ఆ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డికి.. కిషన్‌రెడ్డి లేఖ


ఢిల్లీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (Telangana CM Revanth Reddy) కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి) ఈరోజు (సోమవారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుపై కీలక సూచనలు చేశారు. సెకండ్ ఫేజ్‌లో భాగంగా ఎన్టీపీసీ రామగుండంలో ఏర్పాటు చేయనున్న 3X800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం(PPA) చేసుకోవాలని సూచించారు. పూర్తి 5X800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు.

మూడు ప్రాజెక్టుల కోసం ఎన్టీపీసీ చర్యలు..

రామగుండంలో ఎన్టీపీసీ ఏర్పాటు చేయాల్సిన 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి ఫేజ్‌లో భాగంగా దాదాపు రూ.12,000 కోట్ల వ్యయంతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 2X800=1600 మెగావాట్ల రెండు థర్మల్ పవర్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2023లో ప్రారంభించి జాతికి అంకితం చేసిన విషయం మీకు తెలిసిందేనని అన్నారు. అనంతరం సెకండ్ ఫేజ్‌లో భాగంగా 3X800=2,400 మెగావాట్ల సామర్థ్యంతో మిగిలిన మూడు పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎన్టీపీసీ చర్యలు చేపట్టిందని ప్రస్తావించారు. మొదటి ఫేజ్‌లో లాగే రెండవ ఫే‌జ్‌లో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 85శాతం విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా చేయనుందని తెలిపారు. 3 మార్చి, 2026న తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యధికంగా 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని వివరించారు.

థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాలి..

రానున్న రోజుల్లో ఈ డిమాండ్ మరింతగా పెరగనుందని కిషన్‌రెడ్డి తెలిపారు. తదనుగుణంగా తెలంగాణలో అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిసిందన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇటీవల విద్యుత్ రంగం మీద ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ‘జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా గ్రిడ్ స్థిరత్వాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో 5000 నుంచి 6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాలి’ అని తెలియజేశారని అన్నారు.

లక్ష మెగావాట్ల విద్యుత్ డిమాండ్..

అలాగే, 2047 నాటికి రాష్ట్రంలో లక్ష మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారని కిషన్‌రెడ్డి అన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసిందన్నారు. అతి తక్కువ ఖర్చుతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడంలో ఎన్టీపీసీకి దేశంలోనే విశేషమైన అనుభవం ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కీలకం: కేసీఆర్

తాజాగా చదవండి అంతర్జాతీయ వార్తలు మరియు తెలంగాణ వార్తలు మరియు AP వార్తలు మరియు తెలుగు వార్తలు

నవీకరించబడిన తేదీ – మార్చి 09, 2026 | 11:06 AM



Source link

Spread the love