LIVE FEED
వెలుగుమట్ల బాధితుల తరఫున జాగృతి పోరాటం చేస్తోంది: కవిత
- వెలుగుమట్ల బాధితుల తరఫున జాగృతి పోరాటం చేస్తోంది: కవిత
- రేపు 311 మందికి ఇళ్ల పట్టా టోకెన్లు ఇస్తామని చెప్పారట: కవిత
- అదే స్థలంలో 311 మందికి టోకెన్లు ఇస్తామని చెప్పడం మన విజయం: కవిత
- వెలుగుమట్లలో 311 మందికి ఇళ్లు ఉన్నాయని నమ్మారా?: కవిత
- అంత మందికి ఇళ్లు ఉంటే ఎంత ధైర్యంతో వెళ్లి వాటిని కూల్చారు?: కవిత
- జూబ్లీహిల్స్‌లో ఎవరైనా ఇళ్లు కట్టుకుంటే అలాగే కూలగొడతారా?: కవిత
- ఎంత మందికి ఇస్తారో చూసి, బాధితులు సమ్మతం అనుకుంటేనే దీక్షను విరమిద్దాం: కవిత
- మంత్రుల నుంచి తగిన స్పందన లేకుంటే ఎల్లుండి వరకు దీక్ష కొనసాగిద్దాం: కవిత
ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపు ఉదయం స్పీకర్ తీర్పు
- ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపు ఉదయం స్పీకర్ తీర్పు
- ఎమ్మెల్యేలు దానం, కడియం అనర్హత పిటిషన్లపై రేపు వెలువడనున్న నిర్ణయం
- రేపు ఉదయం 10 గం.కు తీర్పు ప్రకటించనున్న స్పీకర్ ప్రసాద్ కుమార్
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన అనర్హత పిటిషన్లపై తీర్పు ప్రకటించనున్న స్పీకర్
- ఈనెల 12న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
- సుప్రీంకోర్టు విచారణకు ముందే నిర్ణయం వెల్లడించనున్న స్పీకర్
హైదరాబాద్: కేపీహెచ్బీలో యువతి ఆత్మహత్య
- హైదరాబాద్: కేపీహెచ్బీలో యువతి ఆత్మహత్య
- ఇంట్లో ఉరి వేసుకుని సుష్మ(27) ఆత్మహత్య
- ఉద్యోగం రాలేదనే బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం
- మూడేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం చేసి తర్వాత ఖాళీగా ఉన్నట్లు సమాచారం
ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0 పేరుతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ డ్రైవ్
- ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0 పేరుతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ డ్రైవ్
- సైబర్ మోసాలకు వాడే మ్యూల్ బ్యాంక్ అకౌంట్లపై ప్రత్యేక డ్రైవ్
- మ్యూల్ ఖాతాలు సమకూర్చుతున్నట్లు బ్యాంకులను గుర్తించిన పోలీసులు
- మ్యూల్ ఖాతాలు నడుస్తున్న 137 బ్యాంక్ బ్రాంచ్‌లలో సోదాలు
- 1,888 మ్యూల్ ఖాతాలకు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలతో లింకులు
- దేశవ్యాప్తంగా 9,451 సైబర్ నేరాలతో లింకులున్న ఖాతాలు గుర్తింపు
- నిందితులు సుమారు రూ.100 కోట్లుపైగా కొల్లగొట్టనట్లు గుర్తింపు
- ఆపరేషన్ క్రాక్‌డౌన్‌తో 549 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన టీజీసీఎస్బీ
- 626 మంది అనుమానితులను గుర్తించి 208 మంది అరెస్టు
- ఖాతాలు అద్దెకిచ్చి లావాదేవీలపై 5శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు గుర్తింపు
- నిందితుల నుంచి 63 ఫోన్లు, 208 బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు స్వాధీనం
సికింద్రాబాద్ రైల్వేలో ఎస్ఐజీపై లైంగిక ఆరోపణల కేసు నమోదు
- సికింద్రాబాద్ రైల్వేలో ఎస్ఐజీపై లైంగిక ఆరోపణల కేసు నమోదు
- ఎస్ఐజీ వెంకటసుబ్రహ్మణ్యంపై ఫిర్యాదు చేసిన ట్రైనీ ఉద్యోగిని
- సెక్షన్ సూపర్వైజర్ వెంకటసుబ్రహ్మణ్యం వేధిస్తున్నాడని ఆరోపణ
- సికింద్రాబాద్ రైల్వే జీఆర్పీలో ఫిర్యాదు చేసిన ట్రైనీ ఉద్యోగిని
- విధుల్లో తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ట్రైనీ ఉద్యోగిని ఫిర్యాదు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు
హైదరాబాద్: బాచుపల్లిలో ఉద్యోగాల పేరిట భారీ మోసం
- హైదరాబాద్: బాచుపల్లిలో ఉద్యోగాల పేరిట భారీ మోసం
- ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసిన జక్కుల అజయ్ అరెస్టు
