బంగారం ధరలు నేడు భారతదేశంలో బంగారం ధర మళ్లీ పెరిగాయి


  • గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్
  • యుద్ధంతో మళ్లీ మారుతున్న పరిణామాలు
  • రెండోరోజు పెరిగిన గోల్డ్ రేట్
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

పసిడి ప్రియులకు మళ్లీ ఝలక్ తగిలింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం ధరలు తగ్గొచ్చని భావించిన మగువలకు మళ్లీ షాకిస్తున్నాయి. రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు… ముఖ్యంగా మధ్యప్రాచ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు తులం బంగారం ధరపై రూ.930 పెరగగా.. వెండి ధర మాత్రం యథాతథంగా నిలకడగా ఉంది.

ఇది కూడా చదవండి: Jaishankar: ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చికి జైశంకర్ ఫోన్.. ఏం మాట్లాడారంటే..!

తులం గోల్డ్‌పై రూ.9300 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,310 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.850 పెరగడంతో రూ.1,49,700 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.690 పెరగడంతో రూ.1,22,480 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఈరోజు సిల్వర్ ధర మాత్రం ఉపశమనం కలిగించింది. వెండి ధర యథాతథంగా ఉండటంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,90,000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,00,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి రూ.2,90, 000 దగ్గర అమ్ముడవుతోంది.

ఇది కూడా చదవండి: ఇరాన్-యుఎస్: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. హార్ముజ్ జలసంధి దగ్గర 16 ఇరాన్ బోట్లు ధ్వంసం





Source link

Spread the love