Maoists Surrender : సీఎం రేవంత్‌ సమక్షంలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు – ప్రత్యక్ష ప్రసారం


మావోయిస్టుల లొంగుబాటుల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇటీవలనే దేవ్ జీతో పాటు పలువురు అగ్రనేతలు లొంగిపోయారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటుకు ముందుకొచ్చారు. ఆయుధాలను అందజేసి వీరంతా జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ మిలీషియా సభ్యులు, ఇతర నాయకులు, మహిళా నక్సలైట్లు ఉన్నారు.

భారీగా మావోయిస్టుల లొంగుబాటు
భారీగా మావోయిస్టుల లొంగుబాటు

బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ వీక్షించండి…

ముందుగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు.మొత్తం 130 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. వీరిలో అత్యధికంగా ఛత్తీస్ ఘడ్ కు చెందినవారని, తెలంగాణ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఒక్కరు ఉన్నారని పేర్కొన్నారు. లొంగుబాటు వేళ 124 ఆయుధాలను అందజేశారని వెల్లడించారు.

గడిచిన రెండేళ్లలో 700కిపైగా వరకు మావోయిస్టులు తెలంగాణలో లొంగిపోయారని డీజీపీ తెలిపారు. ఇటీవలనే నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు లొంగిపోయారని గుర్తు చేశారు. ఇంకా తెలంగాణ నుంచి ఏడుగురు అజ్ఞాతంలో ఉన్నారని… వీరు కూడా జనజీవనంలోకి రావాలని పిలుపునిచ్చారు.

మిగతా వాళ్లు కూడా రండి – సీఎం రేవంత్ పిలుపు

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఇవాళ 130 మంది మావోయిస్టులు లొంగిపోయారని,ఇందుకోసం పోలీసులు తీవ్రమైన కృషి చేశారని చెప్పారు. శాంతియుత పోరాటం ద్వారానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారమని అభిప్రాయపడ్డారు. దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా చర్చల ద్వారానే పరిష్కరించుకునే పరిస్థితులు ప్రస్తుతం చేస్తున్నామని చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతలోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడండని కోరారు. సమస్యలను పరిష్కరించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందన్నారు.



Source link

Spread the love