Trisha:పొలిటికల్ ఎంట్రీకి హీరోయిన్ త్రిష రెడీ- అక్కడి నుంచే పోటీ..? | రాజకీయాల్లో త్రిష:విజయ్ టీవీకే నటికి చెన్నై టికెట్ ప్లాన్, పార్టీ అధ్యక్షుడి సరైన చర్య ఇదేనా


భారతదేశం

ఓయ్-కన్నయ్య

Trisha in Politics:అరవ రాజకీయాలు మాంచి ఊపుమీద ఉన్నాయి. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి మరో అన్నాడీఎంకే బీజేపీ కూటమి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమదంటే తమదే గెలుపని విధంగా… రెండు పార్టీలకు ప్రమాదకరంగా తయారయ్యాడు ప్రముఖ తమిళ స్టార్ టీవీకే పార్టీ అధినేత విజయ్. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌కు తన భార్య నుంచి పొలిటికల్‌గా ప్రాణ సంకటం ఏర్పడింది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టు గడపను తొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆమె విడాకులు కోరడానికి ప్రధాన కారణం ఓ ప్రముఖ నటి అని ఆమె గురించి తెలుస్తుంది. అయితే ఆ నటి పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించనప్పటికీ… ఆమె హీరోయిన్ త్రిష అని తమిళనాడు మొత్తం కోడై కూస్తోంది.

ఓపెన్ అయిపోయిన విజయ్

నిండా మునిగాక చలేముందిలే అన్నట్లుగా విజయ్ కూడా చాలా ఓపెన్ అయ్యాడు. తన భార్య సంగీత విడాకులు కావాలంటూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు తలుపు తట్టింది. ఆమె బ్లాక్‌మెయిల్‌కు బెదిరేది లేదని ప్రజలకు స్పష్టం చేయడానికి కాబోలు… నిన్న ఓ పెళ్లి వేడుకకు నేరుగా త్రిషతో కలిసి విజయ్ తన కారులో వచ్చారు. త్రిష కారులోనుంచి బయటకు దిగగానే అక్కడున్న వారందరూ షాక్ అయిన పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఇన్ని రోజులు త్రిషతో ఉన్న రిలేషన్‌షిప్ పై వస్తున్న వార్తలకు బలం చేకూర్చింది ఈ సన్నివేశం. అంతేకాదు భార్య సంగీతకు కూడా స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపినట్లయ్యింది.విజయ్-త్రిష ఇద్దరూ కలిసి ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వడంతో తమిళనాడులో గుసగుసలు ప్రారంభమయ్యాయి.

trisha-in-politics-vijays-tvk-plans-chennai-ticket-for-ctress-ఇదే సరైన ఎత్తుగడ.

త్రిష పొలిటికల్ ఎంట్రీ

దక్షిణాది రాజకీయాలు వేరు.. అందులో తమిళ రాజకీయాలు ఇంకాస్త స్పెషల్ అంటే చెప్పాలి. అక్కడ సినిమా ఇండస్ట్రీ నుంచి కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత రాజకీయ పార్టీలు పెట్టి సక్సెస్ అయినవాళ్లు.. ఫెయిల్ అయినవారు ఉన్నారు. ఉదాహరణకు ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటివారు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి తమిళ రాజకీయాలను శాసించారు. అప్పట్లో రజినీకాంత్ పార్టీ పెడతారని ప్రచారం జరిగినా తన ఆరోగ్య దృష్ట్యా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఇక కమల్ హాసన్ పార్టీ పెట్టడానికి ఆయన సక్సెస్ కాలేకపోయారు. దివంగత విజయ్‌కాంత్ మాత్రం కాస్త నిలదొక్కుకున్నారు.

