాంతాల్లో కొనసాగుతున్న అధికారుల సర్వే
Feb 25, 2026 10:21 IST
శ్రీకాకుళంలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ సమీక్ష
పాల్గొన్న కలెక్టర్, మున్సిపల్ ఉన్నతాధికారులు
బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశం
Feb 25, 2026 10:09 IST
రాంచీ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంలో ట్విస్ట్
విమానంలో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ లేవని గుర్తింపు
కమ్యూనికేషన్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేయనున్న అధికారులు
Feb 25, 2026 09:42 IST
ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్న
వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలేదని వ్యాఖ్య
అధిక వేతనం ఉన్నవారు సంక్షేమ పథకాలు పొందలేరని మంత్రి బాలవీరాంజనేయస్వామి జవాబు
అందరికీ సంక్షేమ పథకాలందించే అంశాన్ని ప్రభుత్వ పరిశీలనకు పంపుతామని సమాధానం
Feb 25, 2026 09:32 IST
నేడు బలమైన రికవరీతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు
నిన్న IT స్టాక్‌ల భారీ పతనం తర్వాత నేడు గ్యాప్-అప్ ఓపెనింగ్
మార్కెట్‌ను ముందుకు తీసుకెళ్లిన Nifty IT ఇండెక్స్ రీబౌండ్
82,500 పాయింట్ల నుంచి 82,785 పెరిగిన సెన్సెక్స్
మునుపటి క్లోజింగ్ 82,226తో పోలిస్తే దాదాపు 500 పాయింట్ల హైప్
25,550 – 25,600 రేంజ్‌లో ట్రేడ్ అవుతోన్న నిఫ్టీ
మునుపటి క్లోజింగ్ 25,425తో పోలిస్తే 140 – 200 పాయింట్ల హైప్
Feb 25, 2026 08:52 IST
ఢిల్లీలో కాల్పుల కలకలం.. లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌పై అటాక్
లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌పై కాల్పులు
తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్
ఢిల్లీలోని రోహిణి పరిసరాల్లో లారెన్స్ న్యాయవాదుల బృందంపై దాడి
గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి న్యాయవాదుల వాహనంపై కాల్పులు
Feb 25, 2026 08:50 IST
అస్సాం: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
ప్రియుడితో కలిసి కారులో విహారయాత్రకు వెళ్తున్న యువతి
కారు ఆపి ఏడుగురు దుండగులు యువతిపై సామూహిక అత్యాచారం
అనంతరం బెదిరించి రూ.10వేలు తమ అకౌంట్‌లోకి బదిలీ
సిల్చార్ సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
Feb 25, 2026 08:49 IST
ఏపీ ఉభయ సభల్లో నేడు..
ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న శాసన సభ
ఏపీ మెట్రో రైలుకు సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి నారాయణ
వ్యవసాయ రంగంపై లఘు చర్చతో ప్రారంభంకానున్న శాసన మండలి
అసెంబ్లీలో ఆమోదించిన ఐదు బిల్లులకు ఆమోదం తెలపనున్న మండలి
Feb 25, 2026 08:34 IST
అమెరికాకు స్వర్ణయుగం మళ్లీ ప్రారంభమైంది: ట్రంప్
అమెరికాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం: ట్రంప్
గతంలో చూడని అమెరికాను రూపొందించుకుందాం: ట్రంప్
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యలు
Feb 25, 2026 08:33 IST
ముగిసిన ACB సోదాలు
కడప: పులివెందుల రూరల్ CI వెంకటరమణ నివాసాల్లో ముగిసిన ACB సోదాలు
రూ.6 లక్షలు, 200 గ్రాముల బంగారు ఆభరణాలు, కీలకపత్రాలు స్వాధీనం
పులివెందుల DSP మురళినాయక్‌ను ప్రశ్నించిన ACB అధికారులు
Feb 25, 2026 08:32 IST
యుట్యూబర్ కోమలి ఆత్మహత్య
రంగారెడ్డి: చిత్రపురి కాలనీలో యుట్యూబర్ కోమలి ఆత్మహత్య
మరో యూట్యూబర్ అఖిల్‌రెడ్డితో కోమలి ప్రేమ వ్యవహారం
విభేదాలతో ఇంట్లో ఉరేసుకుని కోమలి ఆత్మహత్య
Feb 25, 2026 08:18 IST
AI యాప్‌లలో భారీ డేటా లీక్..
సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు కనుగొన్న భారీ డేటా ఎక్స్‌పోజర్
120 కోట్లకు పైగా KYC రికార్డులు బహిర్గతం
రెండు AI యాప్‌ల సెక్యూరిటీ లోపాల వల్ల లీక్
పాస్‌పోర్ట్‌లు, ఫొటోలు, ఫోన్ నంబర్లు లీక్
ఐడెంటిటీ థెఫ్ట్, ఆర్థిక మోసాలకు అవకాశం ఉందని హెచ్చరిక
Feb 25, 2026 08:14 IST
భారత సంతతి వ్యక్తి కిడ్నాప్ ఆపై హత్య
కాలిఫోర్నియాలోని ట్రేసీ సిటీలో దారుణ ఘటన
భారత సంతతికి చెందిన అవతార్ సింగ్ కిడ్నాప్ ఆపై హత్య
20 ఏళ్లుగా గురుద్వారాలో వాలంటీర్‌గా పనిచేస్తున్న అవతార్ సింగ్
Feb 25, 2026 07:33 IST
నేటి బంగారం, వెండి ధరలివే..
బంగారం ధరలు ఇవాళ(బుధవారం) స్వల్ప పెరుగుదలను సూచిస్తున్నాయి.
Comexలో బంగారం ధర ప్రతి ఔన్స్‌కు 22.50 డాలర్లు పెరిగి 5,198.80 డాలర్లుగా ఉంది.
దేశంలో ప్రతి గ్రాముకు 24 క్యారెట్ సుమారు రూ.16,178 నుంచి రూ.16,244గా ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.16,179 వద్ద కొనసాగుతోంది.
Feb 25, 2026 06:52 IST
నేడు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ
రెండురోజులపాటు ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీ టూర్
ఉదయం ఢిల్లీ నుంచి టెల్‌అవీవ్‌కు బయల్దేరనున్న ప్రధాని
Feb 25, 2026 06:51 IST
సీఎం చంద్రబాబు పర్యటన
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
వెలిగొండ ప్రాజెక్ట్ సందర్శన, ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన
Feb 25, 2026 06:50 IST
నేడు నాగర్‌కర్నూల్‌కు మాజీ మంత్రి కేటీఆర్
కుమ్మెర జాతరలో రెండేళ్ల చిన్నారి మృతిపై ఆందోళన
బాధిత కుటుంబసభ్యులను పరామర్శించనున్న కేటీఆర్
Feb 25, 2026 06:49 IST
నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు
మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలు
ఉ.9 నుంచి మ.12 గంటల వరకూ పరీక్షల సమయం
పరీక్ష రాయనున్న 9,97,975 మంది విద్యార్థులు
తెలంగాణవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు