Telangana News Updates: నేడు తిరుమలకు కాలినడకన కల్వకుంట్ల కవిత |


తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు తిరుమలకు కాలినడకన వెళ్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆమె ఉదయం 11గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి బయల్దేరతారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు బయల్దేరుతారు. శుక్రవారం ఉదయం స్వామి వారిని దర్శించుకుంటారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె తిరుమలకు వెళ్తున్నారని సమాచారం.

ఇవాళ ఏమున్నాయి?

ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి కాలినడకన తిరుమలకు అలిపిరి మెట్ల మార్గంలో బయలుదేరతారు జాగృతి అధ్యక్షురాలు కవిత. నేడు భారత్‌లో ప్రధాని మోదీతో ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ భేటీ ఉంది. నేడు నేపాల్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. నేడు తెలంగాణలో ఫిరాయింపులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైనల్ విచారణ జరుపుతారు. నేడు AP, తెలంగాణలో టెన్త్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల అవుతాయి. తిరుపతి జిల్లా.. రైల్వే కోడూరులోని సాయినగర్‌లో ఉన్న శ్రీ సాయి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఇవాళ జాబ్‌మేళా ఉంది. ఇవాళ Elfin Agro India SME ఐపీఓ ప్రారంభమవుతుంది. T20 వరల్డ్ కప్ సెమీస్‌లో నేడు భారత్ – ఇంగ్లండ్ మ్యాచ్ ఉంది. గెలిస్తే భారత్ ఫైనల్ లోకి వెళ్తుంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Spread the love