Revanth Reddy: విజయ్‌ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్‌రెడ్డి.. ‘విరోష్‌’కు విషెస్‌


హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (రేవంత్ రెడ్డి) సినీ నటుడు విజయ్‌ దేవరకొండ నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహం చేసుకున్న విజయ్‌ (Vijay Deverakonda)- రష్మిక (రష్మిక)లను ఆయన ఆశీర్వదించారు. ‘విరోష్‌’ జోడీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ బుధవారం జరిగిన సంగతి తెలిసిందే. నిన్న సీఎం దిల్లీ పర్యటనలో ఉండటంతో గురువారం వారి నివాసానికి వెళ్లి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్‌ సతీమణి గీతారెడ్డి నిన్న ‘విరోష్‌’ రిసెప్షన్‌కు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించగా.. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు.



Source link

Spread the love