- ఎంఎన్సీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన అజయ్
- 137 మంది నుంచి సుమారు రూ.50 లక్షల వసూలు చేసినట్లు ఫిర్యాదులు
- ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.20 వేలు నుంచి రూ.90 వేల వరకు వసూలు
- హాక్సెన్స్ కంపెనీ పేరిట నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చిన జక్కుల అజయ్
- నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు
- పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
- కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
- హబీబ్‌నగర్ పరిధి షెహజాదా ఫుడ్ సెంటర్లో పోలీసుల సోదాలు దాడులు
- కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారుచేస్తున్న మహమ్మద్ ఫారుక్(50) అరెస్టు
- 1,090 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమం స్వాధీనం చేసుకున్న పోలీసులు
- 875 కిలోల పాచిపోయిన ముడి అల్లం, వెల్లుల్లి నిల్వలు స్వాధీనం
- ఎసిటిక్ యాసిడ్, గమ్పౌడర్, సింథటిక్ ఫుడ్కలర్స్తో అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారీ
- కల్తీ అల్లంవెల్లుల్లిని కిరాణాషాపులు, క్యాటరింగ్ సర్వీసులకు అమ్ముతున్నట్లు గుర్తింపు
వెలుగుమట్ల నిరాశ్రయులకు ఇంటిపట్టా, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
- ఖమ్మం: వెలుగుమట్ల నిరాశ్రయులకు ప్రభుత్వం తీపికబురు
- పేదలకు ఇంటిపట్టా, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
- రేపు 311 మందికి ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ
- మరో 101 మందికి ఇంటి నిర్మాణ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
- బాధితులకు రేపు పట్టాలు పంపిణీ చేయనున్న భట్టి, తుమ్మల, పొంగులేటి
- గడువుకు 4రోజులు ముందే వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ
వరంగల్ జిల్లా అభివృద్ధిపై మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ సమీక్ష
- వరంగల్ జిల్లా అభివృద్ధిపై మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ సమీక్ష
- సమీక్షకు హాజరైన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు: మంత్రి పొంగులేటి
- వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని జూన్‌లోపు తేవాలి: పొంగులేటి
- అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వచ్చే నెలలో ప్రారంభించాలి: మంత్రి పొంగులేటి
- డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఈనెలాఖరులోగా లబ్దిదారులను ఎంపిక చేయాలి: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం అనుమతి
- ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం అనుమతి
- పీఎం ఆవాస్ యోజన కింద పట్టణాల్లో 18,213 ఇళ్లకు కేంద్రం అనుమతి
- రూ.273 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకారం: హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్
గోపాలపురం పీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు
- గోపాలపురం పీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు
- సరోగసీ పేరుతో పిల్లలు లేని వారిని డాక్టర్ నమ్రత మోసం చేసినట్లు గుర్తింపు
- ఏజెంట్ల ద్వారా పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న డాక్టర్ నమ్రత
- ఏజెంట్ల ద్వారా పేద దంపతుల నుంచి పిల్లలను కొనుగోలు చేసినట్లు గుర్తింపు
- రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షలకే పిల్లలను కొనుగోలు చేసినట్లు గుర్తింపు
- సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డ అంటూ దంపతులను మోసం చేసినట్లు గుర్తింపు
తాగుడుకు బానిసై నెలరోజుల కుమారుడిని అమ్మకానికి పెట్టిన తండ్రి
- మెదక్: హవేలీఘనపూర్ మం. లింగసానిపల్లి శిశువు విక్రయం
