హైదరాబాద్, వెలుగు: విమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో తన జోరు కొనసాగుతోంది. సోమవారం గచ్చిబౌలి హాకీ స్టేడియంలో స్కాట్లాండ్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో 2–-2తో డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ఇరు జట్లూ చెరో నాలుగు పాయింట్లతో మెరుగైన గోల్ డిఫరెన్స్ కారణంగా ఇండియా పూల్–-బి పట్టికలో టాప్ ప్లేస్ నిలబెట్టుకుంది.
ఆట ప్రారంభమైన 6వ నిమిషంలోనే స్కాట్లాండ్ ప్లేయర్ హెదర్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ కొట్టగా.. 18వ నిమిషంలో నవనీత్, 29వ నిమిషంలో సునేలిత గోల్స్‌తో ఇండియా 2-–1తో ఆధిక్యాన్ని అందించింది. కానీ, నాలుగు నిమిషాల తర్వాత స్కాటిష్ ప్లేయర్ బర్నెట్ గోల్ చేయడంతో స్కోరు సమమైంది. చివరి క్వార్టర్‌లో ఇండియా ఏకంగా తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లు దక్కించుకున్నా మరో గోల్ చేయలేకపోయింది. బుధవారం తర్వాతి మ్యాచ్‌లో వెల్స్‌తో తలపడనుంది.