ఇక తాజాగా హీరో విజయ్ కొత్త పార్టీ టీవీకే తొలిసారిగా ఎన్నికల్లో నిలవబోతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో విజయ్ ఉన్నారు. ఈ విధంగానే చెన్నై అసెంబ్లీ సీటును విజయ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడి నుంచి నటి త్రిషను టీవీకే పార్టీ టికెట్ పై పోటీ చేయాలని కోరుకుంటున్నారని తమిళ పాలిటిక్స్‌లో ప్రచారం.

చెన్నై అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన సినీ తారలు

సినిమా రంగానికి, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉన్న తమిళనాడులో ముఖ్యంగా రాజధాని చెన్నైలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి అనేక మంది సినీ నటులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. చెన్నై పరిధిలోని (చెన్నై నార్త్, సెంట్రల్, సౌత్) అసెంబ్లీ స్థానాల నుండి విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెట్టారు.

  1. ఎంజీఆర్:తమిళ రాజకీయాల్లో మొదటిగా చెప్పుకోవాల్సిన పేరు ఎంజీ రామచంద్రన్.తమిళ చలనచిత్ర రంగాన్ని, రాజకీయాలను శాసించిన ఎంజీఆర్ చెన్నైలోని నియోజకవర్గాల నుండే తన రాజకీయ ప్రస్థానాన్ని బలపరుచుకున్నారు.1967లో ఎంజీఆర్ మొదటిసారి పరంబూర్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 1971లో సెయింట్ థామస్ మౌంట్ నుండి విజయం సాధించారు.
  2. జయలలిత:నటిగా కోట్లాది మంది అభిమానాన్ని పొందిన జయలలిత, చెన్నై నగరాన్ని తన రాజకీయ కోటగా మార్చుకున్నారు.2015ఉప ఎన్నికలో2016 సాధారణ ఎన్నికల్లో జయలలిత చెన్నైలోని ఆర్కే నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.1980వ దశకంలో ఆమె రాజకీయ ప్రస్థానం మైలాపూర్ నుండే బలంగా సాగింది.
  3. ఎం. కరుణానిధి: కరుణానిధి కేవలం రాజకీయ నాయకుడే కాదు, గొప్ప సినీ రచయిత కూడా. ఆయన రాసిన వరుసగా చేపలు ఎంతో మంది నటులను స్టార్లను చేశాయి.1967, 1971లలో కరుణానిధి సైదాపేట నుంచి పోటీ చేసి గెలిచారు.1977, 1980లలో అన్నానగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.1989, 1991లలో హార్బర్ నుంచి విజయం సాధించారు.1996, 2006లో అసెంబ్లీ గెలుపొందారు.
  4. ఉదయనిధి స్టాలిన్: ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నై నుండే నిర్వహిస్తున్నారు.2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చేపాక్-తిరువల్లికే నుండి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు.
  5. ఎస్.వి. శేఖర్: ప్రముఖ హాస్య,నాటక కర్త ఎస్.వి.శేఖర్ కూడా చెన్నై నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు.2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే తరపున మైలాపూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
  6. నెపోలియన్: ప్రముఖ నటుడు నెపోలియన్ 2001లో విల్లివాక్కం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.

మొత్తానికి తమిళ రాజకీయాల్లో చెన్నై నగరం కీలక పాత్ర పోషించింది. చెన్నైలోని అసెంబ్లీ స్థానాలు సినీ గ్లామర్‌కు ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్కే నగర్, చేపాక్, మైలాపూర్ నియోజకవర్గాలు సినీ రంగానికి చెందిన ఉద్ధండులకు వేదికలుగా నిలిచాయి. అయితే రానున్న ఎన్నికల్లో త్రిష చెన్నైలోని ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుందో ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. అయితే తన రాజకీయ అరంగేట్రంపై మాత్రం త్రిష ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏ పార్టీ కండువా కప్పుకోలేదు. ఎన్నికల అసెంబ్లీకి కొంత సమయం ఉన్నందున ఇవన్నీ చకచకా జరిగిపోయే అవకాశాలున్నాయి.



Source link

Spread the love