- తాగుడుకు బానిసై నెలరోజుల కుమారుడిని అమ్మకానికి పెట్టిన తండ్రి
- నెల రోజుల కుమారుడిని రూ.5 లక్షలకు బేరం పెట్టిన తండ్రి
- అగ్రిమెంట్ రాసుకుని రూ.1.70 లక్షలు తీసుకుని బాలుడిని ఇచ్చేసిన తండ్రి
- కామారెడ్డి జిల్లాకు చెందిన పిల్లలు లేని దంపతులకు బాలుడి విక్రయం
- ఐసీడీఎస్ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్థులు
- బాలుడిని, తల్లిని మెదక్ పట్టణంలో సఖి కేంద్రానికి తరలింపు
- శిశువు విక్రయం ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సీఈవో రాజీనామా
- దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సీఈవో రాజీనామా
- ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- పీటర్ ఎల్బర్స్ వెంటనే పదవి నుంచి తొలుగుతారన్న ఇండిగో ఎయిర్‌లైన్
సికింద్రాబాద్: సృష్టి సరోగసీ సెంటర్ కేసులో వేగం పెంచిన ఈడీ
- సికింద్రాబాద్: సృష్టి సరోగసీ సెంటర్ కేసులో వేగం పెంచిన ఈడీ
- డాక్టర్ నమ్రత కుటుంబానికి చెందిన ఆస్తులను సీజ్ చేసిన ఈడీ అధికారులు
- డాక్టర్ నమ్రతకు చెందిన రూ.29.76 కోట్ల విలువైన స్థిర,చర ఆస్తులు సీజ్
- బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్లకుపైగా విలువచేసే ఆస్తులు సీజ్ చేసిన ఈడీ
- డాక్టర్ నమ్రత 2014 నుంచి అక్రమ సరోగసీలు చేస్తున్నట్లు ఆరోపణలు
హైదరాబాద్ మధురానగర్‌లో కత్తిపోట్ల కలకలం
- హైదరాబాద్ మధురానగర్‌లో కత్తిపోట్ల కలకలం
- కన్సల్టెన్సీ మేనేజర్, ట్రైనర్ లయపై వ్యక్తి కత్తి దాడి
- రూ.500 విషయంలో ఘర్షణపడి ఇద్దరిపై కత్తి దాడి
- ట్రైనర్ లయకు ప్రైవేట్ ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స
- తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శశికిరణ్‌రెడ్డి మృతి
- ట్రైనర్ లయకు ప్రైవేట్ ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స
- రూ.500 ఇవ్వాల్సిన విషయంలో శశికిరణ్‌రెడ్డిని హత్య చేసిన ప్రభు
- అక్కడే కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న లయపై ప్రభు కత్తితో దాడి
- ప్రభును ఒక హోటల్లో ఉద్యోగంలో పెట్టించిన శశికిరణ్‌రెడ్డి
- ఉద్యోగం నచ్చక తాను ఇచ్చిన రూ.2 వేలు తిరిగి ఇవ్వాలని శశికిరణ్‌తో ప్రభు గొడవ
- ప్రభుకి రూ.1,500 తిరిగి చెల్లించిన శశికిరణ్‌రెడ్డి
- మరో రూ.500 ఇవ్వాలని గొడవపడి కత్తితో దాడి చేసిన ప్రభు
- హైదరాబాద్: కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
రాష్ట్రంలో ఇప్పుడే గ్యాస్ కొరత వచ్చే అవకాశం లేదు: డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి
- గ్యాస్ కొరతపై స్పందించిన డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి
- రాష్ట్రంలో ఇప్పుడే గ్యాస్ కొరత వచ్చే అవకాశం లేదు: డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు
- ఇరాన్ యుద్ధం కొనసాగితే ఇబ్బందులు రావొచ్చు: డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు
- గ్యాస్ ఇబ్బందులు పెరగకుండా కేంద్రం అప్రమత్తమైంది: జగన్మోహన్రెడ్డి
- గృహవినియోగదారులకు కొరత రాకుండా కేంద్రం ముందస్తు చర్యలు: జగన్మోహన్రెడ్డి
- ఇప్పటికే వ్యాపార, హోటల్స్‌కు నిలిపివేస్తూ చమురు సంస్థలు నిర్ణయం: జగన్మోహన్రెడ్డి
- హాస్టళ్లు, ఆస్పత్రులు వంటి అత్యవసర విభాగాలకు మినహాయింపు: జగన్మోహన్రెడ్డి
- కమిటీ సిఫారసుల మేరకు అయిల్ కంపెనీలు కొనసాగించనున్న గ్యాస్ సరఫరా
- గృహవినియోగదారులు గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవాలి: డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు
కేంద్రమంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం
- కేంద్రమంత్రివర్గ సమావేశం(Cabinet Meeting)లో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం
