కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమైన ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, ఛైర్మన్ నాగేష్ షెట్కార్


నారాయణఖేడ్‌: జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ కుమార్‌ షెట్కార్‌, నారాయణఖేడ్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ నాగేశ్‌ షెట్కార్‌.. దిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా రూ.520 కోట్లతో నేషనల్‌ హైవే 161(బీ) నిజాంపేట్‌ – నారాయణఖేడ్‌ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు చేపట్టిన పనులు కొనసాగుతున్నాయని వారు కేంద్రమంత్రికి వివరించారు.

అదేవిధంగా కర్ణాటక సరిహద్దు నుంచి బీదర్‌ వరకు  మిగిలిన 8 కిలోమీటర్ల రహదారికి కూడా నిధులు మంజూరు చేసి, నేషనల్‌ హైవే 161(బీ)తో అనుసంధానం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి.. అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



Source link

Spread the love