- మదురైకి అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం
- జల్ జీవన్ మిషన్‌ను 2028 డిసెంబర్ వరకు పొడిగిస్తూ నిర్ణయం
శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దు
- శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 13 విమానాలు రద్దు
- శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన 12 విమానాలు
హోటళ్లకు సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు
- కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై పెట్రోలియం కంపెనీల నియంత్రణ
- హోటళ్లకు సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు
- ఆస్పత్రులు, హాస్టళ్లకు మాత్రమే కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేయాలని ఆదేశం
- గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని సూచన
- ఈకేవైసీ చేసుకోని వినియోగదారులకు బుకింగ్ నిలిపివేత
- ఇప్పటికే సిలిండర్ బుకింగ్ వ్యవధిని 25 రోజులకు పెంచిన కేంద్రం
ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస
- ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస
- మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్-బీజేపీ కౌన్సిలర్ల బాహాబాహీ
- ఆదిలాబాద్: పరస్పరం చొక్కాలు పట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు
- అజెండా పాస్ అంటూ తన ఛాంబర్‌కు వెళ్లిపోయిన ఛైర్పర్సన్ అనూష
- చర్చించకుండానే ఎలా పాస్ చేస్తారంటూ బీజేపీ కౌన్సిలర్ల ఆగ్రహం
- ఆదిలాబాద్ ఛైర్పర్సన్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన బీజేపీ కౌన్సిలర్లు
హైదరాబాద్: అత్యవసరంగా తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సమావేశం
- హైదరాబాద్: అత్యవసరంగా తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సమావేశం
- రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించే యోచనలో హోటల్స్ అసోసియేషన్
- కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా(LPG Problems) నిలిపివేతతో బంద్ నిర్వహించే యోచన
ఈనెల 13న పీఎం కిసాన్ నిధులు విడుదల
- ఈనెల 13న పీఎం కిసాన్ నిధులు విడుదల
- 22వ విడత పీఎం కిసాన్ నిధులు(PM Kishan Scheme) విడుదల చేయనున్న ప్రధాని
- రూ.19 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేయనున్న కేంద్రం
- ఈనెల 13న గువాహటిలో నిధులు విడుదల చేయనున్న ప్రధాని
- దేశవ్యాప్తంగా 9.32 కోట్ల రైతుల ఖాతాల్లో జమకానున్న పీఎం కిసాన్ నిధులు
భారత ఫాస్ట్ బౌలర్ అర్షదీప్‌సింగ్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు
- భారత ఫాస్ట్ బౌలర్ అర్షదీప్‌సింగ్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు
- అర్షదీప్‌సింగ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించిన ఐసీసీ
- టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్లో జరిగిన ఘటనపై ఐసీసీ చర్యలు
- కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ పైకి బాల్ విసిరిన ఘటనలో ఐసీసీ చర్యలు
- మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత, 1 డీమెరిట్ పాయింట్ విధిస్తూ చర్యలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీ సంఖ్యలో వైద్యుల భర్తీ
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీ సంఖ్యలో వైద్యుల భర్తీ
- 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెరిట్ లిస్ట్ విడుదల
- ఈనెల 12 నుంచి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్
- ఈనెలాఖరుకు పోస్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్న ఆరోగ్యశాఖ
గచ్చిబౌలిలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు
- గచ్చిబౌలిలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు
- ఫామ్‌హౌస్‌పై పెంచుకుంటున్న గంజాయి మొక్క స్వాధీనం
- గంజాయి సాగు చేస్తున్న వాచ్‌మెన్‌ను అరెస్టు చేసిన పోలీసులు
- నిందితుడు యూపీకి చెందిన మాతా బాదల్‌గా గుర్తింపు
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కు మరోసారి సీబీఐ సమన్లు
- కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కు మరోసారి సీబీఐ(CBI) సమన్లు
- ఈనెల 15న విజయ్ విచారణకు హాజరుకావాలని పేర్కొన్న సీబీఐ
- 2025 సెప్టెంబర్ 27న విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7వరకు గోదావరి పుష్కరాలు
- గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కేబినేట్ సబ్‌కమిటీ సమావేశం
- సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, కొండా సురేఖ
- సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల, అడ్లూరి లక్ష్మణ్
- బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీర ఆలయాల అభివృద్ధికి నిర్ణయం
- ప్రధాన ఆలయాలను అనుసంధానిస్తూ రోడ్లు అభివృద్ధి చేయాలని నిర్ణయం
- అత్యంత వైభవంగా పుష్కరాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలన్న మంత్రులు
- తదుపరి భేటీకి అన్నిశాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న మంత్రులు
- వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7వరకు గోదావరి పుష్కరాలు
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపు
- ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపు
- ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు
- ప్రభాకర్‌రావు దర్యాప్తునకు సహకరించాల్సిందేనన్న జస్టిస్ నాగరత్న ధర్మాసనం
- సాక్ష్యాలు, ఆధారాలు ట్యాంపర్ చేస్తే ముందస్తు బెయిల్ రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు
- సాక్షులను ప్రభావితం చేస్తే.. ముందస్తు బెయిల్ రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు
- ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లకూడదని పేర్కొన్న ధర్మాసనం
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం
- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం
- భారత్‌తో భూసరిహద్దు ఉన్న దేశాలకు ఎఫ్‌డీఐ(New FDI Rules) నిబంధనలు సడలింపు
- చైనా సహా భారత్‌తో సరిహద్దు ఉన్న దేశాలకు ఎఫ్‌డీఐ నిబంధనలు సడలింపు
మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులకు రూ.172కోట్ల హడ్కో రుణం
- మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులకు రూ.172కోట్ల హడ్కో రుణం
- హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు టీయూఎఫ్ఐడీసీకి ప్రభుత్వం అనుమతి
బహ్రెయిన్‌లో చిక్కుకున్న 600 మంది తెలుగు ప్రజల తరలింపు ప్రక్రియ ప్రారంభం
- బహ్రెయిన్‌లో చిక్కుకున్న 600 మంది తెలుగు ప్రజల తరలింపు ప్రక్రియ ప్రారంభం
- ఇవాళ్టి నుంచి రోజూ ఒక విమానంలో స్వదేశానికి చేరుకునేలా ఏర్పాట్లు
- ఏపీ ప్రభుత్వ నిర్దేశంతో గల్ఫ్ ఎయిర్ సంస్థతో ఏపీ భవన్ అధికారుల సంప్రదింపులు
- డీజీసీఏ, పౌర విమానయాన శాఖ అధికారులతో చర్చించిన తర్వాత విమాన సేవలు
- అధికారులతో చర్చించాక విమాన సేవలు ప్రారంభించిన గల్ఫ్ ఎయిర్ సంస్థ
- ఇవాళ 58 మందిని కొచ్చి విమానాశ్రయానికి తీసుకురానున్న గల్ఫ్ ఎయిర్ విమానం
- రేపు 138 మందితో ముంబయి చేరుకోనున్న మరో విమానం
- బహ్రెయిన్‌లో తెలుగు సంఘం, భారత రాయబార కార్యాలయం ద్వారా టికెట్ల కొనుగోలు ఏర్పాట్లు
హైదరాబాద్ చేరుకున్న నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఘట్టం మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు: హరీశ్‌రావు
- ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఘట్టం మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు: హరీశ్‌రావు
- ట్యాంక్‌బండ్ మీద తెలంగాణ ఆత్మగౌరవం ఉప్పొంగిన రోజు: హరీశ్‌రావు
- ఆనాటి పోరాట స్ఫూర్తి ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఇప్పటికీ సజీవం: హరీశ్‌రావు
- ఉమ్మడి రాష్ట్రంలో మన హక్కుల కోసం, మన అస్తిత్వం కోసం
- కొట్లాడాం: హరీశ్‌రావు
- నేడు మన వనరులను మళ్లీ దోచుకోవాలని చూస్తున్నారు: హరీశ్‌రావు
- రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం: హరీశ్‌రావు
కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి పొన్నం బహిరంగ లేఖ
- కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి పొన్నం బహిరంగ లేఖ(Ponnam Letter)
- రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది: పొన్నం
- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: పొన్నం ప్రభాకర్
- కేంద్రం నుంచి వచ్చే నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు: పొన్నం
- పనులు చెల్లిస్తున్నప్పుడు ప్రజల అభివృద్ధికి ఎందుకు చర్యలు చేపట్టట్లేదు: పొన్నం
- పెండింగ్ ప్రాజెక్టులపై బండి సంజయ్, కిషన్‌రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలి: పొన్నం
- తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లు విస్మరించడం తగదు: పొన్నం
- కేంద్ర ప్రయోజత పథకాల్లో కేంద్ర వాటా 90శాతం ఉండే విధంగా పునరుద్ధరించాలి: పొన్నం
వెలుగుమట్ల విషయంలో సీపీఐ పాత్ర లేదనడం నిరాధార ఆరోపణలు: కూనంనేని
- వెలుగుమట్ల విషయంలో సీపీఐ పాత్ర లేదనడం నిరాధార ఆరోపణలు: కూనంనేని
- పేదల పేరుతో ఎవరైనా వ్యాపారం చేస్తే చర్యలు తీసుకోవచ్చు: కూనంనేని సాంబశివరావు
- కూల్చిన వాళ్లకు ఖమ్మంలోనే ఇళ్లు ఇవ్వాలని మంత్రితో మాట్లాడాను: కూనంనేని
- లొంగిపోయిన మావోయిస్టులకు సీపీఐలోకి ఆహ్వానిస్తున్నాం: కూనంనేని
- కలిసి పనిచేద్దాం.. ఒకే పార్టీగా ఎదిగి.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదుగుదాం: కూనంనేని
సచివాలయంలో గోదావరి పుష్కరాలపై కేబినేట్ సబ్ కమిటీ సమావేశం
- సచివాలయంలో గోదావరి పుష్కరాలపై కేబినేట్ సబ్ కమిటీ సమావేశం
- సమావేశానికి హాజరైన మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్డూరి లక్ష్మణ్, కొండా సురేఖ
- సమావేశానికి హాజరైన పొంగులేటి, తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
- లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వర్క్‌షాప్
- గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వర్క్‌షాప్
- కార్యశాలలో పాల్గొన్న కేటీఆర్, తలసాని, వివేకానంద, సబిత
- అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం
ఇప్పటివరకు లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ లేరు : గౌరవ్ గొగొయ్
- ఇప్పటివరకు లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ లేరు: గౌరవ్ గొగొయ్
- డిప్యూటీ స్పీకర్ లేకుండానే లోక్‌సభ నడుస్తోంది: గౌరవ్ గొగొయ్
- ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు.. స్పీకర్ ఓం బిర్లా తరచూ అంతరాయం కలిగించేవారు: గౌరవ్
- స్పీకర్ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి: గౌరవ్ గొగొయ్
- రాహుల్‌గాంధీ ప్రసంగానికి స్పీకర్ అనుమతించలేదు: గౌరవ్ గొగొయ్
- 8 మంది విపక్ష సభ్యులను సరైన కారణంలేకుండానే స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు: గౌరవ్ గొగొయ్
- ప్రధానిపై కాంగ్రెస్ ఎంపీలు దాడి చేసే అవకాశం ఉందని స్పీకర్ తప్పుడు ఆరోపణలు చేశారు: గౌరవ్ గొగొయ్
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,67,580
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,67,580
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,850
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,85,000
లోక్‌సభలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం
- లోక్‌సభలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం
- స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 గంటలు కేటాయింపు
- అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 278 మంది సభ్యుల మద్దతు అవసరం
- ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతు
- ప్రస్తుతం లోక్‌సభలో ఇండి కూటమికి 234 మంది సభ్యుల మద్దతు
శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు స్వాగతం పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు
- గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు స్వాగతం పలికిన సీఎస్, డీజీపీ
చమురు శుద్ధి సంస్థలపై అత్యవసర వస్తువుల చట్టం ప్రయోగించిన కేంద్రం
- చమురు శుద్ధి సంస్థలపై అత్యవసర వస్తువుల చట్టం ప్రయోగించిన కేంద్రం
- పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు కృత్రిమ కొరత సృష్టించకుండా కేంద్రం నిర్ణయం
- ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా పెట్రోలియం శాఖ చర్యలు
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో వరసిద్ధి వినాయక ఆలయంలో చోరీ
- సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో వరసిద్ధి వినాయక ఆలయంలో చోరీ
- ఆలయంలో 6 తులాల బంగారం, 8 కిలోల వెండి, రూ.90 వేల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రామచంద్రాపురం పోలీసులు
భూదాన్ భూములు అంటేనే పేదలకు ఇచ్చిన భూములు: కవిత
- భూదాన్ భూములు అంటేనే పేదలకు ఇచ్చిన భూములు: కవిత
- వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా మేము దీక్ష చేస్తున్నాం: కవిత
- నిన్న మధ్యాహ్నం నుంచి మా దీక్ష కొనసాగుతూనే ఉంది: కవిత
- ప్రభుత్వం.. 31 ఎకరాల పేదల భూమిని పెద్దవారికి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది: కవిత
- బాధితులకు భూదాన్ భూమిలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి: కవిత
- బాధితులకు ఇళ్లు ఇచ్చి.. న్యాయం జరిగేదాక నిరాహార దీక్ష కొనసాగిస్తా: కవిత
- ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నా.. బాధితుల పరిస్థితి దారుణంగా ఉంది: కవిత
- వెలుగుమట్లలో ఏం జరిగిందో రాహుల్‌గాంధీ తెలుసుకోవాలి: కవిత
- బాధితులకు న్యాయం చేయాలని రాహుల్‌గాంధీకి బహిరంగ లేఖ రాస్తున్నాం: కవిత
కామారెడ్డి: దోమకొండలో ఐదుగురిపై పిచ్చి కుక్కల దాడి
- కామారెడ్డి: దోమకొండలో ఐదుగురిపై పిచ్చి కుక్కల దాడి
- ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రి తరలింపు
హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకున్న కవిత
- హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకున్న కవిత
- ఖమ్మం వెలుగుమట్ల నుంచి హైదరాబాద్‌కు కల్వకుంట్ల కవిత
- వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష కొనసాగించనున్న కవిత
భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
- భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
- 800 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్
- 200 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం
- శాసనసభ కార్యకలాపాలు, బడ్జెట్, రాజకీయ అంశాలపై అవగాహన సదస్సు
- హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో బీఆర్ఎస్ నేతల వర్క్ షాప్
మెదక్ ఏడుపాయలలో చెల్మకుంట వద్ద మహిళ మృతదేహం లభ్యం
- మెదక్ ఏడుపాయలలో చెల్మకుంట వద్ద మహిళ మృతదేహం లభ్యం
- గుర్తుతెలియని వ్యక్తులు మహిళను హత్య చేసినట్లు పోలీసుల గుర్తింపు
- మెదక్: ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
నేడు హైదరాబాద్ రానున్న కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- నేడు హైదరాబాద్ రానున్న కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఉ.11 గం.కు శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- విమానాశ్రయంలో కొత్త గవర్నర్‌కు స్వాగతం పలకనున్న సీఎం రేవంత్‌రెడ్డి
నార్కట్‌పల్లి సమీపంలో ప్రమాదం, ఇద్దరు మృతి
- నల్గొండ: నార్కట్‌పల్లి సమీపంలో ప్రమాదం, ఇద్దరు మృతి
- నల్గొండ జిల్లా: ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు
- లారీని ఓవర్ టేక్ చేస్తూ తాకుతూ ముందుకెళ్లిన ట్రావెల్స్ బస్సు
- లారీ, ట్రావెల్స్ బస్సును రహదారి పక్కన ఆపి ఘర్షణకు దిగిన డ్రైవర్లు
- లారీ వెనకాల ఉండి ఘర్షణ పడుతుండగా వెనుక నుంచి ఢీకొట్టిన మరో లారీ
- రెండు లారీల మధ్యలో ఇరుక్కుపోయి ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
- మృతులు శ్రీనివాస్, బంగారయ్యగా గుర్తింపు
టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం
- తిరుమల: టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం
- శ్రీవారి సర్వదర్శనానికి 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,526 మంది భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.41 కోట్లు
- నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 26,664 మంది భక్తులు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
- ఖమ్మం: వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా రాత్రి నుంచి కవిత నిరాహరదీక్ష
- డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌తో కలిసి నిరాహార దీక్ష చేపట్టిన కవిత
- కవితతో పాటు నిరాహారదీక్ష చేపట్టిన వారిని అరెస్టు చేసిన పోలీసులు
- అరెస్టు చేసిన వారిని హైదరాబాద్ తరలిస్తున్న ఖమ్మం పోలీసులు
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం
- నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం
- శాసనసభ కార్యకలాపాలు, బడ్జెట్, రాజకీయ అంశాలపై అవగాహనా సదస్సు
- హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో బీఆర్ఎస్ నేతల వర్క్ షాప్
తుదిదశకు చేరుకున్న రాష్ట్ర బడ్జెట్ కసరత్తు
- తుదిదశకు చేరుకున్న రాష్ట్ర బడ్జెట్ కసరత్తు
- ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలపై నేటి నుంచి మళ్లీ సమీక్షలు
- మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్న డిప్యూటీ సీఎం భట్టి
- ఆయా శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష
ఇవాళ, రేపు సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు
- ఇవాళ, రేపు సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు
- సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన సమావేశాలు
- తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చించనున్న నేతలు
- ప్రజా సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్న నేతలు
వంటగ్యాస్ బుకింగ్ వ్యవధి 25 రోజులకు పెంచిన కేంద్ర ప్రభుత్వం
- దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించేందుకు కేంద్రం చర్యలు
- వంటగ్యాస్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్రం
- వంటగ్యాస్ బుకింగ్ వ్యవధి 25 రోజులకు పెంచిన కేంద్ర ప్రభుత్వం
- రెండు గ్యాస్ బుకింగ్ మధ్య కనీస గడువు 21 నుంచి 25 రోజులకు పెంపు
- బ్లాక్ మార్కెటింగ్‌ను అరకట్టడమే లక్ష్యమన్న కేంద్రం
- ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం
- వాణిజ్య అవసరాల కంటే, గృహాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచన